అన్వేషించండి

చాణక్య నీతి: మిమ్మల్ని మీరు పదే పదే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు! 7 సూత్రాలు పాటించండి చాలు

Chanakya Niti Telugu: ఉద్యోగం, వ్యాపారం..మీరు ఏ పని చేస్తున్నా... మిమ్మల్ని మీరు పదే పదే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు! చాణక్యుని ఈ 7 విషయాలను అనుకరించండి, మీ గౌరవం దానంతట అదే పెరుగుతుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇతరుల కృషిని గుర్తించి, ప్రశంసించడం ద్వారా నాయకుడవ్వండి.

మిమ్మల్ని మీరు పదే పదే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..

ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ మాటలో చాలా లోతైన అర్థం, ఆంతర్యం ఉంది. నిజమైన విలువ, గౌరవం, ప్రతిష్ఠ అనేవి మాటలతో కాదు, ప్రవర్తనతో నిరూపించుకోవాలి. మీరు ఎప్పుడూ ఇతరులకు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.  విజయవంతమైన జీవితానికి, అలాగే పని ప్రదేశంలో గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ముఖ్యమైన పాఠాలను బోధిస్తుంది. ఇందుకోసం కింది 7 సూత్రాలు పాటిస్తే మీ విలువ మీకు తెలిసిపోతుంది, ఇతరులు కూడా గుర్తిస్తారు.

ప్రస్తుత పోటీ యుగంలో, ప్రతి ఒక్కరూ పని ప్రదేశంలో గౌరవం, గుర్తింపు పొందాలని కోరుకుంటారు. అయితే, దాని కోసం మిమ్మల్ని మీరు పదేపదే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆచార్య చాణక్యుని నీతిబోధలు, పని ప్రదేశంలో గౌరవం, మర్యాద సాధించడంతో పాటు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ముఖ్యమైన పాఠాలను బోధించాయి.

చాణక్య నీతి: వివేకం ఉన్నవాళ్లు ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉంటారు!

మౌనం శక్తిని గుర్తించండి

ప్రతిదానికీ ప్రతిస్పందించడం కంటే సరైన సమయంలో మాట్లాడటం ముఖ్యం. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం వ్యక్తిత్వ ప్రభావాన్ని పెంచుతుంది.
 
మీ జ్ఞానాన్ని ప్రదర్శించడం మానుకోండి

మీ నైపుణ్యాలను నిరంతరం ప్రదర్శించే ఆలోచన నుంచి బయటపడండి. సరైన సమయంలో మీ పని ద్వారా మీ సామర్థ్యాలను నిరూపించుకోండి. ఎవరి ముందో మీ జ్ఞానాన్ని ప్రదర్శించకుండా ఫలితాన్ని సాధించి చూపించండి
 
వినయం పాటించండి

గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి అంటారు కదా పెద్దలు..చాణక్య నీతిలోనూ ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇతరులను గౌరవించే వ్యక్తి సమాజంలోనూ, పని చేసే చోట కూడా గౌరవాన్ని పొందుతాడు.
 
నిజాయితీగా ఉండండి
 
సమయపాలన, బాధ్యత   నిజాయితీ మీ సహోద్యోగుల నమ్మకాన్ని పొందడానికి మీకు సహాయపడతాయి. మీరు క్రమశిక్షణతో వ్యవహరించి పనిని సరైన సమయంలో పూర్తిచేసినప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు మీకు గౌరవం దానంతట అదే వస్తుంది
 
ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి

ఆఫీసు వాతావరణాన్ని అర్థం చేసుకోండి కానీ అనవసరమైన వాదనలకు, వర్గపోరాటాలకు దూరంగా ఉండండి. ప్రతి కార్యాలయంలోనూ వర్గాలుంటాయి, గ్రూపు రాజకీయాలంటాయి. కానీ మీ పనిపై మీరు శ్రద్ధపెట్టండి.. ఆ రాజకీయాలకు, వర్గపోరాటాలకు దూరంగా వ్యవహరించండి. అందరితో సమానంగా వ్యవహరించండి..గౌరవాన్ని మీరు అడగాల్సిన అవసరం లేదు అదే వస్తుంది.

చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
 
వినడాన్ని అలవాటు చేసుకోండి

మాట్లాడడమే కాదు వినడం అలవాటు చేసుకోవాలి. ఇతరుల ఆలోచనలను శ్రద్ధగా వినడం సంబంధాలను మెరుగుపరుస్తుంది , మీ వ్యక్తిత్వాన్ని మరింత ప్రభావవంతంగా చేస్తుంది.
 
ఇతరులకు గుర్తింపు ఇవ్వండి

మీ సహోద్యోగుల పనిని అభినందించండి. ఇతరుల కృషిని గౌరవించే వ్యక్తి గొప్ప నాయకుడు అవుతారని నీతిశాస్త్రంలో పేర్కొన్నారు ఆచార్య చాణక్యుడు

వివాహం, బంధాలు, రాజనీతి, విద్య సంపద ప్రాముఖ్యత, స్నేహాలు సహా జీవితంలో ఉన్నతి కోసం వివిధ అంశాలపై చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్న విషయాలు గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి...

కార్తీక మాసంలో అనుసరించాల్సిన నియమాలు, క్షీరాబ్ధి ద్వాదశి,  కార్తీక పౌర్ణమి,  జ్వాలా తోరణం, పోలి స్వర్గం , వనభోజనాల విశిష్టత, దీపదానం ప్రాముఖ్యత సహా ఇతర కథనాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Frequently Asked Questions

ఇతరులకు గుర్తింపు ఇవ్వడం ఎందుకు ముఖ్యం?

సహోద్యోగుల పనిని అభినందించడం సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఇతరుల కృషిని గౌరవించే వ్యక్తి గొప్ప నాయకుడు అవుతాడని ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో పేర్కొన్నారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

దేవ ఉత్థాన ఏకాదశి 2026: తులసి వివాహం రోజు ఈ పరిహారంతో అదృష్టం, ధనం మీ సొంతం!
దేవ ఉత్థాన ఏకాదశి 2026: తులసి వివాహం రోజు ఈ పరిహారంతో అదృష్టం, ధనం మీ సొంతం!
ఇంటి బయట కీర్తిముఖం: దెయ్యం కాదు, రక్షకుడు! శివ పురాణం కథ
ఇంటి బయట కీర్తిముఖం: దెయ్యం కాదు, రక్షకుడు! శివ పురాణం కథ
శబరిమల 2026: అయ్యప్ప భక్తులకు 5 కీలక మార్పులు! ₹2 లక్షల బీమా, దర్శన నిబంధనలు తెలుసుకోండి.
శబరిమల 2026: అయ్యప్ప భక్తులకు 5 కీలక మార్పులు! ₹2 లక్షల బీమా, దర్శన నిబంధనలు తెలుసుకోండి.
బద్రీనాథ్ నెయ్యి దుప్పటి, అఖండ జ్యోతి రహస్యం! 2027 యాత్ర తేదీలు ఇవే!
బద్రీనాథ్ నెయ్యి దుప్పటి, అఖండ జ్యోతి రహస్యం! 2027 యాత్ర తేదీలు ఇవే!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
Embed widget