Shivratri 2024  Mantras for each zodiac sign: ఏడాదిలో 12 శివరాత్రిలు ఉంటాయి, అయితే మాఘమాసంలో వచ్చే శివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది మార్చి 8న మహాశివరాత్రి వచ్చింది. పిలిస్తే పలికే బోళా శంకరుడు కావడం వల్లనే ఎందరో రాక్షసులు ప్రసన్నం చేసుకుని ప్రపంచానికి చేటు తెచ్చే వరాలు పొందారు. రాక్షసులనే కరుణించిన పరమశివుడు నిజమైన భక్తులను ఎందుకు అనుగ్రహించడు..ఎలా పిలిచినా పలుకుతాడు..వరాలు గుప్పిస్తాడు.  అయితే ఎలా పలిచినా పలుకుతాడు,పరమేశ్వర అనుగ్రహం అందరిపైనా ఉంటుంది కానీ..మీ రాశిని బట్టి మంత్రం స్మరిస్తే మంచి ఫలితాలు పొందుతారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి మీ రాశి ప్రకారం ఏం పఠించాలంటే...
ఈ రోజు ఏ రాశివారు ఏ మంత్రాన్ని జపిస్తే పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి...


మేషరాశి


వారు శివునికి ఎర్రటి పుష్పాలను సమర్పించి, మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ రోజు ఉపవాసం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు విజయాన్ని సాధించడం మంచిది. ఓం నాగేశ్వరాయ నమః మంత్రాన్ని జపించాలి.


Also Read: పార్వతీ దేవికి నిజంగా సమాధానం తెలియకే శివుడిని ప్రశ్నించిందా!


వృషభ రాశి


వృషభ రాశి వారు శివునికి తెల్లటి పుష్పాలను సమర్పించి రుద్రాభిషేక పూజలో పాల్గొనడం ద్వారా అనుగ్రహాన్ని పొందవచ్చు. ఓం నమః శివాయ మంత్రాన్ని పఠించడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు పొందుతారు


మిథున రాశి


మిధున రాశి వారు మహా శివరాత్రి రోజు మహా మృత్యుంజయ హవనాన్ని నిర్వహించాలి. పరమేశ్వరుడికి ఆకుపచ్చ పండ్లు సమర్పించడం ద్వారా చేపట్టిన కార్యాల్లో విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు రుద్రాష్టకం పఠించాలి.


Also Read:  'ఏకబిల్వం శివార్పణం' - మారేడు దళాలు శివ పూజకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!


కర్కాటక రాశి 


మహా శివరాత్రి రోజు కర్కాటక రాశివారు పరమేశ్వరుడికి తెల్లని పూలు సమర్పించాలి..పాలతో అభిషేకం చేయాలి. మహా మృంత్యుంజయ పూజలో పాల్గొనడం, ఉపవాసం ఉండడం వల్ల కొంతకాలంగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శివచాలీశా పఠించాలి. 


సింహ రాశి 


ఈ రాశివారు మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం చేయాలి..శంకరుడికి ఎర్రటి పూలు సమర్పించాలి. 108 సార్లు మహా మృత్యుంజయ మంత్రాన్ని, శివ పంచాక్షరి పఠించాలి. 


కన్యా రాశి 


మహా శివరాత్రి రోజు కన్యా రాశి వారు వారు శివునికి పాలతో అభిషేకం చేసి..తెల్లని పూలు సమర్పించాలి. రుద్రాభిషేకంలో పాల్గొనడం వల్ల కొన్నాళ్లుగా మీ విజయానికి ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి. శివ పంచాక్షరి మంత్రం, శివాష్టకం చదువుకోవాలి. 


Also Read: శివనిందను భరించలేక సతీదేవి ప్రాణత్యాగం, అమ్మవారి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు ఇవే!


తులా రాశి


ఈ రాశివారు శంకరుడికి తెల్లని పూలు సమర్పించాలి. మహా మృత్యుంజయ హోమంలో పాల్గొంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.    ఓం నమః శివాయ మంత్రాన్ని పఠించడం వల్ల  ఆరోగ్యం, విజయం మీ సొంతం 


వృశ్చిక రాశి 


మహా శివరాత్రి రోజు ఈ రాశివారు రుద్రాభిషేకం చేయాలి. ఎర్రటి పూలతో పరమేశ్వరుడిని పూజిస్తే కొంత కాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఓం పార్వతీనాథాయ నమః అని 108 సార్లు జపించాలి


ధనుస్సు రాశి 


ధనస్సు రాశివారు భోళా శంకరుడికి పసుపు రంగు పూలు సమర్పించాలి. శివ పంచాక్షరి, మహా మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల మంచి జరుగుతుంది. గడిచిన ఏడాదిలో పడిన ఇబ్బందుల నుంచి ఈ ఏడాది మీకు ఉపశమనం లభిస్తుంది..పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఉంటుంది. ఈ రోజు మీరు ఓ అంగరేశ్వరాయ నమః అని పఠించాలి. 


Also Read: మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో చెప్పేయండి!


మకర రాశి


మకర రాశి వారు శివరాత్రి రోజు అభిషేకం నిర్వహించాలి. శివయ్యకి నీలిరంగు పుష్పాలు సమర్పించడం వల్ల మీ కోర్కెలు ఫలిస్తాయి. ఈ రోజు ఉపవాసం చేయడం , పరమేశ్వరుడి ప్రార్థనలో రోజంతా ఉండడం వల్ల ఆరోగ్యం, విజయం ఉంటుంది. మహా శివరాత్రి రోజు ఓ భమేశ్వరాయ నమః అని జపించాలి


కుంభ రాశి 


కుంభ రాశివారు శివుడికి తెల్లని పూలు సమర్పించాలి. మహా మృత్యుంజయ మంత్రం పఠించడం కానీ మహా మృత్యుంజయ హోమంలో పాల్గొనడం వల్ల అనుకున్న కార్యాలు నిర్వఘ్నంగా పూర్తవుతాయి. పంచాక్షరి మంత్రం జపించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


Also Read: కైలాసంలో శివుడి సన్నిధిలో ఉన్నామా అనిపించే పాటలివి - వింటే పూనకాలే!


మీన రాశి


మీన రాశివారు శివుడికి స్వచ్ఛమైన తెల్లని పుష్పాలు సమర్పించాలి. శివాలయాన్ని సందర్శించి శివాష్టకం పఠిస్తే అంతా మంచే జరుగుతుంది. 


నోట్: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.