Navagraha Dosha : అద్దంలో అలా చూసుకునే అలవాటుందా - అయితే మిమ్మల్ని ఈ దోషం వెంటాడుతుంది!

గ్రహసంచారం ఆధారంగానే జాతకాన్ని నిర్ణయిస్తారు. అయితే గ్రహాల సంచారం సరిగా లేకుండా ఇబ్బందులు తప్పదు. కొన్ని సందర్భాల్లో గ్రహ సంచారం బావున్నా కానీ కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి..ఎందుకో తెలుసా...

Continues below advertisement

Navagraha Dosh :  జాతకం అద్భుతంగా ఉంది...గ్రహాలు అనుకూలంగా ఉన్నాయనుకుంటే సరిపోదు..కొన్ని చేయకూడని పనులు చేసినా నవగ్రహాల ఆగ్రహానికి గురవుతారు. ఎలాంటి తప్పులు చేస్తే ఏ గ్రహం ఆగ్రహానికి గురవుతారో ఇక్కడ తెలుసుకోండి...

Continues below advertisement

సూర్యుడు 

ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకునే సూర్యభగవానుడికి... పితృదేవతలను దూషిస్తే కోపం వస్తుంది. నమస్కార ప్రియుడు, తర్పణ గ్రహీతగా చెప్పే సూర్యుడికి పెద్దలను దూషిస్తే కోపం వస్తుంది. ముఖ్యంగా సూర్య దేవుని ఎదురుగా మల మూత్ర విసర్జన , దంతావధానం చేయకూడదు

Also Read: ఈ రాశులవారు పని ఒత్తిడి తగ్గించుకోవాలి, ఫిబ్రవరి 27 రాశిఫలాలు

చంద్రుడు 

అద్దం పుట్టడానికి కారణం చంద్రుడు అంటారు. అందుకే అద్దంలో దిగంబరంంగా చూసుకోవడం, వెక్కిరించడం, వింతవింత హావభావాలు ప్రదర్శించడం చేయరాదు. ఇలాంటి పనులు చేస్తే చంద్రుడి ఆగ్రహానికి గురవుతారు. చంద్రుడు మనఃకారకుడు కావడంతో మీకు మనశ్సాంతి దూరమవుతుంది

గురువు

విద్య నేర్పించిన గురువుని ఎవరైనా  కించపరిస్తే ఆగ్రహం చెందుతాడు దేవతల గురువుగా చెప్పే బృహస్పతికి. విద్యాబుద్ధులు నేర్పించి, ఉన్నతంగా తీర్చి దిద్దిన గురువులపట్ల భక్తి, శ్రద్ధ ఉండాలికానీ దూషించడం సరికాదు. గురువుని కించపరిస్తే ఆగ్రహించే గురువు...వారిని పూజించి గౌరవిస్తే మాత్రం అనుగ్రహిస్తాడు

Also Read: మార్చి 08 శివరాత్రి లోగా ఇది నేర్చేసుకోండి !

శుక్రుడు

బంధాల మధ్య వివాదాలంటే శుక్రుడికి మహా కోపం. ప్రేమ కారకుడిగా చెప్పే శుక్రుడు..భార్య-భర్త మధ్య బంధం సరిగా లేకున్నా, ఒకర్నొకరు అగౌరవ పరుచుకున్నా అస్సలు నచ్చదు. మరీ ముఖ్యంగా శుచీ శుభ్రత లేని ఇల్లు, నిత్యం గొడవలు జరిగే ఇంటిపై శుక్రుడి ఆగ్రహం ఉంటుంది. ఫలితంగా  ఆఇంట్లో ఎదుగుదల ఉండదు

కుజుడు

అప్పులు చేసేవారాన్నా,తిరిగి చెల్లించని వారన్నా కుజుడికి కోపం వచ్చేస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించి మోసం జరిగితే కుజుడు ఆగ్రహం నుంచి అస్సలు తప్పించుకోలేరని చెబుతారు  

బుధుడు
ఒక్కక్కరికి ఒక్కో అవలక్షణం ఉంటుంది. కొన్ని బయటకు కనిపిస్తాయి ఇంకొన్ని కనిపించవు. ముఖ్యంగా నోట్లో వేలుపెట్టుకోవడం, ముక్కులో వేలుపెట్టుకోవడం చేస్తుంటారు. అయితే బుధుడికి మాత్రం చెవిలో వేలుపెట్టుకునేవారంటే అస్సలు నచ్చదు. బుధవారం రోజు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇంకా వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, తెలివైనోడిని అని అహంకారం చూపినా ఆ సరదా బుధుడు తీర్చేస్తాడట.

శని

శని...ఈ పేరు వింటే వణికిపోని వారుండరు. ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో దశలో శని కారణంగా బాధపడతారు. అయితే ఏలినాటి శని, అష్టమ శని, అర్థాష్టమ శని నుంచి జీవితకాలంలో ఎవ్వరూ తప్పించుకోరు. అయితే  ఎలాంటి శని బాధలు లేనివారు కూడా శని ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే పెద్దల్ని కించపరిచేవారు,  తల్లిదండ్రులను చులకనగా చూసేవారు, మురుగుదొడ్లు శుచిగా ఉంచనివారిపై శని ఆగ్రహం ఉంటుంది. 

Also Read: రెండు దేహాలు ఒక్కటిగా కనిపించడమే అర్థనారీశ్వర తత్వమా?

రాహువు

వైద్య వృత్తి పేరుతో మోసం చేసేవారిపై రాహువు ఆగ్రహం తప్పకుండా ఉంటుంది. సర్పాలను ఏమైనా చేసినా రాహువు ఆగ్రహానికి గురికాకతప్పదు.

కేతువు

జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన వారిపై కేతువు ఆగ్రహం ఉంటుంది. మోక్ష కారకుడు అయిన కేతువుకి... పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు. జాతకంలో కేతువు సంచారం బాగాపోతే పిశాచపీడ కలుగుతుంది.

ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు

గమనిక: పండితులు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

Continues below advertisement