Your horoscope for the month of March 2024 : మార్చి నెలలో ఈ రాశులవారికి అన్నీ శుభాలే....
మేష రాశి
ఈ నెల మీకు మంచి విజయాన్ని అందిస్తుంది. నెల ప్రారంభంలో ఏం చేసినా కలిసొస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. అహంభావానికి దూరంగా ఉండండి. మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీరు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి. పరీక్షలు రాసే విద్యార్థులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మార్చి నెల ద్వితీయార్థం కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
వృషభ రాశి
వృషభ రాశివారికి మార్చి నెల అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది. ఏ పని చేపట్టినా వచ్చిన అడ్డంకులను అధిగమించి దూసుకెళ్తారు. అనుకోని ఖర్చు పెరుగుతుంది. ఏ పనిని ఇతరులకు వదిలిపెట్టవద్దు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించగలరు. నూతనంగా చేపట్టే కార్యక్రమాలు కలిసొస్తాయి
Also Read: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది - రాముడు నవమి తిథిరోజే ఎందుకు జన్మించాడు!
మిథున రాశి
ఈ నెల ఈ రాశివారికి శుభఫలితాలున్నాయి. గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో కష్టపడి పని చేస్తేనే విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం పెరుగుతుంది. నెల మధ్యలో ఆర్థిక లాభాలు ఉండవచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం దెబ్బతింటుంది. నెలాఖరులో వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు.
తులా రాశి
ఈ నెలలో తులా రాశివారికి అన్నీ అనుకూల ఫలితాలున్నాయి. అన్ని రంగాల వారికి కలిసొచ్చే సమయం. ఈ నెలంతా సంతోషంగా ఉంటారు. నూతన పెట్టుబడులకు ఇదే మంచి సమయం. వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. పూర్వీకుల ఆస్తుల విషయంలో ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉదర సంబంధిత రుగ్మతలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు.
Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!
ధనుస్సు రాశి
మార్చి నెల ధనస్సు రాశివారికి మంచి ఫలితాలనిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు కలిసొస్తాయి. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఎవరి దగ్గరా అప్పు తీసుకోవద్దు. కార్యాలయంలో కష్టపడి చేసే పనిలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ మాటలు , కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈ నెలాఖరులో కుటుంబంలో ఏదో ఒక విషయంలో విభేదాలు తలెత్తవచ్చు. భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది.
Also Read: శివుడికి 5 రూపాలు - మీరు ఏ రూపం పూజించాలో తెలుసా!
మకర రాశి
మకర రాశివారికి మార్చి నెలలో అదృష్టం కలిసొస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. నెల ప్రారంభంలో కుటుంబంలో విభేదాలుంటాయి. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. చిన్న చిన్న విషయాలకే ఉద్రేకపడొద్దు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. నెలాఖరులో పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి.
Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.