అన్వేషించండి

NTR centenary celebrations : తెలుగు రాజకీయాల్లో తొలి సంక్షేమ సంతకం ఎన్టీఆర్ - ఇప్పటికీ ఆ పథకాలు ఎవర్ గ్రీన్ !

సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

 

NTR centenary celebrations : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంక్షేమ పథకాలు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ . అసలు ఇలాంటి పథకాలను ప్రవేశ పెట్టిందే ఎన్టీఆర్ రామారావు.   సంక్షేమం పథకాలకు కొత్త అర్థాన్ని ఇవ్వడమే కాదు.. వాటి అమలులో కాకలు తీరిన రాజకీయ కురువృద్ధుల్నే ఆశ్చర్యపరిచారు. ఆయన పథకాల లక్ష్యం ఒక్కటే.. అదే ప్రజా క్షేమం…  ఎన్నికోట్ల రూపాయల పథకమైనా సరే.. పేదవాడికి మేలు జరుగుతుందంటే క్షణాల్లో నిర్ణయాలు తీసుకునేవారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక సంక్షేమ పథకాలకు కొత్త అర్థానిచ్చారు. ప్రజలకు చేరువయ్యేలా ఎన్నో పథకాలను రూపకల్పన చేశారు.  సమాజంలో ఉన్న అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. స్పష్టంగా చెప్పాలంటే… తెలుగు ప్రజలకు అప్పటి వరకూ తెలియని సుపరిపాలనను కొత్తగా రుచి చూపించారు ఎన్టీఆర్.

కిలో రూ.2 పథకం ఇప్పుడు రూ.1 స్కీమ్ అయింది. ..!

ఎన్టీఆర్  ప్రవేశపెట్టిన పథకాల్లో ముఖ్యమైనది… మొదటిది… ఇప్పటికీ నేతలకు ఆదర్శంగా ఉన్నది రెండ్రూపాయల కిలో బియ్యం పథకం… ప్రతి పేదోడి కడుపూ నింపాలన్న సదాశయంతో రెండ్రూపాయలకే కిలో బియ్యమిచ్చి చరిత్ర సృష్టించారు. సీఎం అయిన మొదటిసారే కాదు… అధికారంలోకి వచ్చిన మూడు సార్లూ… ఈ పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. ఈ పథకం అమల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా… వెరవకుండా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.1983 లో త‌ను అధికారంలోకి రాగానే …పేద‌వాడి క‌డుపునింపాల‌నే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను స్టార్ట్ చేశారు. అప్ప‌ట్లో ఇదో సంచ‌ల‌నం. కేంద్ర ప్ర‌భుత్వం సైతం ఈ స్కీమ్ ను కొనియాడింది.

జనతా వస్త్రాల పంపిణీ 

ఇక జనతా వస్త్రాల పథకంతో ప్రతి పేదవాడికీ కనీస అవసరమైన వస్త్రాలను అందించారు. అప్పట్లోనే బడుగు వర్గాలకు లక్షలాదిగా ఇళ్లు కట్టించి కొత్త సంచలనానికి తెర తీశారు. పేదల కనీస అవసరాలైన… రోటీ కపడా ఔర్ మకాన్ లకు ఎక్కడా లోటు లేకుండా చూశారు. 

చాలా రాష్ట్రాల్లో క్యాంటీన్లకు ఎన్టీఆర్ పెట్టిన అన్నం, సాంబార్ పథకమే మూలం

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… హైదరాబాద్‌లో గంజి కేంద్రాలు పెట్టాలంటూ వామపక్ష నేతలు యాత్ర చేపట్టారు. వారి యాత్ర అబిడ్స్ చేరుకున్నప్పుడు… అన్నగారు ఎదురై, విషయం తెలుసుకుని, గంజి కేంద్రాలేంటి బ్రదర్… ఏకంగా అన్నమే పెడదాం అంటూ అన్నం, సాంబార్ పథకం ప్రవేశ పెట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉన్న ప్రజా క్యాంటిన్లకు మూలం.. అన్నగారి అన్నం, సాంబారే.

5 ల‌క్ష‌ల ఇండ్ల నిర్మాణం

పేద‌ల కోసం త‌న ఐదేండ్ల ప‌రిపాల‌న కాలంలో 5 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మించాడు. ఎంతో మంది పేద‌ల‌కు గూడును క‌ల్పించారు ఎన్టీఆర్‌. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించి ఒక గూడు కల్పించాడు. అగ్రకుల పెత్తందార్లకు కొమ్ముకాసే పటేల్‌ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి సంచలనం రేపారు. తాలూకా, సమితి వంటి కాలం చెల్లిన వ్యవస్థలకు చరమగీతం పాడి మండల వ్యవస్థను ముందుకు తెచ్చారు. తద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారు. దాంతో పాటే అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రభావవంతమైన అమలుకు నోచుకున్నాయి.యువత, బలహీన వర్గాలకు రాజకీయంగా పెద్ద పీట వేశారు. జనాభాలో సగం ఉన్న బీసీలకు అప్పటికి రాజకీయ ప్రాధాన్యం లేదు. ఎన్టీ రామారావు రాకతో మొత్తం సీన్‌ మారింది. బీసీల రాజకీయ ఎదుగుదల ప్రారంభమైంది. అంతే కాదు ..అప్పటి వరకు స్తబ్దుగా ..అలసత్వానికి మారుపేరుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల భరతం పట్టారాయన. ఆకస్మాక తనిఖీలతో ప్రభుత్వ సిబ్బందిని పరుగులు పెట్టించారు.మండల వ్యవస్థ రద్దుతో పాటు మద్యపాన నిషేదం వంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. 

