అన్వేషించండి

Nara Lokesh : విశాఖ కోర్టుకు హాజరు కానున్న నారా లోకేష్ - కేసేమిటంటే ?

Andhra Pradesh : ఏపీ మంత్రి నారా లోకేష్ బుధవారం విశాఖ కోర్టుకు హాజరు కానున్నారు. తాను దాఖలు చేసిన ఓ పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇవ్వనున్నారు.

Nara Lokesh will appear in Visakhapatnam court on Thursday : ఆగస్టు 29వ తేదీన మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించనున్నారు.  గతం లో ఆయన తనపై తప్పుడు ప్రచారం చేశారని..ఓ దినపత్రికపై  పరువు నష్టం దావా వేశారు. వైజాగ్ లోని 12వ అడిషనల్ జిల్లా కోర్టలో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరవుతున్నారు. గతంలో కూడా  ఓ సారి కోర్టుకు  హాజరయ్యారు. 

2019 కు ముందు టీడీపీ ప్రభుత్వ హయాం లో నారా లోకేష్ IT మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గా పనిచేశారు. ప్రభుత్వం మారిన తర్వాత  " చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి``  అనే టైటిల్ తో  2019 అక్టోబర్ 22న  ఓ ప్రముఖ  పత్రికలో  కథనం రీ ప్ర‌చురించారు. అది కూడా వైజాగ్ పర్యటన సమయం లో వైజాగ్ ఎయిర్ పోర్ట్ లాబీల్లో జరిగిన మీటింగ్స్ కోసం సప్లయి చేసిన స్నాక్స్ కోసం ఈ రూ.  25 లక్షలు ఖర్చు చేశారని ఆ కథనం లో పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా అవాస్త‌వాల‌తో ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌న‌ ఇమేజ్ ను  డ్యామేజ్ చేయాల‌ని రాసిన ఆర్టికల్ అంటూ  టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ త‌న లాయర్ ల ద్వారా  నోటీసుని సాక్షికి పంపించారు.    

కొన్ని ఇతర పత్రికలు, మ్యాగజైన్లు కూడా ఈ వార్తను ప్రచురించాయి. వారందరికీ నారా లోకేష్ నోటీసులు పంపించారు. దీంతో ఆ పత్రికలు తప్పుడు సమాచారం వల్ల అలా రాశామని.. వివరణ ఇచ్చారు. ప్రముఖ దినపత్రిక మాత్రం  ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వకపోవ‌డంతో నారా లోకేష్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు పూర్తిగా అబద్దాలతో ఆర్టికల్ రాశారని   ఆ పిటిషన్ లో పేర్కొన్నారు నారా లోకేష్.  తాను వైజాగ్ లో ఉన్నాన‌ని ప్రచురించిన టైం లో  అసలు విశాఖలోనే లేనని పిటిషన్ లో పేర్కొన్న లోకేష్  రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే గెస్టు లకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన బిల్లు ను త‌న‌కు అంట‌గ‌డుతూ త‌న ఇమేజ్ ను మంట‌గ‌లిపేందుకు ఉద్దేశ్య పూర్వకంగా ప్ర‌య‌త్నించార‌ని కోర్టు కు తెలిపారు  .  

ఆయన . మంత్రి హోదా లో తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు  స్వీకరించలేదని  కూడా స్ప‌ష్టం చేశారు. అయితే నాటి నుండి వివిధ కార‌ణాల‌తో చాలా వాయిదాలు ప‌డిన ఈ కేసు విచారణ  మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేష‌న్‌తో మ‌ళ్లీ మొద‌లు కానుంది .దానికోసం స్వయంగా నారా లోకేష్  గురువారం వైజాగ్ కోర్టుకు హాజరు కానున్నారు . తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు పలువురు వ్యక్తులకు కూడా లోకేష్ నోటీసులు ఇచ్చారు. వారిలో పోసాని కృష్ణమురళి కూడా ఆయన పై కూడా మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.                               

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget