Your horoscope for the month of March 2024 : మార్చి నెలలో  ఈ రాశులవారికి  గ్రహాలు అనుకూల ఫలితాలను ఇవ్వడం లేదు...


కర్కాటక రాశి


కర్కాటక రాశివారిపై ఈ నెలలో అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులు పూర్తిచేయడానికి చాలా కష్టపడతారు. వాహన ప్రమాదాలు, గృహచలనం ఉండొచ్చు.   ఏదో విషయంలో కలత చెందుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం దెబ్బతింటుంది. పాత వ్యాధులు తిరగబెట్టే అవకాశం ఉంది. నెల మధ్యలో విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకోవచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. ముఖ్యమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.


Also Read: మార్చి నెలలో ఈ రాశులవారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, ఆదాయం వృద్ధి!


సింహ రాశి


సింహ రాశివారికి మార్చి నెల అంత అనుకూల ఫలితాలు లేవు. పనుల్లో ప్రతిబంధకాలుంటాయి. చేసే వృత్తి వ్యాపారాల్లో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే నెల ఆరంభంలో అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాసి. సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఆస్తి తగాదాలు, కుటుంబంలో వివాదాలు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి.  కోపాన్ని నియంత్రించుకోండి. 


  Also Read: ఫాల్గుణ మాసం (మార్చి) లో వచ్చే పండుగలివే


కన్యా రాశి


కన్యా రాశివారికి మార్చి నెల మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఆర్థిక లావాదేవీలు బావుంటాయి. మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. ఆప్త మిత్రులను పోగొట్టుకుని బాధపడతారు. సమయం విలువైనదని తెలుసుకోవాలి. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో  వివాద సూచనలున్నాయి జాగ్రత్త. ఈ రాశి విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందలేరు.  


వృశ్చిక రాశి


వృశ్చిక రాశివారికి అర్ధాష్టమంలో శని ఉన్నప్పటికీ ఈ నెలలో ఏవిధమైన ఇబ్బందులు తలెత్తవు. జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి.  కార్యాలయంలో ఏ పనిని ఇతరులకు వదిలివేయవద్దు. నెల మధ్యలో వ్యాపారంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.  కుటుంబానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. నెలాఖరులో వాతావరణంలో మార్పుల వల్ల మీ ఆరోగ్యం ప్రభావితం అవుతుంది.


Also Read: ఈ నెలలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు!


కుంభ రాశి


కుంభ రాశివారికి మార్చి నెల అంత బాలేదు. ప్రతి వ్యవహారంలోనూ అడ్డంకులు ఎదురవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త సమస్యలు తలెత్తవచ్చు. కష్టపడి పని చేస్తేనే సక్సెస్ అవుతారు. చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నెలమధ్యలో అదనపు ఖర్చులుంటాయి.  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వాతావరణ మార్పుల వల్ల మీ ఆరోగ్యం ప్రభావితం కావచ్చు. వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సమయానికి డబ్బు చేతికందదు. విద్యార్థులు పరీక్షలు ఓ మోస్తరుగా రాస్తారు. 


మీన రాశి 


మార్చి నెల మీన రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. జన్మంలోనూ, వ్యయంలోనూ ఉన్న గ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో ఏదో అశాంతి ఉంటుంది. బందుమిత్రులతో విరోధ సూచనలున్నాయి.  ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులు ఇంకొంత కాలం వేయి చూడక తప్పదు. నెల ఆరంభం కన్నా ద్వితీయార్థం కొంత మెరుగ్గా ఉంటుంది. 


Also Read: జీవితంలో ఏ మనిషి చేయకూడని 5 పాపాలు ఇవే!


గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.