అన్వేషించండి

NTR centenary celebrations : ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చేసిన ప్రసంగం పాఠం - అద్భుతమే !

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేసిన తొలి ప్రసంగం పాఠం అద్భుతమే. ఇదిగో పూర్తి పాఠం !

 

NTR centenary celebrations :     మొదటిసారి ముఖ్యమంతతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్టీఆర్‌ 1983 జనవరి 9 న లాల్‌బహదూర్‌ స్టేడియంలో అశేషజనవాహిని ఉద్దేశించి చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోతుంది. అసాధారణ విజయాన్ని సాధించిన నాయకుడు .. నోటి వెంట వచ్చిన ప్రతీ మాట అందర్నీ కదిలిందింది. సినిమాటిక్ ప్రసంగం.. ఆయన స్టైల్లో ఉండటం విశేషం. 

ఎన్టీఆర్ ప్రసంగం ఇదే : 

మహెత్తుంగ జలధి తరంగాల్లో ఉత్సాహంతో ఉప్పాంగుతున్న ఈ జనసందోహాన్ని చూస్తూంకు నాలో ఆవేశం తొణికిసలాడుతున్నది. పుట్టి ఏడాది కూడా నిండని 'తెలుగుదేశం'ఇంత గా. అధికారంలోకి రావడం ప్రపంచ చరిత్రలోనే అపూర్వం. ఒక్క తెలుగువాళ్ళే అసంభవాన్ని సంభవం చేయగలరని, తెలుగు పౌరుషం దావాగ్నిలా, బడబాగ్నిలా ప్రజ్వరిల్లి అక్రమాలను, అన్యాయాలను దహించగలదని రుజువు చేశారు. అందుకు తెలుగు బిడ్డగా నోను గర్విస్తున్నాను. నాకు నా జాతి చైతన్యం మీద, పరాక్రమం మీద,అచంచలమైన నమ్మకముంది. నా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆగ్రహిస్తే వాళ్ళు హృదయాలోంచి లావా ప్రవాహాలు వెలికి చిమ్ముతాయని నాకు తెలుసు. శౌర్యం విజృంభిస్తే ఎంత శక్తివంతమైన ఆక్రమ శక్తి ఐనా నేల కరుస్తుందని లక్షలాది ప్రజలు ఆచరణలో నిరూపించారు. అందుచేతనే మీ ముందు వినమ్రుడనై చెబుతున్నాను ఆధి మీ విజయం.. ఆరుకోట్ల తెలుగు వీర ప్రజానీకం సాధించిన అద్బుతమైన, అపూర్వమైన విషయమని మనవి చేస్తున్నాను. ఈ మహత్తర చారిత్రాత్మక విజయంలో నా పాత్ర ఎంత? మహా సముద్రంలో నీటి బిందువంత మాత్రమే. కాబట్టి తెలుగుదేశం గెలుపు తెలుగు ప్రజలందరిది గెలపని ప్రకటిస్తున్నాను.

ఈ ఎన్నికల్లో జనబలం అన్నింటినీ జయించింది. తెలుగు వారి అత్మాభిమానం అంగడి సరుకు కాదని తెలుగువాడు టను తెరిస్త అధర్మం,అన్యాయం, కాలి బూడిదై పోతాయని మన ర్యాష్ట్‌రంలోవిజృభించిన జన చైతన్య ప్రభంజనం చాటి చెప్పింది. దాని ముందు కొండలు కూడా బెండులాగా ఎగిరిపోతాయాని రుజువైంది. మీరిచ్చిన ప్రోత్సహ తరంగాల మీదనే నా ప్రచార జైత్రయాత్రఅవిఘ్నంగా అప్రతిహతంగా సాగిపోయింది.  నాపట్ల ఫ్టలు ప్రదర్శించిన వాత్సల్యానికి, చెకూర్చిన ఈ అద్బుత విజయానికి ఎలా,ఎమని కృతజ్ఞత చెప్పాల్‌ నాకు తోచడం లేదు.  మీరు చూపించిన ప్రేమానుగారాల  గురించి వల్లించడానికి మాటలుచాలవు. మీ బుణాన్ని తర్చుకోవడానికి నాకు ఒక జన్మ చాలదు. మళ్ళీ జన్మంటూ వుంకే తెలుగు తల్లికి తనయుడుగా పుట్టి మీ సేవలో నా జీవితాన్ని చరితార్జం చేసుకోవాలని ఉంది. నాలోని ప్రతి అణువును ప్రతి రక్తపు బొట్టునూ మీ కోసం ధారబోయాలని ఉంది. ఈ ఎన్నికల రణరంగంలో నన్ను అభిమానించి, విజయోస్తు అని అశీర్వదించి, రక్తతిలకం పీర్చి మంగళహారతులు పట్టిన తెలుగు మహిళలకు ప్రత్యేకించి మా అభినందనలు అర్పిస్తున్నాను. 

