Who Will Win In Narsipatnam Constituency : ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం నర్సీపట్నం. ప్రస్తుతం ఈ నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి ద్విసభకు ఎన్నిక జరిగింది. మొత్తంగా 16 సార్లు ఎన్నికలు జరగ్గా, రానున్న సార్వత్రిక ఎన్నికలతో 17వ ఎన్నిక ఇక్కడ జరగనుంది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 2,47,816 మంది ఓటర్లు ఉండగా, పురుష ఓటర్లు 1,22,208 మంది కాగా, మహిళా ఓటర్లు 1,25,606 మంది ఉన్నారు.
16 ఎన్నికలు.. ఫలితాలు ఇవే
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను తీరును పరిశీలిస్తే.. సమాన స్థాయిలో విజయాలతో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ సమానంగా నిలిచాయి. ఇరు పార్టీలు ఏడుసార్లు చొప్పున ఇక్కడ విజయం సాధించాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భాం తరువాత జరిగిన పది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఆరుసార్లు విజయం సాధించగా, నాలుగుసార్లు కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
1955లో తొలిసారి ఇక్కడ ద్విసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎం పోతురాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన ఎం పిచ్చయ్యపై 347 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 1955లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్ రాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన వీర్రాజుపై 7030 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసిన ఆర్ లచ్ఛాపాత్రుడు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్ రాజుపై 4893 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు.
1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్ రాజు మరోసారి వవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌ఎల్ పాత్రుడిపై 14,848 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్ రాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి పోటీ చేసి బి గోపాత్రుడిపై 11,042 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గోపాత్రుడు బోలెం విజయం సాధిచంఆరు. తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి ఆర్‌ఎస్‌ఎన్ రాజుపై 8560 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సీహెచ్ అయ్యన్నపాత్రుడు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్ రాజుపై 21,179 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వి శ్రీరామ్మూర్తిపై 811 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సాగి కృష్ణమూర్తిరాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడిపై 10,955 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు మరోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సాగి కృష్ణమూర్తిరాజుపై 21,179 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
1996లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వి శ్రీరామ్మూర్తి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సాగి కృష్ణమూర్తిరాజుపై 12,327 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు మరోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎస్ రామచంద్రరాజుపై 8559 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన డీవీఎస్ నారాయణరాజుపై 23,930 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బి ముత్యాలపాప తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడిపై 8287 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు మరోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి బరిలోకి దిగిన పెట్ల ఉమా శంకర్ గణేష్‌పై 2338 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెట్ల ఉమా శంకర్ గణేస్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడిపై 22,839 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఇక్కడ గడిచిన పది ఎన్నికలను పరిశీలిస్తే.. ఆరుసార్లు అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అయ్యన్నపాత్రుడు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి పెట్ల ఉమాశంకర్ గణేష్ బరిలో ఉన్నారు. వీరి పోటీ వచ్చే ఎన్నికల్లో ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నారు.