అన్వేషించండి

Ganesh Chaturthi 2026: గణేష్ చతుర్థి ప్రత్యేకం! 32 గణపతి రూపాలు: మీ జీవితాన్ని మార్చే రహస్యాలు!

32 Forms of Ganesha: ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ సెప్టెంబర్ 14 సోమవారం జరుపుకుంటారు. గణేషుడు ఒకటే రూపంలో కాదు 32 రూపాల్లో పూజలందుకుంటాడు. అవేంటో తెలుసుకోండి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఈ రూపాలు భక్తులకు శక్తీ, కోరికలు తీరుస్తాయి.

గణేష్ చతుర్థి 2026: గణేషుడి 32 రూపాలు జీవితంలో వివిధ అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. వీటిని ఆరాధించడం , భక్తితో పూజించడం ద్వారా జీవితంలో శ్రేయస్సు, జ్ఞానం, శక్తి, విజయం లభిస్తాయని భక్తుల విశ్వాసం. 
 
బాల గణపతి 

బంగారు రంగులో ఉన్న బాల స్వరూపం బాల గణపతి. న చేతుల్లో అరటి, మామిడి, చెరకు , పనసతో దర్శనమిస్తాడు. ఇష్టమైన మోదకం తొండంలో  ఉంటుంది
 
తరుణ గణపతి

అష్టభుజాలతో తరుణ గణపతి రూపం... పాశం , అంకుశం, మోదకం, గంట, విరిగిన దంతం, వరి కాండం , చెరకును ధరించి పూజలందుకుంటాడు. ఈ రూపంలో మెరిసే గణపతి ఎర్రటి రంగు యవ్వనానికి చిహ్నం
 
భక్తి గణపతి

పున్నమి చంద్రుడిలా మెరుస్తూ పూలమాలలతో అలంకరించి భక్తులకు అత్యంత ప్రియమైన రూపంలో దర్శనమిస్తాడు భక్తి గణపతి. ఈ రూపం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. చేతుల్లో అరటి, మామిడి, కొబ్బరికాయతో పాటూ పాయసం గిన్నె ఉంటుంది
 
వీర గణపతి

విధేయతతో కూడిన ముద్రను కలిగి దర్శనమిస్తాడు వీర యోధుడు వీర గణపతి. ఆయన 16 భుజాలు మనసుకి  సంబంధించిన శక్తుల చిహ్నంగా ఆయుధాలతో అలంకరించి కనిపిస్తాడు. ఈ రూపంలో అంకుశం, చక్రం, ధనుస్సు, బాణం, కత్తి, డాలు, బల్లెం, గద,  గొడ్డలి, త్రిశూలం సహా ఎన్నో ఆయుధాలు ధరించి దర్శనమిస్తాడు
 
శక్తి గణపతి

నారింజ-ఎరుపు రంగులో కనిపించే శక్తి గణపతి గృహస్థులను రక్షించే స్వామిగా  దండ, పాశం,  అంకుశం ధరించి అభయ ముద్రతో ఆశీర్వదిస్తాడు.  

ద్విజ గణపతి

నాలుగు ముఖాలతో..వెలుగుతున్న చంద్రుడిలా కనిపిస్తాడు ద్విజ గణపతి. పాశం, అంకుశం, వడగళ్ళతో చేసిన శాస్త్రం, దండం, జలపాత్ర , జపమాల ధరించి క్రమశిక్షణతో ఉండేలా శక్తిని అందించే రూపం ఇది
 
సిద్ధి గణపతి

బంగారు వర్ణంలో ఉన్న ఈ గణపతి... సిద్ధి ,ఆత్మ-నియంత్రణకు చిహ్నంగా భావిస్తారు భక్తులు. పూల గుత్తి, గొడ్డలి, మామిడి, చెరకు , తొండంలో   నువ్వుల మిఠాయిలతో ప్రశాంతంగా కనిపిస్తాడు
 
ఉచ్చిష్ట గణపతి

ఆశీర్వాదం ఇచ్చే రూపం ఉచ్చిష్ట గణపతి. నీలం రంగులో ఆరు భుజాలు కలిగి చేతుల్లో వీణ, దానిమ్మ, నీలి కలువ , జపమాల , వరి కాండంతో దర్శనమిస్తాడు. సంస్కృతికి పోషకుడుగా ఈ రూపాన్ని పూజిస్తారు
 
విఘ్న గణపతి

అడ్డంకులు తొలగించే దేవుడు విఘ్న గణపతి. రత్నాలతో అలంకరించిన రూపంలో..ఎనిమిది భుజాల్లో పాశం , అంకుశం, దంతం , మోదక్, శంఖం ,చక్రం, పూలు, చెరకు, పుష్పబాణం  గొడ్డలితో కనిపిస్తాడు

