Actor Suhas About His Remunaration : ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ జనరేషన్ టాలెంటెడ్ హీరోల్లో సుహాస్ కూడా ఒకడు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసి ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు. 'కలర్ ఫోటో' సినిమాతో హీరోగా మారిన సుహాస్ మొదటి సినిమాతోనే ఆడియన్స్ చేత కన్నీళ్ళు పెట్టించాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇటీవల 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సుహాస్ త్వరలోనే 'ప్రసన్న వదనం' అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో రాబోతున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సుహాస్ తన రెమ్యూనరేషన్ గురించి నోరు విప్పాడు.


వెయ్యి రూపాయల నుంచి మొదలై.. మూడు కోట్ల వరకు..


సుహాస్ హీరోగా 'ప్రసన్న వదనం' అనే తెరకెక్కుతోంది. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్లపై మణికంఠ, ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈరోజు చిత్ర టీజర్ రిలీజ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సుహాస్ ని ఓ రిపోర్టర్ రెమ్యూనరేషన్ గురించి ప్రశ్న వేశాడు. రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న తర్వాత మీరు రెమ్యునరేషన్ పెంచారుని టాక్ వస్తుంది.. నిజమేనా? అని అడిగితే.. "అవును పెంచాలిగా మరి.. నేను బతకొద్దా, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను. రోజుకు 100 రూపాయలు తీసుకునే దగ్గర్నుంచి వచ్చాను. తీసుకోవాలనుకుంటాను కదా నేను కూడా" అని అన్నాడు. అయితే మూడు వేల నుంచి మూడు కోట్ల వరకు ఎదిగారని సోషల్ మీడియాలో టాపిక్ నడుస్తోంది. అది కూడా నిజమేనా? అని అడిగితే. "వెయ్యి రూపాయల నుంచి 3000 కోట్లు.. నువ్వు చెప్పావు కాబట్టి చెబుతున్నా గాని అంత తీసుకోవట్లేదు" అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. 


సుహాస్ ప్రెజంట్ రెమ్యునరేషన్ ఎంతంటే..


హీరోగా సుహాస్ రెమ్యూనరేషన్ పెంచినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే వార్తలపై స్పందించిన సుహాస్ నిజంగానే రెమ్యూనరేషన్ పెంచినట్లు తన కామెంట్స్ తో స్పష్టం చేశాడు. అయితే ఎంత అనేది మాత్రం కరెక్ట్ నెంబర్ చెప్పలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతానికి సుహాస్ ఒక సినిమాకి సుమారు కోటి రూపాయలకి పైనే రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా రెమ్యునరేషన్ విషయంలో సుహాస్ ని సపోర్ట్ చేస్తున్న నెటిజన్స్.. ‘‘ఎంతో కష్టపడి పైకి వచ్చి సక్సెస్ లు అందుకున్న హీరోలు చేయడంలో తప్పేముంది’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా 'ప్రసన్న వదనం' సినిమాలో సుహాస్ మరో డిఫరెంట్ రోల్ తో అలరించబోతున్నాడు. ఇందులో సుహాస్ ఫేస్ బ్లైండ్ నెస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు టీజర్ లో చూపించారు.


Also Read : చిన్మయి వల్ల తమిళంలో వర్క్స్ తగ్గాయి, ఆ విషయంపై మాట్లాడటం మానేశా - భర్త రాహుల్ షాకింగ్ కామెంట్స్