అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  ECI | ABP NEWS)

Bathukamma Wishes 2023: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక 'బతుకమ్మ' పండుగ. ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ పండుగ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.

Bathukamma Wishes 2023:  ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో  ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అంటు వ్యాధులు, కరువు కాటకాల బారినుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే ఇది. ప్రకృతిలో లభించే ప్రతీ పూలను ఏరికోరి బతుకమ్మలను తయారు చేయడం, వాటిని ఇంటి ముందు, వీధుల్లో, ఆలయాల ముందు ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ ఆడిపాడడం ఎంతో ఆనందాన్నిస్తుంది. గుమ్మడి పూలలోని పసుపు వర్ణంలో ఉన్న దిద్దుని గౌరీ దేవిగా భావించి అందులో పసుపు గౌరమ్మను నిల్పి  ముస్తాబు చేస్తారు. మహిళలు, పిల్లలు అనే వయోబేధం లేకుండా ఆడిపాడుతారు.తెలంగాణ పల్లె పల్లెల్లో జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు. అక్టోబరు 14 నుంచి ప్రారంభమైన బతుకమ్మ సంబతారు అక్టోబరు 22 ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగుస్తాయు... ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పేందుకు కొటేషన్స్..

తెలంగాణ ఆడపడుచులకు 
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే బతుకమ్మ పండుగ వేళ 
మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ 
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

తెలంగాణ ఆచార సంప్రదాయలకు ప్రతీక
మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చూపే పూల వేడుక
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

తీరొక్క పూలతో తీర్చిదిద్ది 
ఆటపాటలు, కోలాటాలు
అవధుల్లేని ఆనందంతో జరుపుకునే
సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

ఆడపడుచుల ఆకుపచ్చని సంబంరం
పల్లెకు కొత్తఅందాన్ని తీసుకొచ్చే పూల వైభవం
బతుకమ్మ పండుగ శుభాకాలంక్షలు

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
ఉమ్మెత్త పువ్వొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయప్పునే
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

రామ రామ నంది ఉయ్యాలో రాగమేత్తరాదు ఉయ్యాలో..
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో నేలవన్నేకాడ ఉయ్యాలో..
పాపిటలో చంద్రుడా ఉయ్యాలో బలాకుమరుడా ఉయ్యాలో..
తెలంగాణ ఆటపాటల పండుగ బతుకమ్మ శుభాకాంక్షలు

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

తంగేడు పూల సందమామ..
మల్లెన్నడు వస్తావు.. సందమామ..
గునుగు పూల సందమామ..
బతుకమ్మ పోతుంది.. సందమామ..
మీకు మీ కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

ఉసికెలో పుట్టే గౌరమ్మ..ఉసికెలో పెరిగే గౌరమ్మ..
కుంకుమలో పుట్టే గౌరమ్మ..కుంకుమలో పెరిగే గౌరమ్మ..
పసుపులో పుట్టే గౌరమ్మ..పసుపులో పెరిగే గౌరమ్మ..
మీ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

బతుకమ్మ పండుగ చివరి రోజు ఆఖరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. బతుకమ్మలను సాధారణ రోజుల కంటే పెద్ద పరిమాణంలో తయారు చేసి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగను దుర్గా అష్టమి రోజు జరుపుకుంటారు

వర్షాకాలం ముగిసి చలికాలం ఆరంభంలో వచ్చే పండుగ బతుకమ్మ. ఈ సమయంలో చెరువులన్నీ నిండుకుండల్లా ఉంటాయి. ప్రకృతి మొత్తం పచ్చదనంతో కళకళలాడుతుంటుంది. గడ్డి మొక్క కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అందుకే ఆ పూలు, ఈ పూలు అనే వ్యత్యాసం లేకుండా, ప్రకృతి ప్రసాదించిన పూలన్నీ...గడ్డి నుంచి గులాబీ వరకూ అన్నీ సేకరించి బతుకమ్మని పేరుస్తారు. ప్రకృతిని ధన్యవాదాలు తెలుపుతూ జరుపుకునే ఈ పండుగ చివరి రోజు బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. ఆ మొక్కల్లో, పూలలో ఉండే ఔషధ గుణాలన్నీ నీటిలో కలసి ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలంటే వినాయక పూజకి పత్రి వినియోగించడం, బతుకమ్మ వేడుకలకు పూలను ఉపయోగించడం వెనుకా ముఖ్య ఉద్దేశం ఇదే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
Bhatti Vikrmarka: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
Trivikram: హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్
హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్
Andhra News: పవన్ కళ్యాణ్‌కు కీలక సూచన చేసిన షాయాజీ షిండే, చంద్రబాబుతో చర్చించి నిర్ణయం
పవన్ కళ్యాణ్‌కు కీలక సూచన చేసిన షాయాజీ షిండే, చంద్రబాబుతో చర్చించి నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vinesh Phogat Julana Election Result | ఎమ్మెల్యేగా నెగ్గిన మల్లయోధురాలు వినేశ్ ఫోగాట్ | ABP DesamTop Reasons For BJP Failure In J&K | జమ్ముకశ్మీర్‌లో బీజేపీ ఎందుకు ఫెయిల్ అయింది | ABP DesamAAP Huge Loss in Haryana Elections | కేజ్రీవాల్ కు హర్యానాలో ఊహించని దెబ్బ | ABP DesamISRO News: 8 ఏళ్ల క్రితం నింగిలోకి ఇస్రో రాకెట్ - ఇప్పుడు భూమ్మీద పడ్డ శకలాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
Bhatti Vikrmarka: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
Trivikram: హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్
హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్
Andhra News: పవన్ కళ్యాణ్‌కు కీలక సూచన చేసిన షాయాజీ షిండే, చంద్రబాబుతో చర్చించి నిర్ణయం
పవన్ కళ్యాణ్‌కు కీలక సూచన చేసిన షాయాజీ షిండే, చంద్రబాబుతో చర్చించి నిర్ణయం
ABP Desam Effect: ఏబీపీ దేశం కథనం చూసి చలించిపోయిన సివిల్ జడ్జి, పసిపాప ఫ్యామిలీకి తక్షణం అందిన సాయం
ఏబీపీ దేశం కథనం చూసి చలించిపోయిన సివిల్ జడ్జి, పసిపాప ఫ్యామిలీకి తక్షణం అందిన సాయం
Anchor Syamala: 'కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరవు' - టీడీపీ కార్యకర్తలు తనను వేధిస్తున్నారన్న యాంకర్ శ్యామల
'కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరవు' - టీడీపీ కార్యకర్తలు తనను వేధిస్తున్నారన్న యాంకర్ శ్యామల
Diwali 2024 Date : ఈ ఏడాది దీపావళి ఎప్పుడో తెలుసా? తేది, చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే
ఈ ఏడాది దీపావళి ఎప్పుడో తెలుసా? తేది, చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే
National Awards Ceremony 2024: రాష్ట్రపతి భవన్‌లో నేషనల్ అవార్డ్స్ వేడుక - అవార్డులు తీసుకుంటున్న స్టార్స్‌ను చూడండి
రాష్ట్రపతి భవన్‌లో నేషనల్ అవార్డ్స్ వేడుక - అవార్డులు తీసుకుంటున్న స్టార్స్‌ను చూడండి
Embed widget