Horoscope Today 12th April 2022: ఈ రోజు ఈ రాశివారు మాటలతో కట్టిపడేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఏప్రిల్ 12 మంగళవారం రాశిఫలాలు
మేషం
ఈ మంగళవారం మీ కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగులకు శుభసమయం. వ్యాపారులకు లాభాలొస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
వృషభం
తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. పరుషమైన మాటలతో ఎవ్వరినీ బాధపెట్టొద్దు. ఆర్థికంగా మరింత బలపడేందుకు కొన్ని మూలాలు వెతుక్కోండి. వైవాహిక జీవతం బావుంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం
ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. మీ మాటతీరు, పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారం బాగాసాగుతుంది. ఉద్యోగులకు కలిసొచ్చే సమయం. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి.
కర్కాటకం
కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలు, విభేదాలు తొలగించుకునేందుకు ఇదే మంచి సమయం. మీ విధానాన్ని మరింత సున్నితంగా మార్చుకోండి. మానసిక స్థితి అస్థిరంగా ఉంటుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులద్వారా కొన్ని తలనొప్పులను తగ్గించుకోవచ్చు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త.
సింహం
నూతన వ్యక్తులను కలుస్తారు. మీరు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల, స్నేహితుల సహకారం ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. కొత్త స్నేహితులను పొందుతారు. సమూహ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య
ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండండి. అనవసర వాదనలకు దిగొద్దు. ప్రియమైన వారితో ఘర్షణ సూచనలున్నాయి జాగ్రత్త. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. అనారోగ్య సూచనలున్నాయి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలకు వేసుకోవచ్చు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. విద్యార్థులకు శుభసమయం.
తుల
మీ ప్రేమ సంబంధాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. ఏదో విషయంలో కలత చెందుతారు. అనవసర ఆలోచనలు తగ్గించుకోండి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు పని విషయంలో కాంప్రమైజ్ కావొద్దు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబం కోసం కొంత సమయం కేటాయించండి.
వృశ్చికం
కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అహంకార సంఘర్షణ వైవాహిక సంబంధాల్లో ఉద్రిక్తతను కలిగిస్తుంది. స్నేహితులతో విభేదాలుండొచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. మీ తీరు, మాటతీరు మార్చుకుంటే చాలా వివాదాలకు పరిష్కారం దొరికినట్టే. ఉద్యోగులకు బావుంటుంది. వ్యాపారులు వ్యాపార విస్తరణ దిశగా ప్రణాళికలు వేసుకోవచ్చు.
ధనుస్సు
ధనస్సు రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. బంధువులు, స్నేహితుల నుంచి కొన్ని అపార్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత సంబంధాల్లో అపనమ్మకం బాధిస్తుంది. విద్యార్థులు చదువుపై మరింత దృష్టిసారించాలి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.
మకరం
మీ మనసులో ప్రేమను తెలియజేసేందుకు ఇదే మంచి సమయం. వివాహితుల మధ్య ప్రేమబంధం బలపడుతుంది. మీ ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు వెతకండి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం బావుంటుంది.
కుంభం
మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.
మీనం
కుటుంబ సభ్యుల నుంచి సహాయ, సహకారాలు అందుతాయి. ఏదైనా శుభ కార్యాన్ని నిర్వహించవచ్చు. ఈ రోజు బంధువులు, స్నేహితులు, కార్యాలయంలో ఎక్కడోచోట శుభవార్త వింటారు. వ్యాపారం బాగా సాగుతుంది. విద్యార్థులు పక్కదారిపట్టకుండా ఉండాలి. పెద్దల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త.