అన్వేషించండి

Ysrcp Ministers: 'పవన్ వామనుడు కాదు శల్యుడు, శికండి' - సినిమా డైలాగులు చదివారంటూ మంత్రుల ఎద్దేవా, జనసేనానిపై తీవ్ర విమర్శలు

AP Politics: 'జెండా' సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలను మంత్రులు తీవ్రంగా ఖండించారు. పవన్ సినిమా డైలాగులు కొట్టారని.. అరిస్తే ఓట్లు రాలవంటూ కౌంటర్ ఇచ్చారు.

Ysrcp Minsiters Slams Pawan Kalyan: టీడీపీ - జనసేన సంయుక్తంగా బుధవారం తాడేపల్లిగూడెంలో (Tadepalligudem) నిర్వహించిన 'జెండా' సభలో జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను మంత్రులు పేర్ని నాని, రోజా, వేణుగోపాలకృష్ణ, అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర క్షేమం చంద్రబాబుకు పట్టదని.. ఆయన వామనుడు కాదని, పురాణాల్లో పవన్ పోల్చాలంటే ఒక్క శల్యుడి పాత్ర మాత్రమే ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. టీడీపీ - జనసేన సభలో కేవలం సీఎం జగన్ నామస్మరణే చేశారని.. వారికి ఓట్లు ఎందుకు వేయాలో చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. 'పవన్ సినిమా డైలాగులు బట్టీ కొట్టారు. సీఎం జగన్ దగ్గర బేరాలుండవు. పవన్ కు చేతనైంది చేసుకోవచ్చు. పవన్ ఎన్ని సీట్లు తీసుకున్నా వైసీపీకి ఎలాంటి ఇబ్బందీ లేదు. గత ఎన్నికల్లో కూడా పవన్, జగన్ కు వ్యతిరేకంగా పని చేశారు. ఇప్పుడు మూడో జెండా కోసం ఎదురుచూస్తున్నారు. నీ చేష్టల వల్ల ఓటేద్దామనుకున్న కాపులు బాధ పడతారు. పవన్ శల్యుడు, శికండి లాంటివాడు. ప్రజా జీవితంలో ఇచ్చిన మాట తప్పితే ప్రజలు నిలదీస్తారు. 2024లో చంద్రబాబు, పవన్ జెండాలను ప్రజలు మడత పెట్టేస్తారు.' అంటూ పేర్ని నాని మండిపడ్డారు.

'అరిస్తే ఓట్లు పడతాయా.?'

పవన్ కల్యాణ్ గట్టిగా అరిచినంత మాత్రాన ఎన్నికల్లో ఓట్లు పడవని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఆయనకు ప్రస్టేషన్ పీక్స్ కు చేరిందని.. పార్టీ పెట్టి పదేళ్లైనా 24 సీట్లకే పోటీ చేస్తున్నారని సెటైర్లు వేశారు. 'కనీసం 30 సీట్లు కూడా తెచ్చుకోలేని స్థితిలో పవన్ ఉన్నారు. చంద్రబాబు మాయలో ఆయన పూర్తిగా పడిపోయారు. బాబుకు ఊడిగం చేస్తూ పాతాళంలోకి కూరుకుపోయారు. సీఎం జగన్ ను విమర్శించే నైతిక హక్కు పవన్ కు లేదు. 24 సీట్లు తీసుకుని జనసేన నేతలకు పవన్ అన్యాయం చేశారు. తన తప్పును కార్యకర్తలపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. పవన్ ఎప్పుడూ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించలేదు. ఓ మహిళ ఎదుగుతుంటే నీచంగా మాట్లాడడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం టీడీపీ, జనసేనలకు అలవాటుగా మారింది. అందుకే మహిళలు వాళ్లను అసహ్యించుకుంటున్నారు.' అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

'చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ యాక్షన్'

టీడీపీ - జనసేన 'జెండా' సభలో చంద్రబాబుది డైరెక్షన్ అయితే, పవన్ ది యాక్షన్ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. తనకు సలహాలు ఇవ్వొద్దని పవన్ చెప్పడం ఒక జాతిని అవమానించినట్లేనని అన్నారు. చంద్రబాబు చెప్పింది పవన్ చేయడం వల్ల హరిరామ జోగయ్య, ముద్రగడ వంటి వారు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ - జనసేనది ఎజెండా లేని జెండా సభ అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు వామనావతారం ఎత్తి పవన్ ను తొక్కారని.. పవన్ కూడా ఆ అవతారం ఎత్తి, నమ్ముకున్న నేతలు, కార్యకర్తలను తొక్కారని మండిపడ్డారు.

జగన్ సంకల్పంతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. టీడీపీ -  జనసేన సభలో పవన్ వ్యాఖ్యలకు సొంత వారే నొచ్చుకున్నారని.. సీఎంను విమర్శించే స్థాయి పవన్ కు లేదని మండిపడ్డారు. నోటికొచ్చిన భాషతో ప్రజలు అసహ్యించుకుంటారనే ఆలోచన లేకుండా పవన్ మాట్లాడారని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Also Read: Krishna District Politics : కృష్ణా జిల్లాలో ప్రధాన పార్టీలకు అసంతృప్తి బెడద - కీలక నేతలకు టిక్కెట్లు గల్లంతే !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget