Jagadhatri  Serial Today Episode: నిషిక వచ్చి వైజయంతిని దివ్యాంక వద్దకు తీసుకువెళ్లి జగధాత్రిని వంట చేయడానికి ఒప్పించమని చెప్తారు. సరేనని దివ్యాంక, నిషిక, వైజయంతి దగ్గరకు వెళ్లి వంట వాళ్లు రాలేదని నువ్వు వంట చేయాలని అడుగుతారు.  ధాత్రి చేయనని చెప్తుంది. అయితే వైజయంతి ఒక్కరి అన్నం పెడితేనే ఎంతో పుణ్యం వస్తుంది అంటారు. ఇంత మందికి పెడితే మన కుటుంబానికి మంచి జరుగుతుంది ఒప్పుకో ధాత్రి అని అడుగుతుంది. మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను అత్తయ్య గారు అంటుంది ధాత్రి.


కేదార్‌: ధాత్రి వీళ్ల మాటలకు వీళ్ల బాడీ లాంగ్వేజ్‌కు ఎక్కడ మ్యాచ్‌ అవ్వటం లేదు. ఏదో తేడాగా ఉంది.


ధాత్రి: నా సాయం కోరి వచ్చిన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది కేదార్‌. వాళ్ల ప్లాన్‌ ఏంటో తెలుసుకోవాలంటే వాళ్లు చెప్పినట్లు చేయాలి మనం.


నిషిక: ఎంటి ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇప్పుడే టైం దొరికిందా?


ధాత్రి: ఏం లేదు నిషి కేదార్‌ నాకు వంటలో సాయం చేస్తానంటే సరే రా అంటున్నాను.


కౌషికి: ఆగు జగధాత్రి నేను కూడా వస్తాను.


నిషిక: అక్కడ వేడిగా ఉంటుంది వదిన మీరెందుకు అక్కడ మీరు ఇక్కడే ఉండండి. నేను వాళ్లకు అన్నీ చూపించి వచ్చి మీకు కంపెనీ ఇస్తాను.


అని చెప్పి నిషిక ధాత్రి, కేదార్‌లను తీసుకెళ్లి కిచెన్‌ చూపిస్తుంది. ధాత్రి, కేదార్‌ వంట చేస్తుంటారు. ఇంతలో సాల్ట్‌  ప్యాకెట్‌  కనిపించడం లేదని తీసుకొస్తానని ధాత్రి బయటకు వెళ్తుంది. మరోవైపు ఫోన్‌ మాట్లాడుతున్న దివ్యాంకను కౌషికి పిలుస్తుంది.


కౌషికి: నీతో మాట్లాడాలి. నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావో అర్థం అయ్యింది.


దివ్యాంక: నా ఎంగేజ్‌మెంట్‌ చూసి నన్ను సురేష్‌ను మనఃస్ఫూర్తిగా ఆశీర్వదిస్తావని పిలిచాను కౌషికి.


కౌషికి: అందరి ముందు నన్ను అవమానించి పైశాచికానందం పొందడానికి పిలిచావు. నా ఇంట్లో కొట్టేసిన నా పెన్‌డ్రైవ్‌ను నాకు ఇస్తానని చెప్పినందుకు వచ్చాను.


దివ్యాంక: నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కౌషికి. నేను నిన్నెందుకు బాధపెట్టాలని చూస్తా..


కౌషికి: ఎంగేజ్‌మెంట్‌కు రమ్మని  చెప్పావు నేను వచ్చాను. పెన్‌డ్రైవ్‌ ఇస్తే నేను వెళ్తాను.


దివ్యాంక: ఎంగేజ్‌మెంట్‌కు రావడం అంటే వచ్చి ముఖం చూపించి వెళ్లడం కాదు కౌషికి. నేను సురేష్‌ రింగ్‌  మార్చుకునేంత వరకు ఉండి భోజనం చేయ్‌ అప్పుడు పెన్‌డ్రైవ్‌ ఇస్తాను. తీసుకుని వెళ్దువు కానీ..


అని దివ్యాంక చెప్పటాన్ని ధాత్రి వింటుంది. నువ్వు మొదలు పెట్టిన గేమ్‌  నేను క్లోజ్ చేస్తాను అని ధాత్రి మనసులో అనుకంటుంది. కౌషికిని ఎదో ఒకటి చేయాలని నిషిక, దివ్యాంక మాట్లాడుకుంటారు. ఇంతలో కౌషికి లేచి వెళ్లబోతుంటే.. ఎదురుగా సురేష్‌ వస్తుంటారు. నిషిక అరటిపండు తీసుకుని తొక్క వేస్తుంది. సురేష్‌ తొక్కమీద కాలు వేసి కిందపడబోతుంటే కౌషికి పట్టుకుంటుంది.


దివ్యాంక: కౌషికి నా ఎంగేజ్‌మెంట్‌కు వచ్చి అందరి ముందు నాకు కాబోయే భర్తతో  ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదా?


నిషిక: ఏంటి వదిన ఇది సురేష్‌ అన్నయ్య అంటే ఇష్టం లేదని నలుగురిలో ఇలా చేస్తావనుకోలేదు.


కౌషికి: నేను కావాలని చేయలేదు నిషిక


దివ్యాంక: ఆపు నువ్వు నీ నంగనాచి మాటలు. నువ్వు కావాలనే నా కాబోయే భర్తతో ఇలా అందరి ముందు కొంచెం కూడా డీసెన్సీ లేకుండా బిహేవ్‌ చేస్తావా?


కౌషికి: నీ వంకర బుద్దితో అన్ని వంకరగా ఆలోచించి వంకర మాటలు మాట్లాడకు దివ్యాంక.


అనగానే దివ్యాంక వల్గర్‌గా మాట్లాడుతుంది. దీంతో కౌషికి దివ్యాంకను కొట్టబోయి ఆగిపోతుంది. ధాత్రి వచ్చి నిషిక అరటి తొక్క ఎందుకు వేశావని అడుగుతుంది. దీంతో వైజయంతి ఏదో సర్దిచెప్పి పంపించేస్తుంది. అందరూ వెళ్ళిపోతారు. దివ్యాంకకు బుద్ది చెప్పాకే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ధాత్రి, కౌషికికి చెప్తుంది. తర్వాత  ధాత్రి అందరినీ పిలిచి నిషిక వంట సూపర్‌గా చేస్తుందని ఇప్పుడు ఈ పార్టీకి కూడా నిషికనే వంట చేయాలని అందరూ ఎంకరేజ్‌ చేయాలని చెప్తుంది. అందరూ ఎంకరేజ్‌ చేయగానే నిషిక వెళ్లి వంట చేస్తుంది. నిషిక వంట చేయడాన్ని చూసిన గెస్టులు అందరూ ఈ వంట తింటే మనం బతికినట్టే అనుకుంటూ వెళ్లిపోతుంటారు. కేదార్‌ ప్లాన్‌ సక్సెస్‌. నిషిని సైడ్‌ చేశాం. ఇప్పుడు దివ్యాంక ఒక్కతే ఉంది. మన ప్లాన్‌ స్టార్ట్‌ చేద్దామా అనగానే ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


Also Read: ఆసక్తికరంగా ‘తంత్ర’ ట్రైలర్ - ఇంతకీ తాంత్రిక సాధన చేసిన ఆ తెలుగు ముఖ్యమంత్రి ఎవరు?