అన్వేషించండి

TDP Mahanadu : టీడీపీ మహానాడు ప్లేస్ ఖరారు - ఇక ప్రజల వద్దకు చంద్రబాబు !

తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఒంగోలులో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, లోకేష్‌లు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేపట్టనున్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఎన్నికల వేడి పెరగడంతో చంద్రబాబు ఇక రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. రోడ్‌షోలు,  బహిరంగసభలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ సారి చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లు కూడా విస్తృతంగా పర్యటించనున్నారు. క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం  చేయాలని తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నిర్ణయించుకుంది. పార్టీ మహానాడు కంటే ముందు నుంచే వీరి పర్యటనలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 

తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించి మహానాడు కార్యక్రమాన్ని ఈ సారి మరింత ఘనంగా నిర్వహించనున్నారు. మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినం రోజుల్లో మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 28. అందుకే ఈ సారి మే 27 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఈ సారి ఒంగోలులో మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఎక్కువగా గండిపేటలో మహానాడును నిర్వహించేవారు. ఈ సారి ఎన్నికలకు సమాయత్తమయ్యే మహానాడు కావడంతో ఏపీలో నిర్వహించనున్నారు.  అయితే మహానాడును ఎన్ని రోజులు నిర్వహించాలన్నది పొలిట్ బ్యూరో భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు 

2019లో మహానాడు జరపాల్సి ఉన్నా ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో సాదాసీదాగా నిర్వహించారు.  ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టలేకపోయారు.ఇప్పుడు కరోనా తగ్గిపోవడం.. ఎన్నికల వేడి కూడా పెరగడం... ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయని తెలుగుదేశం పార్టీ హైకమాండ్ అంచనా వేయడంతో ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు.. ఇప్పటికే ప్రజలు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని..  వారికి తామున్నామని భరోసా కల్పిస్తూ ప్రజల బతుకులు బాగుపడతాయని నమ్మకం కల్పించాలని భావిస్తున్నారు. 

ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఎవరున్నా రాష్ట్రాన్ని చుట్టేసి రావడం సహజం. గతంలో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలోనే పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న  జగన్ కూడా పాదయాత్ర చేశారు. వారానికో సారి కోర్టుకు వెళ్లి వచ్చినా వారానికి ఐదు రోజుల పాటు పాదయాత్ర చేశారు. కానీ ఈ సారిఏపీలో ఎవరూ పాదయాత్రలు చేయడం లేదు. పాదాయత్రల సీజన్ ముగిసిపోయిందని.. కాలం మారినందున ఇక టెక్నాలజీని వాడుకుని విస్తృత పర్యటనలు చేయడం మేలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.  ముగ్గురు అగ్రనేతల పర్యటనలు సమాంతరంగా సాగేలా ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
Fatty Liver : కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది
కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Embed widget