Premalu heroine about her Tollywood Entry: 'ప్రేములు' చిన్న సినిమాగా, ఎలాంటి అంచనాలు లేకుండా మలయాళంలో రిలీజైంది ఈ సినిమా. కానీ, అనూహ్యంగా దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసింది ఈ రొమాంటిక్‌ కామెడీ డ్రామా. యూత్‌ని ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా మార్చి 8న తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది చిత్రబృందం. దాంట్లో భాగంగా వివిధ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా సినిమాలో లీడ్‌రోల్‌ చేసిన మమిత బైజు తన టాలీవుడ్‌ ఎంట్రీ గురించి ఆసక్తికర ఆన్సర్‌ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే? 


టాలీవుడ్‌లోకి అప్పుడే ఎంట్రీ.. 


'ప్రేమలు' ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు మమిత.  తెలుగులోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారు" అని అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా చెప్పుకొచ్చారు. "తెలుగులో నటించాలనే ఉంది. కానీ, స్క్రీప్ట్‌ను లోతుగా పరిశీలించి, తెలుసుకుని అద్భుతంగా నటించాలనేది నా ఆలోచన. దాని కోసం ముందు చక్కగా తెలుగు నేర్చుకోవాలి అనుకుంటున్నాను" అని తన మనసులోని మాటలను చెప్పారు ఆమె.


యూత్‌లో క్రేజ్‌.. 


మలయాళంలో ఇప్పటికే రిలీజైన ఈ సినిమా యువతని బాగా ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించిందంటే ఎంత భారీ హిట్‌ అయ్యిందో చెప్పొచ్చు. ఇక లవ్‌స్టోరీ కావడంతో యూత్‌లో సినిమా యమా క్రేజ్‌ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్‌ తెలుగులో రిలీజ్‌ అయ్యింది. ఆ ట్రైలర్‌ చూసిన చాలామంది మమితకు ఫ్యాన్స్‌ అయిపోయారు. దీంతో డైరెక్ట్‌గా తెలుగులో ఆమె ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందో అని వెయిట్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి 9న రిలీజైన ఈసినిమాకి చాలా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో 'ప్రేమలు' తెలుగు రైట్స్ కోసం చాలా పోటీ నెలకొంది. చివ‌రికి రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ తెలుగు రైట్స్‌ని ద‌క్కించుకొని ఈనెల 8న విడుద‌ల చేస్తున్నారు.


ఆకట్టుకున్న ట్రైలర్‌.. 


ఈ సినిమా ట్రైలర్‌ అంచనాలను పెంచేసింది. హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది ఈ సినిమా. ఇక మలయాళంలో రిలీజ్‌ చేసిన ట్రైలర్‌కే తెలుగు డైలాగులు జోడించి రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో సోషల్‌ మీడియాలో ఈ మధ్య బాగా ఫేమస్‌ అయిన కుమారీ ఆంటీ గురించి ప్రస్తావించారు. లవ్‌ అండ్ కామెడీతో ట్రైలర్‌ యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. హీరో రైలు వెనకాల పరుగు తీస్తున్న సీన్‌తో ట్రైలర్‌ మొదలైంది. 


ఇక ‘ప్రేమలు’ సినిమాలో నెల్సన్ కే గఫూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించారు. ఏడీ గిరీశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నెల్సన్, మమితా యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‍ లో కొనసాగుతుంది. తెలుగు వెర్షన్ మూవీకి ఈ పాయింట్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లతో కలిసి ఫహద్ ఫాసిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విష్ణు విజయ్ సంగీతం అందించారు.


Also Read: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - జపాన్‌లో ‘పుష్ప 2’ రిలీజ్‌పై క్లారిటీ