Anjali's Geethanjali 2 movie gets new release date: తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' (Geethanjali Malli Vachindi Movie). పదేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'గీతాంజలి'కి సీక్వెల్ ఇది. కథానాయికగా అంజలికి 50వ సినిమా. ఇటీవల టీజర్ విడుదల చేశారు. మార్చి 22న చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... రిలీజ్ డేట్ మారింది.
వెనక్కి వెళ్లిన అంజలి 'గీతాంజలి 2'
Geethanjali Malli Vachindi is scheduled to release on April 11th: 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమాను ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్టు కోన ఫిల్మ్ కార్పొరేషన్ అనౌన్స్ చేసింది. అమెరికాలో ఏప్రిల్ 10న ప్రీమియర్ షోలు పడనున్నాయి. 'ఊరు పేరు భైరవకోన' విడుదల చేసిన సరిగమ సినిమాస్ సంస్థ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకుంది.
సంగీత్ మహల్ వైపు వెళ్ళారేంటి?
geethanjali malli vachindi teaser review: అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో కొండ మీద ఉన్న పాడుబడ్డ భవంతి పేరు సంగీత్ మహల్. గ్రామస్థులు ఎవరూ అటువైపు వెళ్లరు. కొందరు అటు వైపుగా వెళ్లడం చూసి ఊరి ప్రజలు ఆశ్చర్యపోతారు. అక్కడ షూటింగ్ ఏదో జరుగుతుందని తెలుసుకుంటారు. 'ఆ మహల్ సంగతి తెలిసే వెళుతున్నారా వీళ్లు?' అని ఓ పెద్దాయన అసహనం వ్యక్తం చేస్తాడు.
'గీతాంజలి మళ్ళీ వచ్చింది'లో దర్శకుడిగా శ్రీనివాస రెడ్డి నటించారు. ఆయన తీసే సినిమాలో సునీల్ హీరో. సత్య, షకలక శంకర్ తదితరులు షూటింగ్ చేయడానికి వెళతారు. ఆ మహల్ లో దెయ్యాలు వాళ్లను ఏం చేశాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: నాగబాబుకు వేరే ఉద్ధేశాలు లేవు... ఆయన రామ్ చరణ్, ఎన్టీఆర్ ను కామెంట్ చేయలేదు!
ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై విశాఖ ఎంపీ, రాజకీయ నేత ఎంవీవీ సత్యనారాయణ, జీవీ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకుడు.
Also Read: అందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు
శ్రీకాంత్ అయ్యంగార్, రవిశంకర్, ప్రియ, ముక్కు అవినాష్, విరుపాక్ష రవి, రాహుల్ మాధవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, స్క్రీన్ ప్లే: కోన వెంకట్ & భాను కిరణ్, మాటలు: భాను కిరణ్ & నందు, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం: సుజాత సిద్ధార్థ్, కూర్పు: చోటా కె. ప్రసాద్, కళ: నార్ని శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగు వై, నిర్మాణ సంస్థలు: ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్, నిర్మాతలు: ఎంవీవీ సత్యనారాయణ, జీవీ, దర్శకత్వం: శివ తుర్లపాటి.