Hindi movies releasing this week: మార్చి 8న విడుదలకు సిద్ధమైన హిందీ చిత్రాల్లో 'సైతాన్' (Shaitan movie 2024) ఒకటి. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, సౌత్ స్టార్ ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో జ్యోతిక మరో ప్రధాన పాత్రధారి. 'సైతాన్' స్పెషాలిటీ ఏమిటంటే... పాతికేళ్ల తర్వాత జ్యోతిక నటించిన హిందీ చిత్రమిది. ఇరవై సంవత్సరాల మాధవన్, జ్యోతిక నటించిన చిత్రమిది. ఆత్మలు, క్షుద్రపూజలు నేపథ్యంలో సినిమా తీశారు. 'సైతాన్' విడుదల సందర్భంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కథల ఎంపికలో తాను ఏ విషయానికి ప్రాముఖ్యం ఇస్తాననేది జ్యోతిక చెప్పారు. 


రెండు మూడు మంచి సీన్లు ఉన్నా చాలు!
''హిందీ పరిశ్రమలో పాతికేళ్ల తర్వాత సినిమా చేశా. సౌత్ సినిమాల్లో అర్థవంతమైన, గొప్ప కథలతో తెరకెక్కిన సినిమాల్లో నటించా. డిఫరెంట్ సినిమాలు చేశా. వివిధ రకాల పాత్రలు పోషించా. నిజంగా ఇప్పుడు నాకు ఏం కావాలో తెలుసు. మంచి మంచి కథల్లో భాగం కావాలని ఉంది. నా పాత్రకు రెండు మూడు మంచి సీన్లు ఉన్నా చాలు... నేను సినిమా చేస్తా. కంటెంట్ పరంగా, నా క్యారెక్టర్ పరంగా చూస్తే... 'సైతాన్' బలమైన కథ. ఈ సినిమా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది'' అని జ్యోతిక వివరించారు.


Also Read: ఓం భీమ్ బుష్... హుషారు భామ కూడా - అయితే, ఓ ట్విస్ట్!






పాతికేళ్ల క్రితం జ్యోతిక చేసిన హిందీ సినిమా ఏదో తెలుసా?సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'సైతాన్' విడుదల కోసం హిందీతో పాటు సౌత్ ఇండియన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. జ్యోతిక ఆ సినిమాలో నటించడమే కారణం. దీనికి ముందు ఆవిడ నటించిన హిందీ సినిమా ఏదో తెలుసా? అక్షయ్ కుమార్ హీరోగా మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన 'డోలీ సజా కే రఖా'. 


'కాదల్ ది కోర్'కు సూపర్ రెస్పాన్స్!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి భార్యగా జ్యోతిక నటించిన మాలీవుడ్ ఫిల్మ్ 'కాదల్ ది కోర్' గత ఏడాది విడుదల అయ్యింది. కేరళ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ భాషలకు అతీతంగా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. 


మెగాస్టార్ చిరంజీవి 'ఠాగూర్' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు జ్యోతిక పరిచయం అయ్యారు. ఆ తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున 'మాస్', మాస్ మహారాజా రవితేజ 'షాక్' సినిమాల్లో జ్యోతిక నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా నటించిన 'చంద్రముఖి' సైతం తెలుగులో ఆమెకు బోలెడు గుర్తింపు తెచ్చింది. తెలుగులో ఆమె రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.


Also Readవ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - ఆర్జీవీ తీసిన సినిమా ఎలా ఉందంటే?