అన్వేషించండి

నవంబర్ 6 ధనత్రయోదశి 2026: బంగారం, వెండి కొనడానికి శుభ సమయం, లక్ష్మీ-కుబేర పూజ శుభ ముహూర్తాలు!

Dhanteras 2026: మత విశ్వాసాలు ప్రకారం ధంతేరస్ రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు, విలువైన వస్తువులను కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు.. దీని వెనుక ఉన్న ప్రాముఖ్యత, శుభ సమయం గురించి తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ధనత్రయోదశి నవంబర్ 6, 2026న దీపావళికి ముందు వస్తుంది.
  • బంగారం, వెండి, కొత్త వస్తువులు కొనుగోలు శుభప్రదంగా భావిస్తారు.
  • కొనుగోలుకు ఉదయం 11 తర్వాత, పూజకు ప్రదోషకాలం ఉత్తమం.
  • కొనుగోలుకు హాల్‌మార్క్, స్వచ్ఛత తనిఖీ చేసి, రసీదు పొందండి.

ధనత్రయోదశి 2026: దీపావళి పండుగ సమీపిస్తోంది. ధన త్రయోదశి నుంచి ఈ సందడి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ధన త్రయోదశి నవంబర్ 6 శుక్రవారం వచ్చింది. ఐదు రోజుల దీపావళి పండుగ ధన త్రయోదశితోనే మమొదలు. ఈ రోజు బంగారం, వెండి, కొత్త పాత్రలు , విలువైన వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు. అందువల్ల, ఈ రోజున బులియన్ మార్కెట్‌లో భారీ జనసమూహం కనిపిస్తుంది. అయితే బంగారం, వెండి కొనడానికి సరైన శుభ సమయం ఏది? లక్ష్మీ-కుబేర పూజకు సమయం ఏది? ఆ ముఖ్యమైన సమయాలను తెలుసుకుందాం...

దీపావళి లక్ష్మీ పాదాలు: ఇంట్లోకి సంపద రావాలంటే ఏ దిశలో, ఎక్కడ వేయాలి?

ధన త్రయోదశి ఎప్పుడు? 
 
పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి నాడు ధంతేరస్ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం, త్రయోదశి తిథి నవంబర్ 6, 2026న ఉదయం 10:59 గంటలకు ప్రారంభమై, నవంబర్ 7న ఉదయం 10:32 గంటలకు ముగుస్తుంది. ప్రదోషకాలంలో పూజల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ధంతేరస్‌ను నవంబర్ 6న జరుపుకుంటున్నారు.
 
బంగారం  వెండి కొనడానికి శుభ సమయం?

స్థానిక పంచాంగ గణనల ప్రకారం, నవంబర్ 6వ తేదీన బంగారం కొనడానికి ఈ క్రింది శుభప్రదమైన చౌఘడియా సమయాలున్నాయి. ఈ సమయాల్లో బంగారం, వెండి లేదా కొత్త విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. పంచాంగ.. స్థానిక గణనల మధ్య కొన్ని నిమిషాల వ్యత్యాసం ఉండవచ్చు.

ధంతేరస్ 2026: ఈ 8 చోట్ల దీపాలు వెలిగిస్తే సంపద, శ్రేయస్సు ఖాయం!

బంగారం, వెండి కొనడానికి శుభ సమయం  

త్రయోదశి తిథి ప్రారంభం - ఉదయం 10.59

మధ్యాహ్నం 1.47 నుంచి 3.24 వరకు వర్జ్యం ఉంది

ఉదయం 8.21 నుంచి 9.06 వరకు తిరిగి మధ్యాహ్నం 12.09 నుంచి 12.55 వరకు దుర్ముహూర్తం ఉంది

ఉదయం 11 దాటిన తర్వాత వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయంలో బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయొచ్చు

లక్ష్మీ-కుబేర పూజకు శుభ సమయం

మత విశ్వాసాల ప్రకారం, ధంతేరస్ రోజున లక్ష్మీదేవి, కుబేరుడు , ధన్వంతరి దేవుడిని పూజించే సంప్రదాయం ఉంది. ప్రదోషకాలంలో లక్ష్మీపూజ శుభాన్నిస్తుందని నమ్మకం.  

రామ ఏకాదశి, గోవత్స ద్వాదశి 2026 నవంబర్ 5నే: ఎలా సాధ్యం?

ధనత్రయోదశి రోజు బంగారం, వెండి కొనడం వల్ల కలిగే ప్రాముఖ్యత ఏంటి?

పౌరాణిక విశ్వాసాల ప్రకారం సముద్ర మథనం నుంచి లక్ష్మీదేవి , ధన్వంతరి దేవుడు ఉద్భవించారు. ధన్వంతరి దేవుని చేతిలో అమృత కలశం ఉండేది. అందుకే, ఈ రోజున కొత్త పాత్రలు , లోహ వస్తువులను కొనుగోలు చేసే సంప్రదాయం ప్రారంభమైందని నమ్ముతారు. ధనత్రయోదశి నాడు బంగారం, వెండి కొనడం అనేది ఇంట్లోకి లక్ష్మీదేవి రాకకు ..శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఈ రోజు వెండి నాణేలు, లక్ష్మీ-గణేశ విగ్రహాలు, బంగారు ఆభరణాలు .. కొత్త పాత్రలు కొనడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. చాలా కుటుంబాలలో, కొనుగోలు చేసిన వస్తువులను లక్ష్మీ పూజ సమయంలో పూజిస్తారు కూడా.

బంగారం, వెండి కొనుగోలు చేసేటప్పుడు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి?

ధనత్రయోదశి రోజు సందర్భంగా బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఆభరణాలపై ఉన్న BIS హాల్‌మార్క్, స్వచ్ఛత వివరాలు , HUID నంబర్‌ను తప్పకుండా తనిఖీ చేయాలి. 

వెండి వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు కూడా, వాటి స్వచ్ఛతను నిర్ధారించుకోవాలి. 
అధికారిక కొనుగోలు పత్రాన్ని పొందండి , తయారీ ఛార్జీల గురించి తెలుసుకోండి.
మీ నగరం  స్థానిక క్యాలెండర్ ప్రకారం సరైన సమయాన్ని ఎంచుకోండి.

దీపావళి 2026: 5 రోజుల పండుగ.. ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత, విశిష్టత!

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలు, అభిప్రాయాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఏ నమ్మకాలను లేదా సమాచారాన్ని ఆమోదించదని గమనించడం ముఖ్యం . ఏదైనా సమాచారం లేదా అభిప్రాయంపై చర్య తీసుకునే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Frequently Asked Questions

ధన త్రయోదశి ఎప్పుడు?

ఈ ఏడాది నవంబర్ 6, 2026న ధన త్రయోదశి వస్తుంది. త్రయోదశి తిథి నవంబర్ 6న ఉదయం 10:59 గంటలకు ప్రారంభమై, ప్రదోషకాల ప్రాముఖ్యత వల్ల అదే రోజు పండుగ జరుపుకుంటారు.

ధన త్రయోదశి నాడు ఏ వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదం?

ధన త్రయోదశి రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు మరియు విలువైన వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి లక్ష్మీదేవి రాకకు, శ్రేయస్సుకు చిహ్నంగా నమ్ముతారు.

బంగారం, వెండి కొనడానికి శుభ సమయం ఏది?

నవంబర్ 6న ఉదయం 11 గంటల తర్వాత వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయంలో బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయవచ్చు. స్థానిక పంచాంగ గణనలను బట్టి సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

బంగారం, వెండి కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

బంగారం కొనేటప్పుడు BIS హాల్‌మార్క్, స్వచ్ఛత, HUID నంబర్ తనిఖీ చేయాలి. వెండి వస్తువుల స్వచ్ఛతను నిర్ధారించుకొని, అధికారిక కొనుగోలు పత్రాన్ని, తయారీ ఛార్జీల వివరాలను పొందాలి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2027లో నాసిక్ కుంభమేళాకు వెళ్లాలి అనుకుంటే ఈ వివరాలు, సింహస్థ రాజస్నాన తేదీలు తెలుసుకోండి!
2027లో నాసిక్ కుంభమేళాకు వెళ్లాలి అనుకుంటే ఈ వివరాలు, సింహస్థ రాజస్నాన తేదీలు తెలుసుకోండి!
కార్తీకపౌర్ణమి 2026: దేవ దీపావళి రోజు కాశీలో అద్భుత దృశ్యం! కొత్త నిబంధనల గురించి తెలుసుకోండి! 
కార్తీకపౌర్ణమి 2026: దేవ దీపావళి రోజు కాశీలో అద్భుత దృశ్యం! కొత్త నిబంధనల గురించి తెలుసుకోండి! 
ఎన్విడియా కుంభకోణం: అమెరికా-చైనా జాతక రహస్యం, భారత్‌కు ముప్పు?
ఎన్విడియా కుంభకోణం: అమెరికా-చైనా జాతక రహస్యం, భారత్‌కు ముప్పు?
15-11-2026 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం వారికి గ్రహాల శుభ ప్రభావంతో అదృష్టం!
15-11-2026 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం వారికి గ్రహాల శుభ ప్రభావంతో అదృష్టం!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget