Pancha Maha Patakalu : కొన్ని పదాలు విరివిగా వాడేస్తుంటాం. కొన్నిటికి అర్థాలు తెలిస్తే, మరికొన్నిటికి అర్థం తెలియకపోయినా దానివెనుకున్న ఉద్దేశం తెలుస్తుంది. అలాంటి పదాల్లో ఒకటి పంచమహాపాతకాలు. నీకు పంచమహాపాతకాలు చుట్టుకుంటాయ్ అని అంటుంటారు..అసలు పంచమహాపాతకాలు అంటే ఏంటి. ఏంటా పాతకాలు?
మహా పాతకం అంటే?
మహా పాతకం అంటే నిష్కృతిలేనిది అని అర్థం. అంటే ఈ జన్మకు ఏం చేసినా ఈ పాపాలను కడుక్కోవడం సాధ్యంకాదు..వాటి ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే అని అర్థం. కొన్ని పాపాలకు పరిహారం ఉంటుంది కానీ పంచమహాపాతకాలు అని చెప్పుకునే వీటికి మాత్రం ఎలాంటి నిష్కృతి ఉండదు. అందుకే ఈ పాపాలు ప్రభావం చాలా పవర్ ఫుల్. వీటి గురించి అధర్వణ వేదంలో ఉంది...
Also Read: దోసపండుకి - మృత్యువుకి ఏంటి సంబంధం శివయ్యా!
పంచమహా పాతకాలు ఇవే
తల్లిదండ్రులను దూషించడం
తల్లిదండ్రులను దూషించేవారికి నిష్కృతి లేదు. జన్మనిచ్చిన వారి రుణం ఏం చేసినా తీర్చుకోలేం. అందుకే వారిని దూషించడమే మహా పాపం అంటే ఇక ప్రాణాలు తీసేవారు ఆ పాపాన్ని జన్మజన్మలకి కడుక్కోలేరు...
Also Read: ఈ నెలలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు!
గురువుని ఏకవచనంలో పిలవడం
'మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అేంటూ...తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుదే. జాతకంలో పరిహారం లేని దోషాలు కూడా గురువు ఆశీశ్సులతో తొలగిపోతాయంటారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరేందుకు నిస్వార్థంగా ప్రోత్సహించే గురువుని ఏకవచనంతో పిలవకూడదు. కలలో కూడా గురువుని ఏకవచనంతో పిలవకూడదు..కలలో అలా అన్నా మనసులో లేనిదే రాదు కదా. మన ఆలోచనలే కలలకు ప్రతిరూపం అని ఊరికే చెప్పరు. పంచమహాపాతకాల్లో ఇదొకటి...
Also Read: ఫాల్గుణ మాసం (మార్చి) లో వచ్చే పండుగలివే
తాగే నీటికి కలుషితం చేయడం- నడిచే దారిని మూసేయడం
పది మంది తాగే నీటిని కలుషితం చేయడం, నలుగురూ నడిచే దారి మూసేయడం పంచమహాపాతకాల్లో మూడోది. ఎందరో దాహం తీర్చే గంగను తాగేందుకు వీల్లేకుండా చేసిన పాపానికి ఏం చేసినా పరిహారం ఉండదు. ఇక అంతా నడిచే దారిని మూసేయడం మహాపాపం. ఇలాంటి సంఘటనలు గ్రామాల్లో జరుగుతుంటాయి. రెండు కుటుంబాల మధ్య తగాదాలు వచ్చినప్పుడు దారులు మూసేయడం.. అందరికీ తాగునీళ్లిచ్చే బావుల్లో చెత్త వేయడం లాంటి పనులు చేస్తుంటారు. ఇక పట్టణాల విషయానికొస్తే దారులు మూసేయడం ఏం ఖర్మ...ఏకంగా శ్మశానాలే ఆక్రమించేస్తున్నారు. ఈ పాపాలు చేసేవారికి నిష్కృతి లేదు. ఈ ప్రభావం వారి పిల్లల ఆరోగ్యంపై పడుతుంది. వచ్చే జన్మలోనే కాదు ఈ జన్మలోనే పాప ఫలితం అనుభవించకతప్పదు.
గోవుని అకారణంగా కొట్టడం
గోవులను కాసేవాడు, వాటితో పనిచేయించుకునేవాడు...వాటిని కంట్రోల్ చేసేందుకు కొట్టొచ్చు అది తప్పుకాదు...కానీ ఆకతాయిగా,ఎలాంటి అవసరం లేకుండా కొడితే గోవు చర్మంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని జన్మలు ఎత్తినా ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది.
Also Read: అద్దంలో అలా చూసుకునే అలవాటుందా - అయితే మిమ్మల్ని ఈ దోషం వెంటాడుతుంది!
ఆత్మహత్య
పంచమహాపాతకాల్లో చివరిది ఆత్మహత్య. ప్రాణం తీసుకునే హక్కు మీకెక్కడుంది అసలు?
పరమేశ్వర స్వరూపంలో జీవుడిని ఇచ్చింది తండ్రి
శరీరాన్ని తయారు చేసింది తల్లి
అంటే ఈ శరీరం మీ సొంతం కాదు
ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఓ అద్దె ఇంట్లో ఉంటూ యజమానికి తెలియకుండా ఆ ఇల్లు అమ్మేయడమే. అంటే నీది కాని ఆస్తిని, యజమానికి తెలియకుండా నువ్వు అమ్ముకోవడమే ఆత్మహత్య చేసుకోవడం అంటే.
Also Read: మార్చి 08 శివరాత్రి లోగా ఇది నేర్చేసుకోండి !
మొదటి నాలుగు పాపాలకు ఆ జీవుడు మాత్రమే అనుభవిస్తాడు. కానీ ఆత్మహత్య చేసుకుంటే మాత్రం అటు ఐదు తరాలు, ఇటు ఐదు తరాలు సర్వనాశనం అయిపోతాయ్.
పైన చెప్పుకున్న పంచమహాపాతకాలు అధర్వణ వేదంలో ప్రస్తావించినవి... ఇక బ్రహ్మపురాణం ప్రకారం పంచమహాపాతకాలు ఇవి...
- స్త్రీ హత్య ( స్త్రీ ని చంపడం)
- శిశు హత్య ( పిల్లల్ని చంపడం)
- గో హత్య ( ఆవుని చంపడం)
- బ్రహ్మ హత్య ( వేదం చదువుకున్న బ్రాహ్మణుడిని చంపడం)
- స్వర్ణస్తేయము ( బంగారం దొంగిలించడం)