అన్వేషించండి

తిరుమలలో వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం- ఇంతకీ ఈ సేవ ఎందుకు చేస్తారు?

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 27 నుంచి అక్టోబ‌ర్‌ 5వ తేదీ వరకు సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు.

ఈ నెల 27 నుంచి అక్టోబ‌ర్‌ 5వ తేదీ వరకు జరిగే సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం సుందరంగా ముస్తాబవుతోంది. అందులో భాగంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. 
ఆళ్వార్లు మొత్తం 12 మంది. ఆ ప‌న్నెండు మందిలో కోయిల్ ఆళ్వార్ అనే వ్య‌క్తి లేడు. దేవాల‌యాన్నే ఆళ్వార్ గా వైష్ణ‌వులు భావిస్తారు. అందుచేత కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం అంటే ప్ర‌ధాన దేవ‌త ఉన్న ప్రాంతాన్ని అభిషేకించ‌డం అని అర్థం. ఆలయ పరిసరాన్ని, ప్రత్యేకించి గర్బాలయాన్ని పవిత్రంగా ఉంచడానికి  జరిపే సేవ ఇది. ఆ పవిత్ర గర్భాలయ స్థానాన్ని సంప్రదాయ, వైఖానస ఆగమోక్తంగా శుద్ధి చేసే కైంకర్యమే కోయిల్ ఆళ్వారు తిరుమంజనం.

కోయిల్‌ ఆళ్వార్‌ సేవ సంవత్సరంలో నాలుగు సార్లు జరుగుతుంది. ఉగాది స‌మ‌యంలో, ఆణివార ఆస్టానం స‌మ‌యంలో వార్షిక బ్రహ్మోత్స‌వాల‌కు ముందు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారాల్లో ఈ సేవ జరుగుతుంది. సుగందద్రవ్యాదులతో కలిపిన నీటితో గర్బాలయాన్ని శుద్ది చేయడం ఈ ఉత్సవం ప్రత్యేకత. 

శ్రీవారి గ‌ర్భాల‌యానికి ఆనంద‌నిల‌యం అని పేరు. అక్క‌డి నుంచి ఆల‌య మ‌హాద్వారం వ‌ర‌కు శుద్ది చేస్తారు. ఈసంద‌ర్భంగా స్వామివారిపై దుమ్మూధూళి పడకుండా స్వామి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళవర్ణ వస్త్రాన్ని కప్పుతారు. దీన్నే ‘మలైగుడారం’ అంటారు. స్వామి అంశగా భావించే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మలైగుడారం లోపలే ఉంచుతారు. లోప‌ల అంతా శుద్ధి అయిన త‌ర్వాత మాత్ర‌మే భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు. 

ఇక్కడే కొలువైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగద.. పరివార దేవతా మూర్తులను ఘంటా మండపం/ గరుడాళ్వార్ సన్నిధికి తరలిస్తారు. వాటి చుట్టూ తెల్ల‌టి వ‌స్త్రాల‌తో తెరలు కట్టి ఈ మూర్తులకు ఏకాంతంగా తిరుమంజనం పూర్తి చేసి కొత్త పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. ఇక గర్భాలయంలో మాత్రం కేవ‌లం అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పుకు అంటుకున్న దుమ్ముధూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో  శుద్ధిచేస్తారు. 

 క్రీ.శ.1535 స‌మ‌యంలో ప్ర‌తి సంవ‌త్స‌రం ప‌ది వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హించేవారు. ఆ స‌మ‌యంలో ప్ర‌తి బ్ర‌హ్మోత్స‌వానికి ముందు ఆల‌య‌శుద్ధి నిర్వ‌హించేవార‌ని తిరుమ‌ల శాస‌నాల ద్వారా తెలుస్తోంది. కోయిల్ ఆళ్వారు తిరుమంజ‌నం అంటే కేవ‌లం ఆల‌య శుద్ధి మాత్ర‌మే కాదు అందులో మ‌రింత లోతైన అర్థం దాగి ఉంది. త‌మిళంలో కోయిల్ అంటే గుడి. ఆళ్వారు అంటే భ‌క్తుడు అని అర్థం. ప్ర‌తి ఒక్క భ‌క్తుడికి మ‌న‌స‌నే కోవెల‌లో భ‌గ‌వంతుడు కొలువై ఉంటాడ‌ని. దాన్ని శుద్దిగా ఉంచుకోవాల‌నేది ఇందులో ప‌ర‌మార్థం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Purnima 2026 May: మే నెలలో రెండు పౌర్ణమిలు , చివరి రోజున అరుదైన బ్లూ మూన్ చాలా ప్రత్యేకం దర్శనం!
మే నెలలో రెండు పౌర్ణమిలు , చివరి రోజున అరుదైన బ్లూ మూన్ చాలా ప్రత్యేకం దర్శనం!
ఈ రోజు రాశి ఫలాలు మే 30, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
ఈ రోజు రాశి ఫలాలు మే 30, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Chanakya Niti In Telugu: ఆ 6 విషయాల్లో నిజం ఎప్పటికీ చెప్పరు! ప్రతి భార్య భర్త దగ్గర దాచే విషయాలు!
చాణక్య నీతి: ఆ 6 విషయాల్లో నిజం ఎప్పటికీ చెప్పరు! ప్రతి భార్య భర్త దగ్గర దాచే విషయాలు!
Women Wallet Tips: మహిళలు పర్స్/హ్యాండ్‌బ్యాగ్ లో ఈ వస్తువులు ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది!
మహిళలు పర్స్/హ్యాండ్‌బ్యాగ్ లో ఈ వస్తువులు ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది!

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
Embed widget