Oorvasivo Rakshasivo Today Episode ధీరు దుర్గని ఇష్టపడ్డాడు అని ఇప్పుడు దుర్గకి వేరే వాళ్లతో నిశ్చితార్థం జరుగుతుందని.. అక్కడికి వచ్చి ధీరు పిచ్చి పనులు ఏమీ చేయడు కదా అని రక్షిత అనుకుంటుంది. ధీరుకి గట్టిగా చెప్పాలి అని అనుకుంటుంది. ఎంగేజ్ మెంట్‌కి ఎవరెవరు వస్తాన్నారో తెలుసుకోవాలి అనుకుంటుంది. వాసుకి ఫోన్ చేసి..
రక్షిత: వాసు ఎక్కడున్నావ్.. ఇప్పుడు మనం దుర్గ ఎంగేజ్‌మెంట్‌కి వెళ్తున్నాం. అక్కడ గెస్ట్‌లు గురించి పూర్తి డిటైల్స్ తెలుసుకో.. అక్కడేదైనా నెగిటివ్‌గా అనిపిస్తే వెంటనే చెప్పు. ఎలాంటి పరిస్థితుల్లో దయాసాగర్‌తో మనం చేస్తున్న బిజినెస్ డీల్ మిస్ అవ్వకూడదు. అక్కడికి ధీరు వస్తున్నాడు. ధీరుని కనిపెట్టుకొని మనవాళ్లు ఉండాలి.
వాసు: ఒకే మేడం.
రక్షిత: ధీరు ఆర్ యూ ఆల్‌రైట్.. బాగా గుర్తుపెట్టుకో మనం ఎంగేజ్మెంట్‌కి వెళ్లామా వచ్చామా అన్నట్లే ఉండాలి. నువ్వు ఎలాంటి తప్పు చేయకూడదు.
దుర్గ: ఏంటి అలా చూస్తున్నావ్..
విజయేంద్ర: చాలా అందంగా ఉన్నావ్. నువ్వేమీ అనుకోను అంటే నీకు ఒక చిన్న గిఫ్ట్. అంటూ బ్రాస్ లేట్ ఇస్తాడు. దుర్గ చేతికి కడతాడు. ఎమోషనల్ అయిన దుర్గ తన చేతి రింగ్‌ను పడేసుకుంటుంది. విజయేంద్ర పట్టుకొని దుర్గకు ఇస్తాడు. దుర్గ పెట్టుకుంటుంది. అందరూ ఉన్నప్పుడు ఇస్తే బాగోదు అని ఇప్పుడే పెట్టాను ఏమీ అనుకోవద్దు. చూడు నీ చేతికి ఎంత బాగుందో..
దుర్గ: థ్యాంక్యూ సోమచ్ విజయేంద్ర.. చాలా బాగుంది మీ మంచి మనసులానే..
విజయేంద్ర: సరే నేను వెళ్లి మీ నాన్నకు సాయంగా ఉంటాను.
రక్షిత, పురుషోత్తం, ధీరు అక్కడికి వస్తారు. విజయేంద్ర వచ్చి వాళ్లని పలకరిస్తే.. విజయేంద్ర మన ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ ఉంటున్నాడు అని రక్షిత అంటుంది. ఇంతలో పురుషోత్తం అమెరికా ఎప్పుడు వెళ్తావని అడిగితే అమెరికా వెళ్లే ఉద్దేశం లేదు అని విజయేంద్ర అంటాడు. మరోవైపు
ధీరు: మనసులో.. పెళ్లి కొడుకును చూసి.. నా ప్లేస్‌లో నువ్వు ఉన్నావా.. నీకు దుర్గతో ఎంగేజ్‌మెంట్ జరగనివ్వను.
పవిత్ర: ధీరుని చూసి.. ధీరు తనని అత్యాచారం చేయడం గుర్తు చేసుకొని బయటకు రావడానికి డోర్ కొడుతుంది. దుర్గ వాళ్లు షాక్ అవుతారు. ఇక విజయేంద్ర వెళ్లబోతే దుర్గ అడ్గుకుంటుంది. పిల్లి అని చెప్పి విజయేంద్రని అడ్డుకుంటుంది. ఇంతలో పవిత్ర దుర్గకి ధీరుని చూపిస్తుంది. పవిత్రని కూల్ చేసి దుర్గ వెళ్తుంది. ఇంతలో ధీరు దుర్గ దగ్గరకు వెళ్లి చేయి పట్టుకుంటాడు.
