JL Results: గురుకుల జేఎల్ పోస్టుల తుది ఫలితాల వెల్లడి, ఉద్యోగాలకు 1767 అభ్యర్థులు ఎంపిక

తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ (JL Results) పోస్టులకు సంబంధించి తుది ఎంపిక ఫలితాలను గురుకుల నియామక బోర్డు ఫిబ్రవరి 29న రాత్రి వెల్లడించింది.

Continues below advertisement

TREIRB DL Results: తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ (JL Results) పోస్టులకు సంబంధించి తుది ఎంపిక ఫలితాలను గురుకుల నియామక బోర్డు ఫిబ్రవరి 29న రాత్రి వెల్లడించింది. సబ్జెక్టుల వారీగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. /జూనియర్ కాలేజీల్లో 1924  లెక్చరర్ పోస్టులకు గతేడాది ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను ఫిబ్రవరి రెండో వారంలో బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులకు 19, 20 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. ఆ వెంటనే డెమో తరగతులు నిర్వహించింది. డెమో తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను వెల్లడించింది. ఇక దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.

Continues below advertisement

సబ్జెక్టుల వారీగా ఖాళీలు:

తెలుగు-225, హిందీ-20, ఉర్దూ-50, ఇంగ్లిష్-230, మ్యాథమెటిక్స్-324, ఫిజిక్స్-205, కెమిస్ట్రీ-207, బోటనీ-204, జువాలజీ-199, హిస్టరీ-07, ఎకనామిక్స్-82, కామర్స్-87, సివిక్స్-84.

సబ్జెక్టుల వారీగా భర్తీచేసిన ఖాళీలు:

తెలుగు-210, హిందీ-20, ఉర్దూ-27, ఇంగ్లిష్-215, మ్యాథమెటిక్స్-303, ఫిజిక్స్-190, కెమిస్ట్రీ-189, బోటనీ-190, జువాలజీ-184, హిస్టరీ-07, ఎకనామిక్స్-75, కామర్స్-80, సివిక్స్-77.

సబ్జెక్టులవారీగా ఉద్యోగాలకు ఎంపికై అభ్యర్థుల వివరాలు..

 Zoology Provisional selection list of Junior Lecturers

Botany Provisional selection list of Junior Lecturers

English Provisional selection list of Junior Lecturers

Mathematics, Chemistry & Physics Provisional selection list of Junior Lecturers

History, Civics, Economics & Commerce Provisional selection list of Junior Lecturers

Telugu, Hindi & Urdu Provisional selection list of Junior Lecturers

Website

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి తొమ్మిది క్యాటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్  పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి. గురుకుల జూనియర్ కాలేజీల్లో పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 17  నుంచి మే 17 వరకు, పీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు, మిగతా పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు ఆగస్టు 1 నుంచి 23 వరకు నిర్వహించింది. ఆయా పోస్టులకు మొత్తం 6,52,413 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,93,727 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి మెరిట్ లిస్టులు తయారీచేసి వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటికే కొన్ని పోస్టుల తుది ఫలితాలు వెల్లడించగా.. మరికొన్ని ఫలితాలు వెల్లడించాల్సి ఉంది.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement