By: ABP Desam | Updated at : 14 Oct 2023 07:45 AM (IST)
బతుకమ్మకు ఇష్టమైన నైవేద్యాలు ఇవే.. తొలిరోజు ఎంగిపూల బతుకమ్మకు సమర్పించే నైవేద్యం ఏమిటో తెలుసా? (Representational Image/pinterest)
Batukamma 2023: పుడమికి పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా సింగారించుకునే వేళ.. నిండిన చెరువులు, పండిన పంటలతో అలరారే సమయంలో.. కురిసే చినుకుల తాకిడితో భూమి తల్లి పచ్చగా మెరిసే క్షణాల్లో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా భావించే పూల పండుగ బతుకమ్మ ప్రారంభమవుతుంది. పూలతో దేవుడిని కొలిచే దేశంలో.. ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు ఏటా మహాలయ అమవాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. ఆడపడుచులు తీరొక్క పూలతో, రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి, ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.
Also Read : బతుకమ్మ పండుగలో పూలకు అంత ప్రాధాన్యత ఎందుకు!
బతుకమ్మ పండుగ అంటేనే సంతోషాలు.. సంబరాలు.. పూలను ఆరాధించే ఈ అపురూప పండుగ. ఈ సందర్భంగా రకరకాల ప్రసాదాలు, పిండి వంటకాలు, రుచికరమైన చిరుతిండ్లు తయారు చేస్తారు. ఈ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఏ ఇంట్లో చూసినా ఘుమఘుమలు నోరూరిస్తాయి. పల్లెల్లో అయితే పోటాపోటీగా భిన్న రుచులను తయారు చేసి మరీ వడ్డిస్తారు. ఇంట్లో చేసుకున్న ఏ వంటకమయినా.. మరో నలుగురికి పంచి వారితో తినిపించడం బతుకమ్మ పండుగలో కనిపించే ముఖ్యమైన సన్నివేశం.
మహాలయ అమావాస్య నాడు ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు ఆశ్వీయుజ అష్టమితో ముగుస్తాయి. దీన్ని తెలంగాణలో పెత్ర అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకొనే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ నాడు సమర్పించే నైవేద్యం వివరాలు తెలుసుకుందాం.
Also Read: బతుకమ్మ పండుగలో 9 రోజులు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలంటే!
ఎంగిలిపూల బతుకమ్మ నైవేద్యం వివరాలు
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలిపడ్డాయని తలచి ఎంగిలిపూలుగా పరిగణిస్తారు. పితృ అమావాస్య రోజు స్వర్గస్తులైన పెద్దలకు బియ్యం ఇచ్చుకొని, వారిని దేవతలుగా ఆరాధిస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో తెచ్చిన పూలన్నీ ఎంగిలిపడ్డట్టుగా భావిస్తారు.
మొదటి రోజు నైవేద్యం - నువ్వుల పిండి, బియ్యం పిండితో చేసే ప్రసాదం
తయారీ విధానం: కప్పు నువ్వులు తీసుకుని కడాయిలో వేయించాలి. గోధుమ రంగులోకి వచ్చాక తీసి పంచదార వేసి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో బియ్యంపిండి, నూకలు కూడా కలుపుకోవచ్చు. ఇదే ఎంగిలిపూల బతుకమ్మకు సమర్పించే నైవేద్యం.
రెండో రోజు: అటుకుల బతుకమ్మ
నైవేద్యం: చప్పిడి పప్పుతో పాటు బెల్లం - అటుకులు
తయారీ: ముందుగా చప్పిడి పప్పు తయారుచేసుకోవాలి. కందిపప్పుకు కాస్త పసుపు కలిపి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. నెయ్యితో ఆ పప్పును తాళింపు వేసుకోవాలి. ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేయకూడదు. ఇది చప్పిడి పప్పు కాబట్టి కారం ఉండకూడదు.
ఇక బెల్లం - అటుకుల రెసిపీ కోసం ముందుగా కడాయిలో నెయ్యివేసి జీడిపప్పులు, కిస్మిస్, బాదం వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో బెల్లం వేసి కరిగించుకోవాలి. అవి కరిగాక అటుకులను శుభ్రం చేసి మరీ మెత్తగా నానిపోకుండా తీసి బెల్లంలో వేసి కలిపేయాలి. పైన ముందుగా వేయించిన డ్రైఫ్రూట్స్ ను చల్లుకోవాలి. అంతే బెల్లం - అటుకుల ప్రసాదం రెడీ.
