అన్వేషించండి

ఆధ్యాత్మిక పునరుజ్జీవనం: 5 వేల దేవాలయాలు, వెయ్యి ఆలయాల పునరుద్ధరణకు చంద్రబాబు ఆదేశం

Amaravati : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5 వేల దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ, దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం...

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐదువేల ఆలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
  • వెయ్యి పాత ఆలయాల పునరుద్ధరణకు, వివరాల డిజిటలైజేషన్ కు ఆదేశించారు.
  • టీటీడీ విద్యావైద్య సేవలు మెరుగుపరిచి, తిరుపతిని దివ్యక్షేత్రంగా చేయాలి.

TTD 5000 Temples Construction: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5 వేల దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ, దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం...

రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల దేవాలయాల నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆలయాల నిర్మాణం కోసం ప్రతిపాదిత స్థలాలు త్వరలోనే ఖరాలు చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. ఆధ్యాత్మికతను మరింత ప్రోత్సహించేలా TTD కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు. APలో ఆలయాల నిర్మాణం, TTD ఆధ్వర్యంలో ధార్మిక, విద్య, వైద్య సేవలపై క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
 
ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లాల్లో 161 నియోజకవర్గాల నుంచి 4,192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర సీఎంకు వివరించారు.  967 ఆలయాల నిర్మాణం పూర్తయిందని 3 కేటగిరీలుగా నిర్మించేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, మత్స్యకార ప్రాంతాలు, బలహీన వర్గాల కాలనీలతో పాటు సాధారణ ప్రాంతాల్లోనూ ఆలయాలు నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.
 
శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే నిధులను కూడా ఆలయాల నిర్మాణానికి వినియోగించాలని, శ్రీవారి సేవకుల సేవలు వినియోగించుకోవాలని, భక్తుల భాగస్వామ్యాన్ని కూడా పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. TTD సభ్యులు, భక్తులు, శ్రీవారి సేవకులతో ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలన్నారు. మారిషన్ వంటి దేశాలు స్వామివారి ఆలయాలు నిర్మించాలని కోరుకుంటున్నాయి..భవిష్యత్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.

కొత్త నిర్మించే ఆలయాల్లో విగ్రహాల ఏర్పాటు, అర్చకుల శిక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 1000 పాత ఆలయాలను పునరుద్ధరించాలని, శివాలయాలు, శక్తి పీఠాల అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలన్నారు. అన్ని ఆలయాలకు సంబంధించిన వివరాలను డిజిటలైజ్ చేయాలన్నారు.
 
దేవాదాయశాఖ పరిధిలో ఉన్న 28 వేల ఆలయాలు, TTD నిర్వహిస్తున్న 65 ఆలయాలతో పాటు కొత్తగా నిర్మించే 5 వేల ఆలయాల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక అవసరం అన్నారు. 

TTD నిర్వబిస్తున్న అన్నదానం, శ్రీవారి సేవకుల సేవలు, ఆలయాల నిర్మాణం వంటి కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచారంతో అనుసంధానిస్తూ మరింత విస్తృతం చేయాలన్నారు
 
TTDలో ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదానం కార్యక్రమం గొప్ప సేవా కార్యక్రమంగా మారిందని చెప్పారు. ప్రాణదానం ట్రస్టు ను టీటీడీ వైద్య సేవలకు బెస్ట్ మోడల్ గా తయారు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. 

నిపుణులైన వైద్యుల సేవల్ని కూడా వినియోగించుకోవాలన్నారు. TTD పరిధిలో ఉన్న అన్ని ఆస్పత్రుల సేవల్ని అనుసంధానించాలని.. కేన్సర్ , కంటి వైద్యం సహా తిరుపతిలోని ఆయుర్వేద వైద్య సేవల్ని కూడా విస్తృతం చేయాలన్నారు. వైద్యులను శ్రీవారి సేవకులుగా మార్చి వైద్య సేవలతో పాటు బోధన కార్యక్రమాల్లోని సేవల్ని వినియోగించు కోవాలన్నారు.  

TTD పరిధిలోని 33 విద్యా సంస్థల వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు సూచించారు. విద్య, వైద్యం, సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతిలోని శ్రీవారి ఆలయ నిర్మాణం  త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు చంద్రబాబు.

తిరుమలతో పాటు  తిరుపతిని కూడా సంపూర్ణ దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఆధ్యాత్మికత, పవిత్రత ప్రతిబింబించేలా ప్రత్యేక ఎకోసిస్టమ్‌ రూపొందించాలని ,నిపుణులైన భక్తుల భాగస్వామ్యంతో TTD సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరేలా చూడాలన్నారు. వర్చువల్ గా జరిగిన ఈ సమీక్షకు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, TTD ఈఓ ముద్దాడ రవిచంద్ర, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు

Frequently Asked Questions

రాష్ట్రంలో ఎన్ని దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా 5 వేల దేవాలయాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 967 ఆలయాల నిర్మాణం పూర్తయింది.

టీటీడీ విద్య, వైద్య రంగాలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు?

టీటీడీ విద్యాసంస్థలను మెరుగుపరచాలని, హాస్టళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని సూచించారు. ప్రాణదానం ట్రస్టును ఉత్తమ మోడల్‌గా తీర్చిదిద్ది, నిపుణులైన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.

పాత దేవాలయాల పునరుద్ధరణ, సమాచార డిజిటలైజేషన్ పై సీఎం ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు?

రాష్ట్రంలోని వెయ్యి పాత దేవాలయాలను పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. అలాగే, దేవాదాయశాఖ, టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల సమగ్ర వివరాలను డిజిటలైజ్ చేయాలని సూచించారు.

తిరుపతిని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు?

తిరుమలతో పాటు దిగువన ఉన్న తిరుపతిని సంపూర్ణ దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. శ్రీవారి సంప్రదాయాలకు అనుగుణంగా కల్యాణాలు నిర్వహించుకునే వేదికగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hindu Religion: దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత దానిని రోజంతా ఉంచరాదా? ఎప్పుడు తీసివేయాలి? ఎప్పుడు తినాలి?
దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత దానిని రోజంతా ఉంచరాదా? ఎప్పుడు తీసివేయాలి? ఎప్పుడు తినాలి?
గణేష్ చతుర్థి 2026: మీ ఇల్లు చిన్నగా ఉంటే గణపతి విగ్రహం ఎంత ఉండాలి? పరిమాణం ముఖ్యమా
గణేష్ చతుర్థి 2026: మీ ఇల్లు చిన్నగా ఉంటే గణపతి విగ్రహం ఎంత ఉండాలి? పరిమాణం ముఖ్యమా
Ganesh Chaturthi 2026: వినాయక చవితి రోజు మీ పిల్లలతో ఈ 6 పనులు చేయించండి , బాగా చదువుతారు!
వినాయక చవితి రోజు మీ పిల్లలతో ఈ 6 పనులు చేయించండి , బాగా చదువుతారు!
10-09-2026 గురువారం ధనుస్సు, మకర రాశి ఫలాలు: మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
10-09-2026 గురువారం ధనుస్సు, మకర రాశి ఫలాలు: మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
Advertisement

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Future City Land Allegations: అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
BRS vs Congress 2026 : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
Chinna Srinu Joined TDP: ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
Maremma Review - 'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
YSRCP Local Body Elections : ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?
ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
CM Chandrababu: వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
US Divorce Decree: అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
Embed widget