అన్వేషించండి

Tirumala: తిరుమలలో వైభవంగా కైశిక ద్వాదశి .. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ వేడుక ప్రాశస్త్యం ఏంటంటే!

Tirumala News:శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు మాడవీధుల్లో ఉగ్ర శ్రీనివాసుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు

Tirumala   Ksheerabdi Dwadasi 2024 : తిరుమలలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెలిగే తిరుమలలో ఏడాది మొత్తం ఏదో ఒక సేవ జరుగుతూనే ఉంటుంది. అయితే ఏడాదిలో ఒక్కసారి మాత్రమే జరిగే కార్యక్రమం కైశిక ద్వాదశి. ఏటా కార్తీకమాసం పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి / క్షీరాబ్ధి ద్వాదశి/ ఉత్థాన ద్వాదశి రోజు ఈ అరుదైన కార్యక్రమం నిర్వహిస్తారు.  

కైశిక ద్వాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌ కన్నులపండువగా జరిగింది. వేకువ ఝామున  4.30 నుంచి  5.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆల‌య మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. చిరుజల్లుల కారణంగా శ్రీవారు ఘటాటోపం లోపల భక్తులకు దర్శనమిచ్చారు. 

వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా కేవలం  కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి, అమ్మ‌వార్ల‌ను బంగారువాకిలికి వేంచేపు చేసి పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ వేడుకను ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు.పంచబేరాల్లో ఒకటైన ఉగ్రశ్రీనివాసమూర్తి ఏడాది మొత్తం ఆలయంలోనే ఉండి ఈ ఒక్కరోజు బయటకు వచ్చి మాడవీధుల్లో విహరిస్తారు. అనంతరం ఆలయం లెక్కలన్నీ ఆయనకు చెప్పి ఆస్థానం నిర్వహిస్తారు అర్చకులు

Also Read: నవంబరు 13నే క్షీరాబ్ధి ద్వాదశి - కార్తీకమాసంలో ఈ రోజుకి ఎందుకంత ప్రాధాన్యతో తెలుసా!

కైశిక ద్వాదశి ప్రాశ‌స్త్యం

శ్రీ వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ పెరుమాళ్ కైశిక‌పురాణంలో 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు.  

నంబ‌దువాన్ క‌థ

శ్రీనంబదువాన్‌ అనే భక్తుడు  శ్రీ వేంకటేశ్వర  స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి బయలుదేరాడు.  మార్గమధ్యలో ఓ బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని  తిరిగివచ్చి ఆహారంగా మారుతానని చెప్పి  నంబదువాన్ ప్రమాణం చేశాడు.  ఇచ్చిన మాట ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించిన తర్వాత బ్రహ్మరాక్షసుని దగ్గరకు వెళ్లాడు.  భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడైన స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఇలా ఉత్తానద్వాదికి కైశిక ద్వాదశి అనే పేరొచ్చింది. 
 
కన్నులపండువగా జరిగిన  కైశిక ద్వాదశి కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయర్‌స్వామి, టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read: లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం క్షీరాబ్ధి ద్వాదశి పూజ ఇలా ఈజీగా చేసేసుకోండి !

నవంబరు 17 కార్తీక వన భోజనం - నవంబరు 18 కార్తీక దీపోత్సవం

తిరుమలలో ఈ నెల 17 ఆదివారం కార్తీక వనభోజనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది టీటీడీ. చిన్న గజ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి పార్వేట మండపానికి ఊరేగింపుగా చేరుకుంటారు. గోగర్భం సమీపంలో ఉన్న పార్వేట మండపంలో వనభోజన కార్యక్రమం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది.  అనంతరం స్నపన తిరుమంజనం జరుగుతుంది. నవంబరు 18 కార్తీక సోమవారం రోజు TTD పరిపాలనా భవనం మైదానంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కార్తీక దీపోత్సవం నిర్వహిస్తారు.

Also Read:  క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ ఇదే.. తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాక చదువుకోవాలి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Embed widget