Press Note From Ram Gopal Varma : టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. ఈమధ్య ఎక్కువగా పొలిటికల్ బయోపిక్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈయన తాజాగా ఏపీ సీఎం వైయస్ జగన్ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని 'వ్యూహం', 'శపథం' అనే సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలను విడుదల చేద్దామని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతుంది. ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయినా కానీ వర్మ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మార్చి 8న 'వ్యూహం' సినిమాని విడుదల చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇలాంటి తరుణంలో వర్మ తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు.
'వ్యూహం', 'శపథం'.. ఓటీటీలో మరో వెర్షన్..
'వ్యూహం' సినిమా పలు వాయిదాల అనంతరం మార్చి 8న విడుదల చేస్తామని టీం అధికారికంగా ప్రకటించింది. శుక్రవారమే సినిమా రిలీజ్ ఉన్నప్పటికీ ఇప్పటిదాకా ప్రమోషన్స్ లేకపోవడంతో మరోసారి వాయిదా పడుతుందని అంతా అనుకుంటున్నా సమయంలో రాంగోపాల్ వర్మ ఓ షాకింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేంటంటే.. 'వ్యూహం', 'శపథం' సినిమాలను ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ ప్రెస్ నోట్ లో ఏముంది?
" వ్యూహం శపథం సినిమాల వెనక మా అసలు వ్యూహం సైడ్ బై సైడ్ వెబ్ సిరీస్ కూడా తీయడం. వేరువేరు అడ్డంకుల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సెన్సార్ బోర్డ్ అనుమతించిన వెర్షన్ మాత్రమే థియేటర్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మేము మొదటినుంచి రెడీ చేసి పెట్టుకున్న వెబ్ సిరీస్ 'శపథం' ఆరంభం చాప్టర్-1 ని ఈరోజు సాయంత్రం మార్చి 7 న 8 గంటలకు అలాగే 'శపథం' అంతం చాప్టర్- 2 ని రేపు మార్చి 8 సాయంత్రం 8 గంటలకు ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఫైబర్ నెట్ ఓటీటీ యాప్ ద్వారా పే ఫర్ వ్యూలో చూసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. ఆ తర్వాత అంచలవారిగా అన్ని ఫార్మాట్స్లో రిలీజ్ అవుతాయి. 'శపథం' ఆరంభం చాప్టర్- 1, 'శపథం' అంతం చాప్టర్-2 రెండు కూడా తీసిన ఉద్దేశం.. ఏమీ దాచకుండా పచ్చి నిజాలు చూపించడానికి మాత్రమే" అంటూ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ.
అవేమి 'వ్యూహం' లో ఉండవు - దాసరి కిరణ్ కుమార్
కాగా రాంగోపాల్ వర్మ తీసిన 'వ్యూహం', 'శపథం' సినిమాలు ఏపీ సీఎం వైఎస్ జగన్ కి ఫేవర్ గా ఉండబోతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవలే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 2009 నుంచి 2019 వరకు జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంతో వ్యూహం సినిమా ఉంటుందని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తెలిపారు. ఇందులో యదార్థ ఘటనల స్పూర్తిగా ఫిక్షనల్ కథను చూస్తారు. మన పేపర్స్, టీవీ, యూట్యూబ్ లో చూసిన విషయాలేవీ వ్యూహంలో ఉండవు. ఆ ఘటనల వెనక దాగి ఉన్న కుట్రలు, కుతంత్రాలు, నిజాలతో వర్మ వ్యూహం సినిమాను రూపొందించారు" అని చెప్పారు.
Also Read : మైనస్ 40 డిగ్రీస్‌లో ‘గామి’ షూటింగ్, అక్కడ ఆక్సిజన్ కూడా ఉండదు: చాందిని చౌదరి