Pooja Hegde look as Ammu in Guntur Kaaram: 'గుంటూరు కారం'లో హీరోయిన్లు ఎవరు? అంటే ప్రేక్షకులు వెంటనే శ్రీ లీల, మీనాక్షీ చౌదరి పేర్లు చెబుతారు. ఆ ఇద్దరి కంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా, మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డే (Pooja Hegde)ను తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు ఆమెపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే... అనుకోని కారణాల వల్ల, పరస్పర అంగీకారంతో సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకొన్నారు. అప్పుడు మీనాక్షీ చౌదరి వచ్చారు. ఇప్పుడు మళ్లీ గుంటూరు కారం, పూజా హెగ్డే ప్రస్తావన ఎందుకు? అంటే... ఆమె షూటింగ్ చేసినప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 


అమ్ముగా పూజా హెగ్డే... 
మరదలి పాత్రలో శ్రీ లీల!
మహేష్ అభిమానులు, నెటిజన్లు షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తే... 'గుంటూరు కారం' సినిమాలో తొలుత అమ్ము పాత్రకు పూజా హెగ్డేను తీసుకున్నట్లు అర్థం అవుతోంది. ఎల్లో కలర్ చుడిదార్ వేసిన బుట్ట బొమ్మ స్టిల్స్ చూస్తుంటే... హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లినప్పుడు సన్నివేశాలు షూటింగ్ చేసినట్లు ఉన్నారు. ఆ ఫోటోల్లో శ్రీ లీల కూడా ఉన్నారు. లంగా వోణీ ధరించి కనిపించారు. మహేష్ బాబు మరదలిగా మీనాక్షీ చౌదరి చేసిన పాత్రను తొలుత ఆమెకు ఇచ్చినట్లు ఉన్నారు.


Also Read: తమన్నా కొత్త సినిమా లుక్ లీక్ - సాధువుల్లో నాగ సాధువుగా ఆమె బొట్టు, కట్టు చూశారా?






పూజా హెగ్డే నటిస్తే బ్లాక్ బస్టర్ అయ్యేదా?
'గుంటూరు కారం' సినిమాలో పూజా పాపను పెట్టినా బావుండేదని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరొక నెటిజన్ అయితే 'అంత షూటింగ్ చేసి ఎందుకు తీసేశారు అండీ' అని అమకాయంగా ప్రశ్నించాడు. పూజా హెగ్డే నటిస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదని ఇంకొకరు పేర్కొన్నారు. ప్రజెంట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ అంతా పూజా హెగ్డే పేరు ట్రెండ్ అవుతోంది. ఆ పేరుతో పాటు ఈ ఫోటోలు కూడా!


Also Readవ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - ఆర్జీవీ తీసిన సినిమా ఎలా ఉందంటే?














'గుంటూరు కారం' సినిమాకు ముందు మహేష్ బాబుకు జోడీగా 'మహర్షి'లో పూజా హెగ్డే నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ', 'అల వైకుంఠపురములో' సినిమాలు చేశారు. మళ్లీ మహేష్ - పూజ, త్రివిక్రమ్ - పూజ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందో? లెట్స్ వెయిట్ అండ్ సి.