By: ABP Desam | Updated at : 22 Sep 2023 08:06 AM (IST)
శుక్రవారం రోజు ఈ పని చేస్తే లక్ష్మీదేవి కృపకు పాత్రులవుతారు, శుక్రుడి అనుగ్రహం కూడా! (Representational Image/pinterest)
Friday Tips: ధనం ప్రధానంగా మారిన ప్రస్తుత కాలంలో డబ్బు నీళ్లలా ప్రవహిస్తోంది. అన్ని విషయాలకు డబ్బే ప్రధాన వాహకంగా పని చేస్తోంది. కానీ, ఇందులో మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. కొంతమంది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వారికి డబ్బు సమస్య, పేదరికం ఎదురుకావు. ఇది మీరు కూడా గమనించి ఉండవచ్చు. దీనికి ప్రధాన కారణం సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం. ఆమె ఆశీస్సులు పొందాలనుకుంటున్నారా..? లేక ఇంట్లో డబ్బు సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని భావిస్తున్నారా..? ఐతే శుక్రవారం రోజు తప్పకుండా ఈ పనులు చేయండి.
లక్ష్మీ పూజ
శుక్రవారాల్లో లక్ష్మీదేవిని శ్రద్ధతో - భక్తితో పూజించండి. ఈ రోజున మీరు తెలుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి, తెల్లటి చౌకీ లేదా వస్త్రంపై లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచి, గులాబీలు, అక్షతలు, నెయ్యి, తేనె, పువ్వులు మొదలైన వాటితో లక్ష్మీ దేవిని పూజించాలి. మీరు ఆమెను ఇంట్లో పూజించవచ్చు లేదా ఆలయానికి కూడా వెళ్లవచ్చు.
Also Read : శుక్రవారం ఇలా చేస్తే సంపదతో పాటు ఆనందానికి లోటుండదు
శుక్రవారం మంత్రం
శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ మంత్రాన్ని పఠించాలి. ఈ రోజు లక్ష్మీ దేవి మంత్రంతో పాటు శుక్ర మంత్రాన్ని కూడా పఠించాలి. శుక్రుడు కూడా మీకు సంపదను అనుగ్రహిస్తాడు. శుక్రవారం తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించండి.
"ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః". ఈ మంత్రం శుక్ర గ్రహం శుభదృష్టితో చూసేలా చేస్తుంది. ఫలితంగా ఇంట్లో సిరి, సంపదలు నెలకొంటాయి.
మొక్కలు నాటండి
శుక్రవారం రోజు మొక్కలు నాటడం సంపద, శ్రేయస్సు కోసం శుభప్రదమని పెద్దలు చెబుతారు. దీని కోసం, ఒక కుండీలో కొత్త మొక్కను నాటండి. మీ ఇల్లు లేదా తోట సమీపంలో ఉంచండి. మొక్క చనిపోకుండా లేదా ఎండిపోకుండా చూసుకోండి. ఈ మొక్క పెరిగేకొద్దీ మీ ఇంటి పురోగతి కూడా పెరుగుతుంది.
దాతృత్వం
శుక్రవారాల్లో డబ్బు దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. మీరు పేదలకు ఆహారం, దుస్తులు లేదా అవసరమైన వస్తువులను దానం చేయవచ్చు. ఇది మీ అదృష్టం, సంపదను పెంచడానికి సహాయపడుతుంది. అయితే, మీరు దానం చేసినట్లు ఎవరికీ చెప్పకండి. మీ విరాళాన్ని రహస్యంగా ఉంచండి.
Also Read : శుక్రవారం ఇలాంటి తప్పులు చేస్తే దరిద్రం వెంటాడుతుంది
సంపద, శ్రేయస్సు కోసం కృష్ణ హారతి
శుక్రవారాల్లో శ్రీకృష్ణుని హారతిని జపించడం వల్ల సంపద, శ్రేయస్సు, అదృష్టం పెరుగుతాయి. ఈ రోజు శ్రీకృష్ణుడిని పూజిస్తే లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. ఈ రోజు శ్రీ కృష్ణ హారతిని పఠించడం వలన మీ జీవితంలో సంపద, సౌఖ్యం సిద్ధిస్తుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Also Read: ఈ రాశివారు టైమ్ వేస్ట్ చేయడంలో ముందుంటారు, సెప్టెంబరు 22 రాశిఫలాలు
Christmas Celebrations 2023: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!
Daily Horoscope Today Dec 05, 2023 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగంలో ఏ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది - డిసెంబరు 05 రాశిఫలాలు
Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!
Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!
Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు
Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
/body>