This Week Telugu OTT Movies: ప్రతివారం ఓటీటీ వేదికగా పలు సినిమాలు సందడి చేస్తుంటాయి. ఎప్పటి లాగే ఈ వారం కూడా పలు సినిమాలు స్ట్రీమింగ్ కాబోతోతున్నాయి. వాటిలో పలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. మార్చి 3 నుంని 9 వరకు ఆయా ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
నెట్ ఫ్లిక్స్
1. లాల్ సలామ్- మార్చి 8న విడుదల
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సలామ్’, విక్రమ్, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో రజనీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత ఆదరణ లభించలేదు. ఈ సినిమాని స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. విక్రాంత్, టాలీవుడ్ నటులు జీవిత రాజశేఖర్ తదితరులు ఈ సినిమాలో కనిపించారు. 'లాల్ సలాం' సినిమాలోక్రికెట్ లెంజెండ్ కపిల్ దేవ్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకుర్చారు.
2. మెర్రీ క్రిస్మస్- మార్చి 8న విడుదల
విజయ్ సేతుపతి, బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించిన సినిమా ‘మెర్రీ క్రిస్మస్’. ఈ సినిమాని హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కించారు. తెలుగులోనూ డబ్ చేశారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా మార్చి 8 నుంచి ఓటీటీ వేదికగా అందుబాటులోకి రాబోతోంది.
3. అన్వేషిప్పిన్ కండేతుమ్- మార్చి 8న విడుదల
మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ త్వరలోనే ఓటీటీలో అడుగు పెట్టనుంది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. మార్చి 8 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా పలు భాషల్లో విడుదల కానుంది. టోవినో థామస్, వినీత్ తటిల్ డేవిడ్, సిద్ధిక్, ప్రమోద్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు డార్విన్ కురియకోస్ దర్శకత్వం వహించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో
1. బ్యాచిలర్ పార్టీ- మార్చి 4న విడుదల
ఈ మధ్య కన్నడలో సూపర్ హిట్ అయిన కామెడీ సినిమా ‘బ్యాచిలర్ పార్టీ’. జనవరి 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. కలెక్షన్లు కూడా బాగానే సంపాదించింది. రక్షిత్ శెట్టి నిర్మించిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో మార్చి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించారు. పరమ్ వహ్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు రక్షిత్ శెట్టి, జీఎస్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరించారు.
2. యాత్ర 2- మార్చి 8న విడుదల
'యాత్ర' చిత్రానికి కొనసాగింపుగా మహి వి రాఘవ్ తీసిన తాజా సినిమా 'యాత్ర 2'. తండ్రి మరణం నుంచి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటించగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా నటించాడు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మార్చి 8 నుంచి అందుబాటులోకి రానుంది.
Zee5
1. హనుమాన్- మార్చి 8న విడుదల
తేజ సజ్జా హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఫాంటసీ యాక్షన్ మూవీ ‘హనుమాన్’. థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా Zee5 ఓటీటీ వేదికగా విడుదలకు రెడీ అవుతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
Read Also: షారుఖ్ చేతిలో పామును పెట్టి షాకిచ్చిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నవ్వులే నవ్వులు