అన్వేషించండి

నవంబర్ 6 శుక్రవారం ధనత్రయోదశి సాయంత్రం యమదీపం ఎలా వెలిగించాలి? 

Yama Deepam 2026: ధనత్రయోదశితో దీపావళి వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ రోజు సాయంత్రం యమధర్మరాజుని స్మరిస్తూ దక్షిణ దిశగా దీపం వెలిగిస్తారు. ఆ దీపం ప్రాముఖ్యత ఏంటంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రదోష కాలంలో ఇంటి దక్షిణ దిశగా దీపం వెలిగించాలి.

Dhanatrayodashi : ధనత్రయోదశి రోజు వినాయకుడు, లక్ష్మీదేవి, ధన్వంతరిని పూజిస్తారు. అయితే ఈ రోజు యమధర్మరాజును స్మరిస్తూ కుటుంబం మొత్తానికి ఆయుష్షు ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ దక్షిణ దిశగా దీపంవెలిగించే సంప్రదాయం ఉంది. ఈ దీపాన్ని యమదీపం అంటారు.  

యమ దీపం ఎందుకు వెలిగిస్తారు?

యముడు అంటే మృత్యువు అధిపతి మాత్రమే కాదు ధర్మాన్ని పరిరక్షించే ధర్మరాజు. సూర్య భగవానుడికి కుమామరుడైన యమధర్మరాజును దక్షిణ దిశకు అధిపతిగా పూజిస్తారు. ధన త్రయోదశి రోజు ప్రదోష సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వెలుపల దక్షిణాభిముఖంగా దీపం వెలిగించి యమధర్మరాజును ప్రార్థిస్తారు.

కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అకాల మృత్యు భయం తొలగిపోవాలని,  అనారోగ్యం నుంచి ఉపశమనం, ఆపదల నుంచి రక్షణ కలగాలని, కుటుంబంలో శాంతి, సౌభాగ్యం ఉండాలని యమధర్మరాజును ప్రార్థిస్తాను. 

దీపావళి 2026: లక్ష్మీ పూజకు తక్కువ సమయమే! మీ నగర శుభ ముహూర్తం ఇదే

యమదీపం వెనుకున్న పురాణ కథ
 
హేముడు అనే రాజుకు ఓ కుమారుడు జన్మిస్తాడు. ఆ బాలుడి జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్కులు వివాహమైన నాలుగవ రోజున మృత్యుగండం ఉందని చెబుతారు. ఆ యువరాజు భార్య తన భర్తను మృత్యువు నుంచి కాపాడుకోవాలని సంకల్పిస్తుంది. యముడు వచ్చే మార్గంలో బంగారు ఆభరణాలు, దీపాలు, ప్రకాశవంతమైన వస్తువులను ఉంచి ఆ ప్రదేశమంతా వెలుగులతో నింపుతుంది. ఈ దీపాల ప్రకాశం వల్ల యమధర్మరాజు దృష్టి మరలిపోయిందని.. ఇంటి లోపలకు ప్రవేశించలేకపోయాడని పురాణకథ. అప్పటి నుంచి ధన త్రయోదశి రోజు యముడికి దీపదానం చేసే సంప్రదాయం ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు.

దీపావళి 2026: 5 రోజుల పండుగ.. ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత, విశిష్టత!

యమ దీపం ఎలా వెలిగించాలి?

ముందుగా ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసి ముగ్గు వేయాలి. స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించి దీపం వెలిగించాలి. కొందరు నాలుగు ముఖాలున్న దీపాన్ని కూడా వెలిగిస్తారు. యమ ధర్మరాజును స్మరించుకుంటూ దీపానికి పూలు, అక్షతలు సమమర్పిస్తారు. మట్టి ప్రమిదలో నువ్వులనూనె కానీ ఆవనూనె కానీ పోసి పత్తితో చేసిన వత్తిని వేసి వెలిగించాలి. దీపం దక్షిణ దిశగా ఉండాలి. ఆ దీపానికి పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు సమర్పించాలి. మీ నగరంలో సూర్యాస్తమయ సమయాన్ని అనుసరించి ప్రదోష సమమయంలో యమదీపం వెలిగించాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల లోపు యమదీపం వెలిగించండి.  

యమ దీపం వెలిగించిన తర్వాత చదవాల్సిన మంత్రం
 
మృత్యునా పాశదండాభ్యాం కాలేన శ్యామయా సహ।
త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజః ప్రీయతాం మమ॥

మృత్యుపాశం, దండాన్ని ధరించిన యమధర్మరాజు, ఆయనతో సంబంధం కలిగిన కాలశక్తిని స్మరిస్తూ త్రయోదశి రోజున ఈ దీపాన్ని సమర్పిస్తున్నాను. సూర్యభగవానుడి కుమారుడైన యమధర్మరాజు ప్రసన్నుడై మా కుటుంబానికి క్షేమాన్ని ప్రసాదించుగాక అని అర్థం.
 
యమధర్మరాజు మూల మంత్రం:

 ఓం యమాయ నమః

ధంతేరస్ 2026: ఈ 8 చోట్ల దీపాలు వెలిగిస్తే సంపద, శ్రేయస్సు ఖాయం!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Frequently Asked Questions

యమ దీపాన్ని ఎలా వెలిగించాలి?

ప్రధాన ద్వారం శుభ్రం చేసి ముగ్గు వేయాలి. మట్టి ప్రమిదలో నువ్వులనూనె లేదా ఆవనూనెతో పత్తి వత్తిని పెట్టి, స్నానం చేసి దక్షిణాభిముఖంగా దీపాన్ని వెలిగించాలి. పూలు, అక్షతలు సమర్పించాలి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

పాత ఆభరణాలు మార్చి కొత్త బంగారం కొనడం శుభమా కాదా? బంగారం మార్పిడి నియమాలు తెలుసుకోండి!
పాత ఆభరణాలు మార్చి కొత్త బంగారం కొనడం శుభమా కాదా? బంగారం మార్పిడి నియమాలు తెలుసుకోండి!
Ramayana: రావణుడి 10 తలలు నిజమా? పురాణాలు చెప్పే అసలు రహస్యం!
రామాయణ: రావణుడి 10 తలలు నిజమా? పురాణాలు చెప్పే అసలు రహస్యం!
నవంబర్ 6 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులవారు ఆర్థికంగా జాగ్రత్త, ఆరోగ్యంగా అప్రమత్తం!
నవంబర్ 6 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులవారు ఆర్థికంగా జాగ్రత్త, ఆరోగ్యంగా అప్రమత్తం!
నవంబర్ 6 రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
నవంబర్ 6 రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
Tips To Soft Hair : జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తోందా? మృదువుగా, మెరిసేలా చేసే ఇంటి చిట్కాలు ఇవే
జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తోందా? మృదువుగా, మెరిసేలా చేసే ఇంటి చిట్కాలు ఇవే
AP MPTC ZPTC Elections: ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
Ramayana Mistakes: మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
Dark Underarms : అండర్ ఆర్మ్స్ నల్లగా మారాయా? చంకల్లో నలుపుదనాన్ని తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
అండర్ ఆర్మ్స్ నల్లగా మారాయా? చంకల్లో నలుపుదనాన్ని తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
IND VS SL Vizag ODI :  ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
Raptadu Student Gopika Health Update: మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
Embed widget