Maha shivaratri 2024: జన్మించిన ప్రాణి మరణించక తప్పదు. మరణించిన తర్వాత జన్మించక తప్పదు’ ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు. వాళ్లే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ ముగ్గురు సర్వ స్వతంత్రులు.
బ్రహ్మ
సృష్టి ధర్మానికి రక్షకుడు ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం
శ్రీ మహా విష్ణువు
సృష్టిని పోషించి, రక్షించడమే ఈయన ధర్మం. అందుకోసమే ఎన్నో అవతారాలెత్తాడు.
మహేశ్వరుడు
లయకారకత్వం ఈయన ధర్మం. ‘లయం’ అంటే ‘ నాశనం’ అని ఓ తప్పుడు అర్ధాన్ని చెప్పేస్తారు. కానీ ‘లయం’ అంటే లీనం చేసుకోవడం, లేదా తనలో కలుపుకోవడం అని అర్థం
Also Read: ఈ రోజు ఈ రాశులవారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం, ఉద్యోగులకు గుడ్ న్యూస్
అభౌతికమైనదే శాశ్వతం
ఈ సృష్టిచైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే మాటలు కాదు. దానికి ఎంతో తపశ్శక్తి కావాలి. అందుకే శివుడు ఎప్పుడూ తపస్సమాధి స్థితిలో ఉంటాడు. సృష్టికి, రక్షణకు నాశనం ఉంది కానీ ‘లయం’కు నాశనం లేదు అది శాశ్వతం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భౌతికంగా కనిపించేది ప్రతీదీ నాశనం అయ్యేవే. అభౌతికమైనవే శాశ్వతంగా ఉండేవి. మరి అభౌతికమైనది ఏదంటే ‘ఆత్మ’ దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహన్ని ధరిస్తే ‘జీవాత్మ’ అవుతుంది. ‘జీవాత్మ’ దేహత్యాగం చేస్తే ‘ఆత్మ’గా మిగిలిపోతుంది. పాంచభౌతికమైన శరీరం పంచభూతాల్లో లయమైపోతుంది. భూతత్వం భూమిలోను, అగ్నితత్వం అగ్నిలోను, జలతత్వం జలంలోను, వాయుతత్వం వాయువులోను, శబ్దతత్వం ఆకాశంలోను లయమౌతాయి. ఇక మిగిలిన్న ‘ఆత్మ’ను శివుడు లయం చేసుకుంటాడు. ఓ దీపాన్ని ఆపేస్తే ఆగిపోతుంది..మళ్లీ తన ఉత్పత్తి స్థానంలోనే ఆగిపోతుంది...తిరిగి వెలిగించాలంటే మళ్లీ అక్కడి నుంచే వెలిగించాలి...అలాగే ఓ మనిషిని ‘చనిపోయాడు’ అంటాం. ‘చని’ అంటే ‘వెళ్లుట’ అని అర్థం. ఎక్కడకు వెళ్లాడంటే తను వచ్చిన చోటుకే వెళ్లాడు. తిరిగి రావాలంటే.. అక్కడనుంచే రావాలి. అంటే.. లయంనుంచే సృష్టి ప్రారంభమవుతుంది. దేహం నుంచి విడివడిన ‘ఆత్మ’ తన ఉత్పత్తిస్ధానమైన శివునిలో లయమైపోతుంది. అందుకే ఆయన లయకారుడు అయ్యాడు.
Also Read: మార్చి నెలలో ఈ రాశులవారిని అష్టమ శని అష్టకష్టాలు పెడుతుంది!
సర్వం లీనం చేసుకునేది విరాగి మాత్రమే
వ్యామోహం లేనివాడే విరాగి. విరాగి మాత్రమే సర్వాన్ని సమానంగా తనలో లీనం చేసుకోగలుగుతాడు. శివుడికి తన దేహంమీదే మమకారంలేదు. చితాభస్మాన్ని పూసుకుంటాడు.. దిగంబరంగా తిరుగుతాడు..భిక్షాటన చేస్తాడు. పుర్రెలో తింటాడు, రుద్రాక్షలు, పాములు ధరిస్తాడు. శ్మశానంలో ఉంటాడు. ఇంత విరాగి కనుకే ఆయన లయకారుడయ్యాడు.
Also Read: మార్చి నెలలో ఈ రాశులవారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, ఆదాయం వృద్ధి!
మార్చి 8 శుక్రవారం రాత్రి 8గంటల 13 నిముషాల వరకూ త్రయోదశి ఉంది... ఆ తర్వాత నుంచి చతుర్థశి ప్రారంభమైంది . మార్చి 9 శనివారం సాయంత్రం 5 గంటల 59 నిముషాల వరకూ చతుర్థశి ఉంది... అయితే శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్ధశి ఉండడం ప్రధానం..అందుకే మహాశివరాత్రి మార్చి 8న జరుపుకోవాలి
Also Read: పెళ్లిలో వధూవరులకు అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా!