Tulasivanam Teaser: ‘తులసివనం’ వెబ్ సిరీస్ టీజర్ విడుదల - ఇది తులసిగాడి బయోపిక్!

Tulasivanam Web Series: యూత్‌ఫుల్ కథలతో వెబ్ సిరీస్‌లను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. అదే తరహాలో ‘తులసివనం’ అనే సిరీస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది

Continues below advertisement

Tulasivanam Web Series Teaser: ఈరోజుల్లో యూత్‌ఫుల్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో.. యూత్‌ఫుల్ వెబ్ సిరీస్‌లకు కూడా అంతే క్రేజ్ లభిస్తోంది. అందుకే ప్రస్తుతం ఓటీటీ యాప్స్ అన్నీ ఎక్కువగా వెబ్ సిరీస్‌లపైనే దృష్టిపెట్టాయి. ఇక ఇటీవల ‘#90స్’ అనే వెబ్ సిరీస్‌తో తాను కూడా రేసులో ఉన్నానని నిరూపించుకున్న ఈటీవీ విన్.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే సిరీస్‌తో రానున్నట్టు ప్రకటించింది. అదే ‘తులసివనం’. దర్శకుడు తరుణ్ భాస్కర్.. ఈ వెబ్ సిరీస్‌ను ప్రజెంట్ చేయడం విశేషం. తాజాగా ‘తులసివనం’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్ విడుదలయ్యి యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది.

Continues below advertisement

స్ట్రీమింగ్ అప్పటినుండే..

ఇది తులసి అనే కుర్రాడి కథ. తన తండ్రి తను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకుంటుండగా.. తులసి మాత్రం యాక్టర్ అవ్వాలని అనుకుంటాడు. అలా తన జీవితంలో ఎదురైన అనుభవాల గురించి ఫన్నీగా చెప్పే వెబ్ సిరీస్ ‘తులసివనం’. ఈ వెబ్ సిరీస్‌లో కామెడీ ఏ రేంజ్‌లో ఉండబోతుంది అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో లీడ్ రోల్‌గా తులసి అనే పాత్రలో అక్షయ్ లగుసాని నటించాడు. తనకు జోడీగా, సిరీస్‌లో హీరోయిన్‌గా ఐశ్వర్య హోలక్కల్ అలరించనుంది. మార్చి 21న ఈ వెబ్ సిరీస్.. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈటీవీ విన్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ సిరీస్ యాడ్ అవ్వనుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

మొదటిసారి దర్శకుడిగా..

‘తులసివనం’లో అక్షయ్ లగుసానితో పాటు వెంకటేశ్ కకుమాను కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. హీరో బెస్ట్ ఫ్రెండ్ అయిన గిరి బాబు పాత్రలో వెంకటేశ్ నటించనున్నాడు. తరుణ్ భాస్కర్ సొంత బ్యానర్ అయిన వీజీ సైన్మా.. ఈ సిరీస్‌ను ప్రజెంట్ చేస్తోంది. అందుకే అభినవ్ గోమాటం కూడా ఇందులో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడని టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అనిల్ రెడ్డి.. ‘తులసివనం’తో దర్శకుడిగా మారుతున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా మారినప్పటి నుండి తనతో కలిసి పనిచేస్తున్నాడు అనిల్ రెడ్డి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ద్వారా తానే స్వయంగా డైరెక్షన్‌లోకి అడుగుపెడుతున్నాడు.

వరుసగా వెబ్ సిరీస్‌లు..

ప్రీతమ్ దెవిరెడ్డి, సాయి కృష్ణ గద్వాల్, నిలిత్ పైడిపల్లి, సాయి జాగర్లమూడి, జీవన్ కుమార్, అనిల్ రెడ్డి.. ‘తులసివనం’ వెబ్ సిరీస్‌కు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇప్పటికే పలు యూత్‌ఫుల్ వెబ్ సిరీస్‌లతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అక్షయ్ లగుసాని. నిహారిక కొణిదెల హీరోయిన్‌గా నటించిన ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా తనకు జోడీగా అక్షయే నటించాడు. ఇక అక్షయ్, ఐశ్వర్య కాంబినేషన్‌లో ఇంతకు ముందే ‘హాస్టల్ డేస్’ అనే వెబ్ సిరీస్ వచ్చింది. అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో ఐశ్వర్య హోలక్కల్.. ఒక చిన్న పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు వరుసగా వెబ్ సిరీస్‌లలో లీడ్ రోల్స్ చేస్తూ బిజీ అయిపోయింది.

Also Read: ‘ఫ్యామిలీ స్టార్’ అప్డేట్ - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Continues below advertisement
Sponsored Links by Taboola