Costliest Bollywood Weddings: భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు పెళ్లి కోసం ఏకంగా రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ ప్రముఖుల రాక, వారి విడిది ఏర్పాటు, నోరూరించే వంటలకు పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు పెడుతున్నారట. ఈ పెళ్లి ఒక్కటే కాదు, పలువురు బాలీవుడ్ స్టార్ కపుల్స్ కూడా తమ వివాహం కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు. ఇంతకీ ఏ జంట ఎంత ఖర్చు పెట్టిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1. రణబీర్ కపూర్ & అలియా భట్ – రూ. 2.5 కోట్లు
రణబీర్ కపూర్, అలియా భట్ తమ పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ స్టార్ కపుల్ వివాహానికి రూ. 2.5 కోట్లు ఖర్చు అయినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
2. శిల్పా శెట్టి & రాజ్ కుంద్రా – రూ.4 కోట్లు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కన్నడ సాంప్రదాయంలో తమ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి కోసం ఏకంగా రూ. 4 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్ వినిపించింది.
3. ప్రియాంక చోప్రా & నిక్ జోనాస్ – రూ.5 కోట్లు
హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, పాప్ సింగర్ నిక్ ఉమైద్ భవన్లో ఘనంగా పెళ్లి వేడుక జరుపుకున్నారు. ఒక రాత్రికి రూ. 64 లక్షలు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లికి దాదాపు రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేశారట. పెళ్లి తర్వాత ఓ ఇంటర్వ్యూలో నిక్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
4. అర్పితా ఖాన్ & ఆయుష్ శర్మ – రూ.5 కోట్లు
సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లి అర్పితా ఖాన్ వివాహం హైదరాబాద్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగింది. ఆయుష్ శర్మను అట్టహాసంగా కట్టుకుంది. ఈ పెళ్లి కోసం సల్మాన్ రూ.5 కోట్లు ఖర్చు చేశారు.
5. సిద్ధార్థ్ మల్హోత్రా & కియారా అద్వానీ – రూ.6 కోట్లు
బాలీవుడ్ స్టార్స్ సిద్దార్థ్ మాల్హోత్రా, కియారా అద్వానీ రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కోసం ఏకంగా రూ. 6 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.
6. విక్కీ కౌశల్ & కత్రినా కైఫ్ – రూ.7 కోట్లు
బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ సవాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. ఈ పెళ్లి జరిగిన హోటల్ లో అతిథులకు ఒక రాత్రికి రూ.5 లక్షల ఖరీదు చేసే సూట్లను కేటాయించారు. దాదాపు 80 మందికిపైగా అతిథులకు ఈ సూట్లు బుక్ చేశారు. హోటల్ ఖర్చే రూ. 4 కోట్లు అయినట్లు తెలుస్తోంది. మొత్తం ఖర్చు రూ. 7 కోట్లు దాటిందట.
7. ఐశ్వర్య రాయ్ & అభిషేక్ బచ్చన్ – రూ. 9 కోట్లు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వారి వివాహం ఇంట్లోనే జరిగినప్పటికీ ఏర్పాట్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ పెళ్లి కోసం ఏకంగా రూ. 9 కోట్లు ఖర్చు పెట్టినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.
8. కరీనా కపూర్ & సైఫ్ అలీ ఖాన్ – రూ.10 కోట్లు
బాలీవుడ్ జీరో సైజ్ బ్యూటీ కరీనా కపూర్, స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పెళ్లి కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుక కోసం ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
9. దీపికా పదుకొనే & రణవీర్ సింగ్ – రూ.77 కోట్లు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి కోసం వారు ఏకంగా రూ. 77 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
10. విరాట్ కోహ్లీ & అనుష్క శర్మ – రూ.100 కోట్లు
ప్రపంచ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ జరిగిన ఈ వేడుక కోసం ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: అనంత్ అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా? ఆశ్చర్యపోయిన జుకర్‌బర్గ్ దంపతులు