What Does Your Birth Month Say About You: జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒకరి జాతకం చూడాలంటే పుట్టిన సమయం, గ్రహాల స్థితిని గమనిస్తారు. జన్మ నక్షత్రాన్ని బట్టి, ఆ నక్షత్రంలో ఉండే నాలుగు పాదాల ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి. రాశి చక్రం, అంశ చక్రం ఆధారంగా భవిష్యత్ ని అంచనా వేస్తారు. ఒక్కో వ్యక్తికి సంబంధించిన పూర్తి సమచారం కోసం వారు పుట్టిన సంవత్సరం, తేదీ, సమయం పరిగణలోకి తీసుకుంటారు. కానీ కొన్ని కామన్ క్వాలిటీస్ గురించి చెప్పేందుకు ఆయా జాతకులు జన్మించిన నెల, రాశి, నక్షత్రం ఆధారంగా చెబుతారు. ఇంగ్లీష్ నెలలు జనవరి నుంచి ప్రారంభమైతే.. తెలుగు నెలలు చైత్రం నుంచి మొదలవుతాయి. తెలుగు నెలల ప్రకారం ఏ నెలలో జన్మించినవారు ఎలా ఉంటారంటే...
Also Read: ఫాల్గుణ మాసం (మార్చి) లో వచ్చే పండుగలివే
చైత్ర మాసం (April)
ఈ నెలలో జన్మించిన వారు బలంగా ఉంటారు, ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. కొత్తగా ప్రారంభించిన ఏ పని అయినా పూర్తయ్యేవరకూ పట్టువదలరు.
వైశాఖ మాసం (May)
ఈ మాసంలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వం కలిగిఉంటారు. అందరకీ ఆదర్శవంతులుగా ఎదుగుతారు. మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు
జ్యేష్ఠమాసం (June)
జ్యేష్ఠమాసంలో జన్మించినవారు చాలా తెలివిగలవారు,ముందుచూపు కలిగిఉంటారు.
Also Read: అద్దంలో అలా చూసుకునే అలవాటుందా - అయితే మిమ్మల్ని ఈ దోషం వెంటాడుతుంది!
ఆషాఢ మాసం (July)
ఈ నెలలో పుట్టినవారు కష్టజీవులు. ఎంత పెద్ద కష్టాన్ని అయినా ఎదుర్కొనేందుకు, దాన్ని సాల్వ్ చేసుకుని ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉంటారు. కష్టాలకు బెదిరేరకం కాదు.
శ్రావణ మాసం (August)
ఈ నెలలో జన్మించిన వారు ప్రముఖ వ్యక్తులుగా ప్రశంసలు అందుకుంటారు. సంఘంలో పేరు ప్రతిష్ఠలు సాధిస్తారు. సంప్రదాయాలకు విలువనిస్తూ జీవితం సాగిస్తారు
భాద్రపద మాసం (September)
ఈ నెలలో పుట్టినవారు అందంగా ఉంటారు. అందరిలో కలివిడిగా ఉంటారు.
Also Read: మార్చి 08 శివరాత్రి లోగా ఇది నేర్చేసుకోండి !
ఆశ్వయుజ మాసం (October)
ఈ నెలలో జన్మించిన వారు దయగలవారై ఉంటారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు
కార్తీక మాసం (November)
ఈ నెలలో పుట్టినవారు మహా మాటకారులు. ఎదుటివారిని ఆకట్టుకోవడంతో వీళ్లకు వీళ్లే సాటి
మార్గశిర మాసం (December)
ఈ నెలలో పుట్టినవారు పరిశోధనలపై ఆసక్తి చూపిస్తారు. ఎక్కువ ప్రాంతాలను సందర్శిస్తారు
పుష్య మాసం (January)
పుష్యమాసంలో జన్మించిన వారు రహస్యాలు దాచడంలో ఘనులు. ఏ విషయం అయినా వీళ్లకి హాయిగా చెప్పేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో వ్యక్తికి చేరవేయరు.
Also Read: రెండు దేహాలు ఒక్కటిగా కనిపించడమే అర్థనారీశ్వర తత్వమా?
మాఘమాసం (February)
ఈ నెలలో పుట్టినవారికి చదువంటే పిచ్చి. పుస్తకాల పురుగులుగా ఉంటారు. మంచి ఆలోచనా విధానం కలిగిఉంటారు.
ఫాల్గుణ మాసం (March)
తెలుగు నెలల్లో చివరి నెల అయిన ఫాల్గుణమాసంలో పుట్టినవారు కుటుంబాన్ని ప్రేమిస్తారు. కుటుంబం తర్వాతే ఏదైనా అని అనుకుంటారు. వీరు చాలా అదృష్టవంతులు.
ఇంగ్లీష్ నెలలు అవే ఉంటాయని పూర్తిగా చెప్పలేం..డేట్స్ ఓ వారం రోజులు అటు ఇటు మారుతాయి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కొన్ని పుస్తకాల నుంచి సేకరించినది మాత్రమే. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం....