తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ అక్టోబర్ 10న భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. ఇది తొమ్మిది రోజుల పాటు ఆశ్వయుజ అష్టమి వరకు జరుగుతుంది.
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Bathukamma Dates 2026: భాద్రపద అమావాస్య ( అక్టోబరు 10) మొదలు దుర్గాష్టమి ( అక్టోబరు 18) వరకూ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు బతుకమ్మ? ఏ నైవేద్యం సమర్పిస్తారు? తెలుసుకోండి

- బతుకమ్మ పూల పండుగ అక్టోబర్ 10న మొదలై తొమ్మిది రోజులు.
- రోజువారీ ఎంగిలిపూల, అటుకుల, ముద్దపప్పు, అట్ల బతుకమ్మలు ప్రత్యేకత.
- ఆరో రోజు అలిగిన బతుకమ్మకు నైవేద్యం ఉండదు.
- చివరి రోజు సద్దుల బతుకమ్మకు తొమ్మిది రకాల నైవేద్యాలు.
Bathukamma 2026: తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక, మహిళలకు ప్రీతిపాత్రమైన బతుకమ్మ పండుగ సందడి అక్టోబర్ 10 శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. హైదరాబాద్ తో పాటూ తెలంగాణ వ్యాప్తంగా ఊరూ వాడా పూలపండుగ సంబురంగా జరగబోతోంది. భాద్రపదమాసం అమావాస్య తో మొదలయ్యే బతుకమ్మ పండుగ ఆశ్వయుజమాసం అష్టమితో ముగుస్తుంది. తొమ్మిది రోజుల పాటూ వైభవంగా సాగే పూల పండుగలో ఏ రోజు ఏ బతుకమ్మను పూజిస్తారు, ఏ నైవేద్యం సమర్పిస్తారు తెలుసుకోండి
అక్టోబర్ 10 శనివారం భాద్రపద అమావాస్య / మహాలయ అమావాస్య - ఎంగిలిపూల బతుకమ్మ
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మకు నువ్వులను పొడి చేసి పంచదార వేసి కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
అక్టోబర్ 11 ఆదివారం ఆశ్వయుజ శుక్ల పాడ్యమి - అటుకుల బతుకమ్మ
రెండో రోజు అటుకుల బతుకమ్మ - పేరుకితగ్గట్టుగానే అటుకులతో నైవేద్యం తయారు చేస్తారు. అటుకులను నానబెట్టి కొద్దిసేపటి తర్వాత నీరు ఓడ్చి ఓ గంట ఎండనివ్వాలి. ఆ తర్వాత ఆ పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుని దాన్ని పక్కకు తీసి బెల్లం తురుము వేయాలి. అది పాకంగా మారిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి అందులో అటుకులు వేసి కలపాలి. అటుకులు నైవేద్యం సిద్ధం అయినట్టే
అక్టోబర్ 12 సోమవారం ఆశ్వయుజ శుక్ల విదియ - ముద్దపప్పు బతుకమ్మ
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ - ముద్దపప్పుని నైవేద్యంగా పెడతారుయ. కందిపప్పు ప్రెజర్ కుక్కర్లో వేసి... నీళ్లు పోసి, దంచిన జీలకర్ర, కరివేపాకు, నూనె, పసుపు, వేసి ఉడికిస్తారు. సరిపడా ఉప్పు వేసి నైవేద్యం పెడతారు
అక్టోబర్ 13 మంగళవారం ఆశ్వయుజ శుక్ల తదియ - నానే బియ్యం బతుకమ్మ
నాలుగో రోజు నానేబియ్యం బతుకమ్మ - ఈ రోజు బెల్లం పరమాన్నం నివేదిస్తారు.
అక్టోబర్ 14 బుధవారం ఆశ్వయుజ శుక్ల చవితి - అట్ల బతుకమ్మ
ఐదో రోజు అట్ల బతుకమ్మ - పేరుకి తగ్గట్టుగానే అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు.
అక్టోబర్ 15 గురువారం ఆశ్వయుజ శుక్ల పంచమి - అలిగిన బతుకమ్మ
ఆరో రోజు అలిగిన బతుకమ్మ - ఈ రోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించరు
అక్టోబరు 16 శుక్రవారం ఆశ్వయుజ శుక్ల షష్టి - వేపకాయల బతుకమ్మ
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ - సకినాల పిండితో వేపకాయలు చేసి వాటిని నివేదిస్తారు
అక్టోబరు 17 శనివారం ఆశ్వయుజ శుక్ల సప్తమి - వెన్నముద్దల బతుకమ్మ
ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ - బియ్యంపిండితో వెన్నముద్దలు తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బియ్యంపిండిని ఉడికించి ..వాటిని ఉండలుగా చేసి.. వాటిని బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించి..బెల్లం పాకంలో వేస్తారు.
అక్టోబరు 18 ఆదివారం ఆశ్వయుజ శుక్ల అష్టమి ( దుర్గాష్టమి) -సద్దుల బతుకమ్మ
బతుకమ్మ పండుగలో ఆఖరి రోజైన తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ - ఈ రోజు మరింత పెద్ద పరిమాణంలో బతుకమ్మను తయారు చేస్తారు. పండుగలో ఆఖరి రోజు కావడంతో సంబరాలు మరింత వైభవంగా జరుపుకుంటారు. పూజ పూర్తైన తర్వాత బతుకమ్మను తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ రోజు దుర్గాష్టమి. ఈ రోజు పులిహోర నివేదిస్తారు. పెరుగన్నం, లడ్డూ సహా తొమ్మిది రకాల నైవేద్యాలు తయారు చేస్తారు.
Frequently Asked Questions
బతుకమ్మ పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మకు ఏ నైవేద్యం సమర్పిస్తారు?
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మకు నువ్వులను పొడి చేసి, పంచదార కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
అలిగిన బతుకమ్మ రోజున ఏమైనా ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారా?
ఆరో రోజు అలిగిన బతుకమ్మ రోజున అమ్మవారికి నైవేద్యం సమర్పించరు. ఇది బతుకమ్మ పండుగలోని ఒక ప్రత్యేక ఆచారం.
సద్దుల బతుకమ్మ రోజున ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారు?
సద్దుల బతుకమ్మ రోజున పులిహోర, పెరుగన్నం, లడ్డూతో పాటు తొమ్మిది రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. ఈ రోజు దుర్గాష్టమి కూడా.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