దుర్గ: ధీరు చేయి వదులు..
ధీరు: సారీ దుర్గ నేను రాత్రి అలా చేసి ఉండకూడదు.
రక్షిత: దుర్గ ఇక్కడ లేదు వీడు లేడు సంథింగ్ ఈజ్ రాంగ్.
ధీరు: మనం దూరం అయిపోతామేమో అన్న భయంతో పిచ్చి పట్టింది.
దుర్గ: మీ అమ్మ మన పెళ్లికి ఒప్పుకోదు. దయచేసి నాకు అడ్డురాకు.
ధీరు: నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు కావాలి అంటే చంపేయ్.. అంతే కానీ నన్ను కాదు అని వేరే ఒకరిని పెళ్లి చేసుకోకు దుర్గ. నా జీవితంలోకి వస్తే నిన్ను యువరాణిలా చూసుకుంటా. నాకు వారం టైం ఇవ్వు. మా అమ్మని ఒప్పిస్తా..
దుర్గ: ధీరు నువ్వేం చేయలేవు. మీ అమ్మ ఒప్పుకోదు. నీ మాట వినదు. నువ్వు చస్తాను అన్నా మీ అమ్మ మన పెళ్లికి ఒప్పుకోదు. నన్ను మర్చిపో మీ అమ్మ చూపించిన వాళ్లని పెళ్లి చేసుకో.. వదిలేయ్ ధీరు..
విజయేంద్ర: ధీరు నుంచి దుర్గ చేయి విడిపించి.. ధీరు దుర్గ చేయి ఎందుకు పట్టుకున్నావ్.. నీ ప్రాబ్లమ్ ఏంటి. దుర్గ నువ్వు పద..
ధీరు: వీడు హీరోలా ప్రతీ సారీ మా మధ్యకు వస్తున్నాడు ముందు వీడి సంగతి చూడాలి. దుర్గ ఎలా అయినా సరే నువ్వు నాకు కావాల్సిందే.. నీకోసం ఎంత దూరం అయినా వెళ్తాను. ఎంత మందిని అయినా ఎదురిస్తాను. ఈ విషయంలో నేను గెలవను అనుకుంటే నేను చచ్చిపోవడానికి అయినా సిద్ధమే.. దుర్గ నాకు ప్రాణం కంటే ఇగో ఎక్కువ. చచ్చినా నాదే పై చేయి అవ్వాలి అనుకునే ఇగోఈస్ట్‌ని నేను. దుర్గ ప్రణయ్‌కి రింగ్ పెడుతుండగా దుర్గ అని ధీరు అరుస్తాడు. తనతో పాటు తెచ్చుకున్న చాకుతో చేయి కట్ చేసుకుంటాడు. ఎవరూ నా దగ్గరకు రావొద్దు.
రక్షిత: ధీరు ఏంట్రా ఈ పిచ్చి పని.. రక్తం పోతుందిరా..
ధీరు: ఎవరైనా దగ్గరకు వస్తే గొంతు కోసుకొని చచ్చిపోతా..
దుర్గ: ధీరు ఏంటిది. ఎందుకిలా..
ధీరు: నీ కోసమే దుర్గ. నాకు నువ్వంటే చచ్చేంత ప్రేమ.. ఆ విషయం నీకు మా మామ్‌కి తెలీదు.
దుర్గ: నాకు తెలుసు ధీరు. కానీ ఇది రైట్ టైం కాదు. పద హాస్పిటల్‌కి వెళ్దాం.
ధీరు: రాను దుర్గ.. మామ్ నీ పంతం గెలాలి అని నేను అనుకుంటున్నాను. అందుకే నేను చచ్చిపోతున్నా. నేను చస్తే మీకు ఎలాంటి బాధలు ఉండవు. దుర్గ లేని జీవితం నాకు వద్దు. నాకు తనని ఇచ్చి పెళ్లి చేస్తా అను లేదంటే ఇక్కడే చచ్చిపోతా.. అని ధీరు కళ్లు తిరిగి పడిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: అనన్య నాగళ్ల - ‘తంత్ర’ బ్యూటీ అందానికి ఫిదా కావాల్సిందే!