ప‌టేల్ ప‌ట్వారీ విధానం ర‌ద్దు

గ్రామ భూముల రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను త‌మ చేతుల్లో పెట్టుకుని పేద రైతుల‌ను అనేక క‌ష్టాల‌కు గురి చేస్తున్న ప‌టేల్‌, ప‌ట్వారీల అధికారాల‌ను తొల‌గిస్తూ ఓ గొప్ప నిర్ణ‌యం తీసుకొని పేద రైతుల‌కు ఆనందాన్ని పంచాడు. బీసీలకు రిజర్వేషన్లు, కార్మికులకు సౌకర్యాలు, పేదలకు పక్కా గృహాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో… తెలుగు రాష్ట్రాల్లో అనేక బస్ స్టాండ్లు అన్నగారి హయాంలో నిర్మించినవే. ప్రజల వద్దకే పాలన అన్నది ఆ దిగ్గజం అన్నగారి హయాంలోనే మొదలైంది. ప్రజలకు మేలు జరుగుతుందంటే ఎంతటి క్లిష్టమైన నిర్ణయాన్నైనా క్షణాల్లో తీసుకునేవారు. ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఆరు నూరైనా అది అమలవ్వాల్సింద

పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం

విద్యావ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయ‌డానికి పేద విద్యార్థుల‌ను చ‌దువు వైపు ప్రోత్స‌హించే విధంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం ప్రారంభించారు. ఇప్పటికీ ఆ పథకం కొనసాగుతోంది. 
 
నీటి పారుదల రంగానికి ప్రాధాన్యం 

నీటిపారుదల రంగాన్నికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఎన్టీఆర్ కృషి ఫలితంగానే.. తెలుగుగంగ ప్రాజెక్టు పూర్తై… చెన్నైతో పాటు రాయలసీమ ప్రజల దాహం తీరింది. రైతులకు మేలు జరుగుతుందంటే ఎంత పెద్ద నిర్ణయమైనా క్షణాల్లో తీసుకునేవారు. నిర్ణయాలు తీసుకోవడంలో మెరుపు వేగం ఎన్టీఆర్ సొంతం. ఓ సారి నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉండగా శ్రీరాం సాగర్ ప్రాజక్టు గురించిన ఫైల్‌ను ఇంజినీర్లు ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. ఫైల్ చూడగానే… ఈ ప్రాజెక్టుతో ఎంత మంది రైతులకు లబ్ది కలుగుతుందని అధికారుల్ని అడిగారు.వాళ్లు ఇన్ని వేల ఎకరాలకు నీరంది… లక్షలాది మంది రైతులకు లబ్ది చేకూరుతుందని చెప్పారట. అది విన్న అన్నగారు కనీసం ఖర్చెంత అవుతుందన్నది కూడా చూడకుండానే… వెంటనే శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌ను ఓకే చేసేశారు. అధికారులు ఫైల్ తెచ్చిన దగ్గర్నుంచి,  నిర్ణయం తీసుకోడానికి మధ్య సమయం… కేవలం మూడు నిముషాలే. ఆ ప్రాజెక్టుతో అప్పట్లోనే రూ.780 కోట్ల భారం పడుతుందని అధికారులు చెప్పినా.. ప్రాజెక్టు కట్టాల్సిందే అని నిక్కచ్చిగా తేల్చిప్పారు. ఏ తరం నాయకుడైనా ఒక ప్రాజెక్టు గురించి.. అంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మున్మందు కూడా చూడలేమేమో.

తెలుగు భాష అమలులో ఎన్టీఆర్‌ది ప్రత్యేక శైలి 

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు ఎన్టీఆర్. తెలుగులోనే అన్నీ పాలనా వ్యవహారాలు సాగేలా నిర్ణయం తీసుకున్నారు. తెలుగు టైప్ మిషన్లను ప్రత్యేకంగా తయారు చేయించి సచివాలయం సహా… అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయించిన ఘనత ఆయనదే. ప్రభుత్వ సంస్థలకు, భవనాలకు తెలుగు పేర్లు పెట్టడం, దరఖాస్తులన్నీ తెలుగులోనే ఉండేలా చేయడం, హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం ఏర్పాటు, ట్యాంక్ బండ్ మీద తెలుగు తేజాల విగ్రహాలు పెట్టడం వంటి నిర్ణయాలతో తెలుగు జాతికి, సంస్కృతికి పునరుజ్జీవనమిచ్చారు. అన్నగారు ఎక్కడికెళ్లినా అచ్చతెనుగు పంచె కట్టుతో.. భుజానా కండువా వేసుకుని తెలుగువాడికి నిలువెత్తు చిరునామాలా కనిపించేవారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
Holidays in January: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget