Tamannaah Bhatia pics leaked from Odela 2 movie sets: తమన్నాకు గ్లామర్ గాళ్ ఇమేజ్ ఉంది. లాస్ట్ ఇయర్ 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్, అంతకు ముందు కొన్ని సినిమాల్లో గ్లామర్ ఒలకబోశారు. 'గుర్తుందా శీతాకాలం', 'బబ్లీ బౌన్సర్' సినిమాల్లో డిఫరెంట్ & యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ చేశారు. 'బాహుబలి'లో యుద్ధ సన్నివేశాల్లో నటించారు. కమర్షియల్ కథానాయికగానూ, నటిగానూ తమన్నా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అయితే... ఆమెను మిల్కీ బ్యూటీగా చూసే ప్రేక్షకులు ఎక్కువ. అటువంటి జనాలకు షాక్ ఇచ్చేలా కొత్త సినిమా 'ఓదెల 2'లో తమన్నా డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన ఫోటోలు చూస్తే మీరూ ఆ మాటే అంటారు.


'ఓదెల 2'లో నాగ సాధువుగా తమన్నా
Tamannaah role in Odela 2 movie revealed: రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన సంచలన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కు సంపత్ నంది కథ అందించారు. అశోక్ తేజ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'ఓదెల 2'లో తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈసారి థియేటర్లలో, వివిధ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌ వర్క్స్ సంస్థలపై డి మధు ప్రొడ్యూస్ చేస్తున్నారు.


వారణాసిలో 'ఓదెల 2' సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కాశీలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. చిత్రీకరణ చేస్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజెంట్ ఆ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.


Also Readవ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - ఆర్జీవీ తీసిన సినిమా ఎలా ఉందంటే?






తమన్నా 'ఓదెల 2' కథ ఏమిటంటే?
Odela 2 Movie Story: 'ఓదెల 2' సినిమా కథ విషయానికి వస్తే... సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి ఎలా రక్షిస్తాడు? అనే మెయిన్ కాన్సెప్ట్. మల్లన్న స్వామిగా పూజించబడే శివుని త్రిశూలంతో టైటిల్ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకుడు: రాజీవ్ నాయర్, ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్ ఎస్, సంగీతం: 'విరూపాక్ష', 'మంగళవారం', 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్ నాథ్.


తమన్నా చేతిలో మరో రెండు సీక్వెల్స్
Tamannaah Bhatia upcoming movies: 'ఓదెల 2' కాకుండా తమన్నా చేతిలో మరో రెండు సీక్వెల్స్ ఉన్నాయి. తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో 'అరణ్మణై 4', హిందీలో 'స్త్రీ 2' చేస్తున్నారు. ఇవి కాకుండా హిందీలో మరో సినిమా 'వేద' కూడా చేస్తున్నారు. తెలుగులో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.


Also Readఓం భీమ్ బుష్... హుషారు భామ కూడా - అయితే, ఓ ట్విస్ట్!