అన్వేషించండి

Garuda Purana: పెళ్లికి ముందు జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే!

Garuda Purana: సంతోషకరమైన వైవాహిక జీవితం గురించి చాలా విష‌యాలు గరుడ పురాణంలో ప్రస్తావించారు. గరుడ పురాణం ప్రకారం, వివాహానికి ముందు జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవలసిన విష‌యాలు ఏంటి..

Garuda Purana: మీరు పెళ్లి చేసుకోబోతున్నారా లేదా మీరు పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లయితే, పెళ్లికి ముందు మీ భవిష్యత్ జీవిత భాగస్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయాల గురించి ముందుగా తెలుసుకుంటే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సంతోషక‌ర‌మైన‌, విజయవంతమైన వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలు గరుడ పురాణంలో పేర్కొన్నారు.

సాధారణంగా ప్రజలు గరుడ పురాణాన్నిఎవ‌రైనా చనిపోయిన తర్వాత మాత్రమే చదవాల్సిన పుస్తకంగా భావిస్తారు. కానీ  మరణం, మోక్షం, పాపం-పుణ్యం, స్వర్గం-నరకం, పునర్జన్మతో పాటు రోజువారీ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలనూ ఈ గ్రంథంలో వివ‌రించారు. వాటిని అనుసరించడం ద్వారా మీరు చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు. గరుడ పురాణంలో సరైన జీవిత భాగస్వామి గురించి కూడా ప్రస్తావించారు. ఈ పుస్తకం ప్రకారం, పెళ్లికి ముందు, మీరు మీ కాబోయే జీవిత భాగస్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పెళ్లికి ముందు ఈ విషయాలు తెలిస్తే మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది, కుటుంబంలో విబేధాలు, శత్రుత్వాలు ఉండవు.

అల‌వాట్లు
వివాహానికి ముందు, మీరు మీ భవిష్యత్ జీవిత భాగస్వామి అల‌వాట్ల‌ గురించి తెలుసుకోవాలి. వైవాహిక జీవితంతో పాటు కుటుంబ, సామాజిక జీవితానికి ఇది చాలా ముఖ్యం. పెళ్లయ్యాక ఇబ్బందులు ఎదుర‌వ‌కూడ‌ద‌నుకుంటే, పెళ్లికి ముందే మీ జీవిత భాగస్వామి అల‌వాట్ల‌ను తెలుసుకోవడం మంచిది. ఇది మీ వైవాహిక జీవితాన్ని అర్థవంతంగా ఉంచుతుంది.

Also Read : మరణ సమయంలో స్వరం ఎందుకు పోతుందో తెలుసా?

సహనం
సంయమనంతో ఉన్న వ్యక్తి ప్రతి క్లిష్ట పరిస్థితిలో తన కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి, పెళ్లికి ముందు, మీ భాగస్వామికి సహనం లేదా స్వీయ నియంత్రణ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. సహనం, సంయమనం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవడం మంచిది.

కోపం
కోపంగా ఉన్న వ్యక్తి తన ప్రవర్తన ద్వారా అన్ని సంబంధాలను కోల్పోతాడు. అందుకే పెళ్లికి ముందు మీ జీవిత భాగస్వామి స్వభావాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. కోపం భార్యాభర్తల మధ్య సంబంధాలలో చీలికను సృష్టిస్తుంది. మితిమీరిన కోపంతో ఉన్న స్త్రీ లేదా పురుషుడు తన జీవిత భాగస్వామిని కఠినమైన పదాల ద్వారా బాధపెడతారు.

మాట‌తీరు
మీరు చిన్న‌చిన్న‌ పదాలతో మ‌ధురంగా మాట్లాడితే అందరి హృదయాలను గెలుచుకోవచ్చు. జీవిత భాగస్వామికి ఈ గుణం ఉంటే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి మధురంగా ​​లేదా అందంగా ​​మాట్లాడే జీవిత భాగస్వామిని ఎంచుకోండి.

Also Read : ఇలా చేస్తే దురదృష్టం కూడా అదృష్టమే..!

ప‌ర‌స్ప‌ర గౌర‌వం
మహిళలు ప్రతి వ్యక్తినీ గౌరవించాలని గరుడ పురాణం చెబుతోంది. ఏ వ్యక్తితోనూ ముఖ్యంగా భర్తతో ఎప్పుడూ పరుషమైన మాటలు మాట్లాడకండి. పెళ్లయిన ఇంట్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరితో బాగా మాట్లాడాలి. ఎవరూ తప్పుడు మాటలు మాట్లాడకూడదు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget