News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కకు పోయాయి. వైరల్ ఫీవర్స్, పంటనష్టాలు, కరెంట్ చార్జీల పెంపు, అధ్వాన్నంగా ఉన్న రోడ్లు వంటి అంశాలను ఎవరు మాట్లాడుకోవడం లేదు.

FOLLOW US: 
Share:

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. టీడీపీ కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు, చంద్రబాబు అరెస్ట్ పై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనలు, నిరసనలు, నిరాహార దీక్షలు, ప్రత్యేక కార్యక్రమాల్లో నిమగ్నపోయారు.  గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ల దాకా అందరూ ఇపుడు చంద్రబాబు అరెస్టు అంశంపైనే నిరసనలు చేస్తున్నారు. హోటల్ లో, క్యాంటీన్లలో, ఎలాంటి సమావేశాల్లో అయినా,  ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా చంద్రబాబు అరెస్టు అంశమే ప్రధాన టాపిక్ అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ వస్తుందా ? రాదా ? బెయిల్ వస్తే ఎప్పుడు వస్తుంది ? ఏ కేసులో వస్తుంది అన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. వారు వీరు అన్న తేడా లేకుండా అన్నదాతల నుంచి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల వరకు ఇదే చర్చ. 

చంద్రబాబుపై జగన్ పైచేయి
చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కకు పోయాయి. వైరల్ ఫీవర్స్, వర్షాలు, పంటనష్టాలు, కరెంట్ చార్జీల పెంపు, అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, అన్నదాత సమస్యలు వంటి అంశాలను ఎవరు మాట్లాడుకోవడం లేదు. ఒక్క అరెస్ట్ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని సమస్యలు డైవర్ట్ అయ్యేలా చేశారని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ఎవరు పట్టించుకోవడం లేదని, చంద్రబాబు అరెస్టు గురించే పార్టీలకు అతీతంగా చర్చించుకుంటున్నారని చెబుతున్నారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైచేయి సాధించారని వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. జగన్ భలే దెబ్బ కొట్టారని లోలోపల సంబరపడిపోతున్నారు.

వైజాగ్ నుంచే పాలన
త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగించేందుకు జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు. కార్యాలయాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఈ దసరాకు జగన్ వైజాగ్ కు షిఫ్ట్ అవుతున్నారు. కీలకమైన విభాగాలన్నీ తరలించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలకు తెరతీసింది. అమరావతి అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చుకుని 2024 ఎన్నికల్లో వైసీపీని దెబ్బ కొట్టాలనే వ్యూహాన్ని పన్నుతోంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు ఎనలిస్టులు చెబుతున్నారు. అమరావతి ప్రాంతంలో వైసీపీకి తిరుగులేకుండా చేసుకునేందుకు వేసిన ప్లాన్ లు అన్ని వర్క్ అవుట్ అవుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి. టీడీపీ యంత్రాంగం మొత్తం చంద్రబాబు అరెస్టు పైనే చర్చించుకోవడంతో, జగన్ ప్రశాంతంగా తన పనులు చేసుకుంటున్నారు. ఫోకస్ అంతా ప్రజా సమస్యలపై ఉండా కేవలం చంద్రబాబుపైనే ఉండేలా వ్యూహాలు అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. 

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జైల్లో ఉన్న చంద్రబాబుపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్ళు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు అక్రమాల్లో లోకేశ్ పాత్ర ఉందంటూ సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు మొత్తం చంద్రబాబు అరెస్టు చుట్టే తిరుగుతున్నాయి.

పథకాల ప్రచారం  పక్కన పెట్టిన టీడీపీ

2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో చాలా హామీలను టీడీపీ ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రెట్టింపు చేయబోతున్నామని ప్రకటించింది. వాటిని ఇంటింటికీ తీసుకెళ్లేందుకు చంద్రబాబు, లోకేష్ ఇతర లీడర్లు కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగారు. వాటిపైన్ ఫోకస్ ఉండేలా చూసుకున్నారు. బాగానే వర్కౌట్ అవుతున్న టైంలో చంద్రబాబు అరెస్టు మొత్తం పరిస్థితిని మార్చేసింది. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టో గురించి టీడీపీ లీడర్లు పట్టించుకోవడం మానేశారు. అంతా చంద్రబాబుకు మద్దతు అంటూ తిరుగుతున్నారు. 

Published at : 30 Sep 2023 12:33 PM (IST) Tags: AP Chandrababu . Jagan divert politics

ఇవి కూడా చూడండి

Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి  బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !

Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !

BRSLP Meeting : బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆరే - కాంగ్రెస్ సర్కార్ పై పోరాటానికి రెడీ !

BRSLP Meeting :  బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆరే -  కాంగ్రెస్ సర్కార్ పై పోరాటానికి రెడీ !

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్‌ రెడ్డి- మంత్రివర్గ విస్తరణ శాఖ కేటాయింపుపై చర్చలు

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్‌ రెడ్డి- మంత్రివర్గ విస్తరణ శాఖ కేటాయింపుపై చర్చలు

ప్రజాభవన్‌ వద్ద కేసీఆర్‌ పేరుపై మట్టిపూత- సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు - వద్దని వారించిన బండ్ల గణేష్

ప్రజాభవన్‌ వద్ద కేసీఆర్‌ పేరుపై మట్టిపూత- సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు - వద్దని వారించిన బండ్ల గణేష్

Nitish Kumar: నితీష్ మాటలను పట్టించుకోని రాహుల్ గాంధీ, అదే కాంగ్రెస్ కొంప ముంచిందా?

Nitish Kumar: నితీష్ మాటలను పట్టించుకోని రాహుల్ గాంధీ, అదే కాంగ్రెస్ కొంప ముంచిందా?

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే