Kannappa enters into second schedule: డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ మైథలాజికల్ డ్రామా 'కన్నప్ప'. ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటీ... అనేది ఉపశీర్షిక. లేటెస్ట్ సినిమా అప్డేట్ ఏమిటంటే...
న్యూజీలాండ్‌లో సెకండ్ షెడ్యూల్!
Kannappa movie second schedule: న్యూజీలాండ్‌లో 'కన్నప్ప' రెండో షెడ్యూల్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోందని విష్ణు మంచు పేర్కొన్నారు. మోహన్ బాబు సైతం జాయిన్ అయినట్లు ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. న్యూజీలాండ్‌లో అక్కడి అధికారులతో కలిసి డిస్కస్ చేస్తున్న విజువల్స్ అందులో ఉన్నాయి.
ప్రస్తుతం మోహన్ బాబు, విష్ణు మంచు పూర్తి స్థాయిలో సినిమాలు, సమాజ సేవ మీద దృష్టి పెట్టారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల తన పేరును కొందరు వ్యక్తులు రాజకీయాలకు వాడుకుంటున్నట్లు మోహన్ బాబుకు తెలియడంతో హెచ్చరికతో కూడిన విజ్ఞప్తి కూడా చేశారాయన.
Also Read: నా పేరు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటా - రాజకీయ నాయకులకు మోహన్ బాబు వార్నింగ్
'కన్నప్ప'లో యోధుడిగా... అపర భక్తుడిగా!
'కన్నప్ప' విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్! హాలీవుడ్ స్థాయిలో తీయాలని ఉందని ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు. స్వయంగా ఆయనే కథ అందించారు. విష్ణు మంచు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే... కన్నప్పను యోధుడిగా, అపర భక్తుడిగా చూపిస్తున్నారని అర్థం అవుతోంది. సినిమాలో 80 శాతం సన్నివేశాలను న్యూజిలాండ్‌లో షూట్ చేయనున్నారు. ఈ సినిమాలో విష్ణు మంచు కుమారుడు అవ్రామ్ భక్త వెండితెరకు పరిచయం అవుతున్నారు. సినిమాలో తనయుడితో ఓ పాత్ర చేయిస్తున్నారు విష్ణు మంచు.
Also Read: వెనక్కి వెళ్లిన అంజలి - గీతాంజలి సీక్వెల్ రిలీజ్ డేట్ మారింది
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార 'కన్నప్ప'లో శివ పార్వతుల పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్ సైతం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్, విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు (Mohan Babu) ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్టార్ ప్లస్ టీవీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ 'కన్నప్ప'కు దర్శకుడు. సుమారు రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందనుంది. లెజెండరీ రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ కథకు హంగులు అద్దారు. ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు.