Om Bhim Bush movie special song actress: 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించిన తాజా సినిమా 'ఓం భీమ్ బుష్'. శ్రీ విష్ణు, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రవీంద్రన్ హీరోలుగా నటించారు. ఇందులో హిందీ 'బిగ్ బాస్' సీజన్ 17 ఫేమ్ ఆయేషా ఖాన్, ప్రీతి ముకుందన్ హీరోయిన్లు. అయితే... వాళ్లిద్దరూ కాకుండా మరో హీరోయిన్ ప్రియా వడ్లమాని కూడా ఉన్నారు. అయితే, ఓ ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే?
'ఓం భీమ్ బుష్'లో ప్రియా వడ్లమాని
Priya Vadlamani in Om Bheem Bush movie: అవును... ప్రియా వడ్లమాని 'ఓం భీమ్ బుష్' సినిమాలో నటించారు. టీజర్ విడుదల రోజున చిత్ర బృందం ఓ పోస్టర్ పోస్ట్ చేసింది. హీరోలు ముగ్గురూ రోమన్ గెటప్స్‌లో సందడి చేశారు. అందులో ప్రియా వడ్లమాని కూడా ఉన్నారు. అయితే... ఓ పాటలో కనిపించే సీన్ అది. 'ఓం భీమ్ బుష్' సినిమాలో ప్రియా వడ్లమాని స్పెషల్ సాంగ్ చేశారు.
ప్రియా వడ్లమాని తెలుగమ్మాయి. 'ప్రేమకు రెయిన్ చెక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'శుభలేఖ + లు' సినిమా చేశారు. అయితే, శ్రీ హర్ష కొనుగంటి దర్శకుడిగా పరిచయమైన 'హుషారు' ఆమెకు గుర్తింపు తెచ్చింది. భారీ విజయం అందించింది. మరో నాలుగైదు సినిమాలు చేశారామె. అయితే, 'హుషారు' దర్శకుడు హర్ష కోసం 'ఓం భీమ్ బుష్'లో సాంగ్ చేశారు. ఆ పాట ఎలా ఉంటుంది? అనేది త్వరలో థియేటర్లలో చూడాలి.
Also Read: వ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - ఆర్జీవీ తీసిన సినిమా ఎలా ఉందంటే?
'హుషారు' సినిమాలోని సూపర్ హిట్ 'ఉండిపోరాదే...' పాటలో ప్రియా వడ్లమాని నటించిన సంగతి ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఆ సాంగ్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మార్చి 22న 'నో లాజిక్స్... ఓన్లీ మేజిక్'!
నో లాజిక్స్, ఓన్లీ మేజిక్... అనేది 'ఓం భీమ్ బుష్' ఉపశీర్షిక. టీజర్ చూస్తే సినిమా అంతటా ఫుల్ ఫన్ ఉంటుందని అర్థమైంది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ... ఈ ముగ్గురూ కలిశారంటే వినోదం మామూలుగా ఉండదు. ఆల్రెడీ 'బ్రోచేవారెవరురా' సినిమాలో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. ఈ గ్యాంగ్ మళ్లీ 'ఓం భీమ్ బుష్' కోసం కలిసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్ పతాకంతో కలిసి సునీల్ బలుసు ప్రొడ్యూస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. మార్చి 22న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.
Also Read: మదనే జగన్, శ్రవణే పవన్ - వర్మ 'వ్యూహం'లో పేర్లు మారాయ్, ఎవరి క్యారెక్టర్ ఏదో తెలుసుకోండి
ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: విష్ణు వర్షన్, కళా దర్శకుడు: శ్రీకాంత్ రామిశెట్టి, ఛాయాగ్రహణం: రాజ్ తోట, సంగీతం: సన్నీ ఎంఆర్, నిర్మాతలు: వి సెల్యులాయిడ్స్, సునీల్ బలుసు, సమర్పణ: యువి క్రియేషన్స్, రచన - దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి.