Sree Vishnu Birthday Updates: నాలుగేళ్లకు ఒకసారి వచ్చేది ఏంటో తెలుసా? అంటూ ఓం భీం బుష్‌ టీం సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ రోజు హీరో శ్రీవిష్ణు బర్త్‌ డే. లీప్‌ ఇయర్‌లో మాత్రమే పుట్టినరోజు జరుపుకునే ఏకైక తెలుగు హీరో ఇతనే. ఈ నేపథ్యంలో శ్రీవిష్ణుకు ఫ్యాన్స్‌, నటీనటులు, ఇండస్ట్రీ ప్రముఖులు అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వి సెల్యూలైడ్ చాలా ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ఈ మేరకు శ్రీవిష్ణుకు పుట్టిన రోజు చెబుతూ అతడి మూవీ అప్‌డేట్‌ను సరికొత్తగా ఇచ్చింది. క్రిష్‌గాడి బర్త్‌డే దావత్ మార్చి 22న అంటూ మేకర్స్‌ సర్‌ప్రైజ్‌ రివీల్‌ చేశారు. కాగా శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'ఓం భీమ్ బుష్'.


ఈ హీరో బర్త్‌డే సందర్భంగా మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. ఈ సందర్భంగా 'ఓం భీం బుష్‌' అంటూ సరికొత్తగా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేశారు. ఇందులో శ్రీవిష్ణు క్రిష్‌ పాత్రలో అలరించబోతున్నాడని, తన బర్త్‌డే పార్టీని మార్చి 22న ప్లాన్‌ చేశాడంటూ యూవీ క్రియేషన్స్‌ తాజాగా పోస్ట్‌ షేర్‌ చేసింది. ఈ సందర్భంగా వాట్సఫ్‌ చాట్‌తో ఉన్న ఫన్నీ చాట్‌, బాలయ్య వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌  నెటిజన్లు, ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. మరోవైపు గీతా ఆర్ట్స్‌ సైతం శ్రీవిష్ణు బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేసింది.






గీతా ఆర్ట్స్‌లో శ్రీవిష్ణు(#SV18) నెక్ట్స్‌ మూవీ


శ్రీవిష్ణు పుట్టిన రోజు సందర్భంగా అతడి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై గీతా ఆర్ట్స్‌ ఆనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది. శ్రీవిష్ణుకు బర్త్‌డే గిఫ్ట్‌ పంపినట్టుగా వీడియో రిలీజ్‌ చేసింది. ఈ గిప్ట్‌లో ఈ హీరో పజిల్‌ కనిపెట్టాలి. ఆ పజిల్‌ కరెక్ట్‌ పెడితే అతడి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ వర్కింగ్‌ టైటిల్‌ వస్తుంది. ఇక పోస్ట్‌కి గీతా ఆర్ట్స్‌ ఇచ్చిన క్యాప్షన్‌ మూవీపై ఆసక్తిని పెంచుతుంది. ఈ ఫన్నీ రోలర్‌కోస్టర్‌ రైడ్‌లో ప్రేమ, నవ్వులు మొదలవుతుంది. మా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ #SV18 కోసం హీరో శ్రీవిష్ణుతో కలిసి పని చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పించబోతున్నారంటూ శ్రీవిష్ణు తదుపురి మూవీపై అప్‌డేట్‌ ఇచ్చారు. ఇలా లీప్‌ ఇయర్‌లో తన బర్త్‌డే సందర్భంగా శ్రీవిష్ణు ఫ్యాన్స్‌కి డబుల్‌ ట్రీట్‌ అందింది. 






కాగా 'ఓం భీమ్ బుష్'లో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 22న థియేటర్లోక వచ్చేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. 'బ్రోచేవారెవరురా' సినిమాతో ప్రేక్షకుల్ని ఇప్ప‌టికే క‌డుపుబ్బా న‌వ్వించిన ఈ ముగ్గురు మ‌ళ్లీ క‌లిశారు అంటే క‌చ్చితంగా న‌వ్విస్తారు అని డిసైడ్ అవుతున్నారు ఆడియన్స్‌. 'హుషారు', 'రౌడీ బాయ్స్' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించిన ఈసినిమా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లో నిర్మించారు.