మూడో రోజు: ముద్దపప్పు బతుకమ్మ
నైవేద్యం: ముద్దపప్పు
తయారీ: కుక్కర్లో కందిపప్పు, పసుపు, కరివేపాకులు, దంచిన జీలకర్ర, ఒక స్పూను నూనె, నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికాక ఉప్పు కలుపుకోవాలి. ముద్దపప్పు ప్రసాదం సిద్ధమైనట్టే.
నాలుగో రోజు: నానబియ్యం బతుకమ్మ
నైవేద్యం: బెల్లం అన్నం లేదా పరమాన్నం
తయారీ: ఒక కప్పు బియ్యాన్ని మూడు కప్పుల పాలలో ఉడికించాలి. పాలలో బియ్యం ఉడకవు అనుకుంటే రెండు ఒకటిన్నర కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు పోయచ్చు. మరో పక్క కడాయిలో బెల్లాన్ని కరిగించుకోవాలి. అలాగే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అన్నం ఉడికాక చివర్లో కరిగించిన బెల్లం పాకాన్ని వేసి కలపాలి. స్టవ్ ఆపేయాలి. బెల్లంగా బాగా కలిశాక పైన ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేయాలి. అంతే బెల్లం అన్నం సిద్ధం.
ఐదో రోజు: అట్ల బతుకమ్మ
నైవేద్యం: అట్లు లేదా దోశెలు
తయారీ: ఈ రోజు ప్రసాదం చేయడం చాలా సులువు. ఇంట్లో రోజూ చేసుకునే అట్లు లేదా దోశెలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే బియ్యంపిండితో చేసిన అట్లు పెడితే మంచిదని చెబుతారు. దీనికి ఒక గిన్నెలో కప్పు బియ్యంపిండి, పావు కప్పు రవ్వ, పావు కప్పు పెరుగు, జీలకర్ర, తగినంత నీళ్లు వేసి బాగా కలపాలి. దోశె పిండిలా జారేలా కలుపుకోవాలి. పది నిమిషాలు పక్కన పెట్టాక ఆ పిండితో అట్లు లేదా దోశెలు వేసి అమ్మవారికి సమర్పించాలి.
ఆరో రోజు: అలిగిన బతుకమ్మ
నైవేద్యం: ఈ రోజు ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించరు.
ఏడో రోజు: వేపకాయల బతుకమ్మ
నైవేద్యం: బియ్యంపిండితో చేసే వేపకాయలు ప్రసాదం
తయారీ: ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యంపిండి, రెండు స్పూన్ల నువ్వులు, తగినంత ఉప్పు వేసి కలపాలి. అందులో గోరువెచ్చని నీళ్లు వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ ముద్దను వేపకాయల్లా చేతితో నొక్కుకుని నూనెలో వేయించాలి. అంతే వేపకాయల ప్రసాదం సిద్ధం.
Also Read : వెయ్యేళ్ల ఘన చరిత్ర బతుకమ్మ పండుగ
ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ
నైవేద్యం: వెన్నముద్దలు
తయారీ: వెన్నముద్దలు చేసేందుకు గిన్నెలో అరకప్పు బియ్యంపిండి వేయాలి. అందులో రెండు స్పూన్ల వెన్న, కాస్త వేడి నీళ్లు పోసి చపాతీ పిండిలా వచ్చే వరకు కలపాలి. ఇప్పుడు చిన్న ముద్ద తీసి గులాబ్ జాముల్లా గుండ్రంగా చుట్టుకోవాలి. అలా గుండ్రని ముద్దలు తయారయ్యాక వాటిని నూనెలో వేయించాలి. మరో పక్క పంచదార పాకం తయారుచేసుకుని, వేయించిన వెన్నముద్దలను తీసి ఆ పాకంలో వేయాలి. అంతే.. అమ్మవారికి తీయని వెన్నముద్దల నైవేద్యం సిద్ధమైనట్టే.
తొమ్మిదో రోజు - సద్దుల బతుకమ్మ
నైవేద్యం : కొబ్బరన్నం, నువ్వుల సద్ది, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, దద్దోజనం... ఇలా ఐదు రకాల నైవేద్యాలను తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు
Spirituality: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !
Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!
Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!
Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు
YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !
Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!
/body>