క్షిప్ర గణపతి

కోర్కెలు నెరవేర్చే రూపం క్షిప్రగణపతి. సుందరమైన, ఎరుపు రంగులో ఉన్న ఈ రూపంలో .. విరిగిన దంతం, పాశం, అంకుశం , కల్పవృక్షం   కాండంతో దర్శనమిస్తాడు. తొండంలో రత్నాలతో నిండిన చిన్న కలశంతో కనిపిస్తాడు గణనాథుడు
 
హేరంబ గణపతి

ఐదు ముఖాలతో శ్వేత వర్ణం కలిగిన ఈ రూపం బలహీనులకు రక్షకుడు. పెద్ద సింహంపై స్వారీ చేస్తూ  పాశం, జపమాల, గొడ్డలి, సుత్తి, దంతం, దండ, పండ్లు, మోదక్ ధరించి రక్షకుడిగా దర్శనమిస్తాడు. 
 
లక్ష్మీ గణపతి

బుద్ధి , సిద్ధిలతో కూడి భక్తులకు దర్శనమిస్తాడు లక్ష్మీ గణపతి . వరద ముద్రలో చిలుక, దానిమ్మ, పాశం, కల్పవృక్షం కాండం ,కత్తి, అంకుశం,  జలపాత్రతో దర్శనమిస్తాడు

మహా గణపతి

ఎరుపు రంగు , మూడు కళ్ళతో కనిపించే ఈ రూపంలో.. దంతం, దానిమ్మ, నీలి కలువ, చెరకు, ధనుస్సు, చక్రం, పాశం, కమలం, వరి కాండం, గద , రత్నాలతో నిండిన కలశాన్ని ధరించి అభయాన్నిస్తాడు

విజయ గణపతి

నాలుగు భుజాలతో ఎరుపు రంగులో  సాధన సంపత్తి కలిగిన మూషికంపై స్వారీ చేస్తూ దర్శనమిచ్చే విజయ గణపతిని విజయాన్ని ఇచ్చేవాడుగా పూజిస్తారు. విరిగిన దంతం, ఏనుగు అంకుశం, పాశం , బంగారు మామిడితో దర్శనమిస్తాడు విజయ గణపతి
 
నృత్య గణపతి

నాలుగు భుజాలతో, బంగారు రంగులో దర్శనమిస్తాడు నృత్య గణపతి. వేళ్ళనిండా ఉంగరాలతో, దంతం, అంకుశం, పాశం , మోదక్ చేతపట్టుకుని పూజలందుకుంటాడు. కల్పవృక్షం కింద నృత్యం చేస్తూ కనిపించే ఈ రూపం ఆనందానికి చిహ్నం
 
ఊర్ధ్వ గణపతి

శక్తిని మొత్తం ఎడమ మోకాలిపై ధరించి బంగారు కాంతిలో వెలిగిపోతాడు ఊర్థ్వ గణపతి. ఆరు చేతుల్లో వరికాండం, కమలం, చెరకు ధనుస్సు, బాణం, దంతం, నీలి కలువతో దర్శనమిచ్చే రూపం ఇది

గణేష్ చతుర్థి 2026: ఇంట్లో, ఆఫీసులో గణపతి ప్రతిష్ఠ నియమాలు వేరు!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

పండుగల విశిష్టతలు, రామాయణం, మహాభారతం, చాణక్యనీతి, గరుడపురాణం, నమ్మకాలకు సంబంధించిన ఆధ్యాత్మిక సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Frequently Asked Questions

తరుణ గణపతి రూపం దేనికి చిహ్నం?

తరుణ గణపతి రూపం యవ్వనానికి చిహ్నం. ఈ ఎర్రటి గణపతి ఎనిమిది భుజాలతో పాశం, అంకుశం, మోదకం, గంట వంటివి ధరించి పూజలందుకుంటాడు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

అక్టోబర్ 29 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీనం - అదృష్టం మీ వెంటే!
అక్టోబర్ 29 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీనం - అదృష్టం మీ వెంటే!
అక్టోబర్ 29 రాశిఫలాలు: సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల వారికి అదృష్టం ఎలా ఉంది?
అక్టోబర్ 29 రాశిఫలాలు: సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల వారికి అదృష్టం ఎలా ఉంది?
అక్టోబర్ 29 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం...మీ రాశికి ఎలాంటి ఫలితాలు?
అక్టోబర్ 29 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం...మీ రాశికి ఎలాంటి ఫలితాలు?
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Railway Mobile Charging Ban: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
Embed widget