By: ABP Desam | Updated at : 09 Mar 2022 05:32 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 మార్చి 9 బుధవారం రాశిఫలాలు
మార్చి 9 బుధవారం రాశిఫలాలు
మేషం
మేష రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అనారోగ్య సమస్యలతో బాధపడతారు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి. వ్యాపారంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ఇంట్లో పరస్పర సామరస్యం లోపిస్తుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందలేరు.
వృషభం
చదువుకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారం గురించి చర్చించుకునేందుకు శుభసమయం. మీ మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది.యువతీ యువకులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల సమయం. మీ కెరీర్లో పురోగతి పొందుతారు.
మిథునం
ఈరోజు కష్టతరంగా గడుస్తుంది. ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి. ఆకస్మిక ఖర్చుల కారణంగా కలత చెందుతారు. ఆర్థిక లావాదేవీలో పొరపాటు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామి పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. తప్పుగా అర్థం చేసుకోవద్దు.
కర్కాటకం
ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందొచ్చు. వ్యాపారంలో అనుకున్నదానికంటే ఎక్కువ ధనలాభం ఉంటుంది. మీ స్నేహితుడితో మనసులోని మాటలను పంచుకుంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
Also Read: ఏ కన్ను అదిరితే ఏమవుతుంది, పురాణాల్లో ఏముంది-సైన్స్ ఏం చెబుతోంది
సింహం
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు మంచి సమయం. మీతో కలసి పనిచేసే వారు మీతో సంతోషంగా ఉంటారు. మీ దృఢ సంకల్పం వల్ల మీరు విజయం సాధిస్తారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ రోజు నేను పాత స్నేహితుడిని కలుస్తాను. మీరు పెద్ద బాధ్యతను పొందొచ్చు.
కన్య
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. స్నేహితుల సహాయంతో మీ ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో కొంత రిస్క్ తీసుకుంటేనే కలిసొస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పనికిరాని చర్చల్లో తలదూర్చకండి.
తులా
ఈ రోజు మీరు కొంచెం గందరగోళంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. రాజకీయాల్లో ఉన్నవారికి కొంత ఇబ్బంది ఉంటుంది. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఉద్యోగులు పై అధికారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈరోజు సాధారణ రోజు అవుతుంది.
వృశ్చికం
వ్యాపారులకు ఈ రోజు చాలా మంచిది. మీ ప్రతిష్ట పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు పరిష్కరామవుతాయి. రాజకీయ వ్యక్తులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అధికారుల సహకారం లభిస్తుంది.
Also Read:ఆంజనేయుడిని పూజిస్తే శనిప్రభావం ఎందుకు తగ్గుతుంది
ధనుస్సు
ఈ రోజు సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా-బయటా మీ బాధ్యత పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. ఉద్యోగస్తులు పురోగతి సాధిస్తారు. ఏదో ఒక విషయంలో విమర్శలు ఎదుర్కొంటారు.
మకరం
ఈ రోజు మీరు కొత్త పని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. టెక్నికల్ రంగంలో పనిచేసే వారు లాభపడతారు. అధికారుల సహకారంతో మీ పనులు సాగుతాయి. కుటుంబ సభ్యుని పురోగతితో మీరు ఉత్సాహంగా ఉంటారు. ప్రమోషన్ పొందొచ్చు. తెలియని వ్యక్తిని నమ్మవద్దు.
కుంభం
ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో వివాదాస్పద పరిస్థితులకు దూరంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందుల్లో పడకతప్పదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఈరోజు బంధువులను కలుస్తారు.
మీనం
ఈ రోజు చురుకుగా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. మీకు సహాయం చేసేవారికి ధన్యవాదాలు చెప్పడం మరిచిపోవద్దు. శుభవార్త వినే అవకాశం ఉంది. విద్యార్థులకు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు శుభసమయం.
Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!
Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్లకు గుడ్న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట
Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు
Today Panchang 27 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం,దారిద్ర్యం నివారించే సిద్దిలక్ష్మీ స్తోత్రం
Horoscope Today 27th May 2022: ఈ రాశులవారికి అనారోగ్య సూచనలున్నాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!