ఇక తెలుగువాడినీ, వేడిని ప్రతిబింబించే ఉడుకు నెత్తురు ఉప్పాంగే నవయువతరం గురించి ఏం చెప్పాలి? వాళ్ళు వీరభ్యదుల్లా విక్రమించారు. తెలుగుదేశం విజయసాధనలో అ(గగాములయ్యారు. అలాంటి నా తమ్ముళ్ళకు నేను చెప్పేదోకకే. ఇది మీ భవిష్యత్తుకు మీరు వేసుకున్న వెలుగుబాట. పోతే చిన్నారి చిట్టి బాలురున్నారు.  వారికి ఓట్లు లేవు. అయినా శ్రీరాముని సేతుబంధనంలో ఉడత సహాయంలా ఈ బుడతలు చేసిన కృషికి నేను ముగ్దుడిని అయ్యాను.  రేపటి వేకువ విరిసే ఈ లేత గులాబీ మొగ్గలను ప్రేమాభిమానాలతో ఆశీర్వదిస్తునూను.

తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో రాష్ట్ర అభివృద్దికి అనేక అంశాల కార్యక్రమం ఉంది. ర్యా ప్రజనీకం నా మీద, తెలుగుదేశం మీద ఎన్నో అశలు పెట్టుకున్నారని నాకు తెలుసు. ప్రణాళికలోనివివిధ అంశాలను వాటి[ప్రాముఖ్యాన్ని బట్టి క్రమంగా అమలు జరుపుతాము. ఈ విషయంలో ఏరుదాటి తెప్ప తగలేసే తప్పుడు పని చేయబోనని హామి ఇస్తున్నాను. ప్రధానంగా సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు వర్గాల అభివృద్దికి మా శయశక్తులా కృషి చేస్తాం. త్రాగేందుకు మంచి నీళ్ళకు సైతం నోచుకోని ఉళ్ళున్నాయి. తలదాచుకోను తావులేని నిర్బాగ్య జీవులున్నారు. రెక్కాడినా డొక్కాడని శ్రమజీవులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. వాళ్ళను వేంటనే అదుకోవాలి. ఆ సమస్యను పరిష్కరించాలి గాంధీజీ గ్రామ స్వరాజ్యం గురించి కలలు గన్నారు. అదే రామరాజ్యం అన్నారు. తెలుగుదేశం గ్రామాభ్యుదయం కోసం నిర్విరామంగా పాటుపడుతుంది. బడిపిల్లలకు ఉచిత మధ్యాన్న భోజన పథకం, రెండు రూపాయలకు కిలో బియ్యం పేద ప్రజలకు ఇప్పించడం సక్రమంగా అమలుజరుపుతాము. వ్యవసాయ, పరిశ్రమలు సమాతుకంలో సత్వరాభివుృద్దికకి కృషి చేస్తాము. రాషరంలో వెనుకబడిన, కరువు కాటకాలకు నిలయమైన (ప్రాంతాల అభివృద్దికి శద తీసుకుంటాము. ఏ రూపంలోనూ ప్రాంతీయ సంకుచిత తత్వాలకు ఆసాధ్యం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధికి దీక్ష వహిస్తాము.

ఈ కార్యక్రమం అనుకున్న విధంగా అమలులోనికి రావాలంకే పాలన వ్యవహారాలు స్మక్రమంగా సజావుగా సాగాలి. ప్రభుత్వ యంత్రాంగం సమర్దవంతంగా పనిచేయాలి. ఉద్యోగులు ప్రజా పీడకులుకాకుండా, వాళ్ళ ఉప్పు తింటున్న సేవకులుగా భావించుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు మన పాలనా వ్యవస్ద అలా లేదు. అధికార దర్పం, పనిలో జాప్యం, లంచగొండితనం వగైరా నానారకాలైనజాడ్యాలకు కేందద్రమైంది. ముప్పై ఐదు ఏళ్ళుగా పొరలు పొరలుగా పేరుకోని ఘనీభవించిన కాలుష్యాన్ని ప్రక్షాళనం చేయవలసి వుంది. అయితే ఇది అనుకున్నంత తేలిక వ్యవహారం కాదనీ నాకూ, మీకుకూడా తెలుసు. తెలుగునాట (ప్రవహించే సమస్త పవిత్ర నదీ జలాలన్నింటితో కడిగినా ప్రక్షాళనం కానంతటి కల్మషం పేరుకుని వుంది. ఇది తెలుగుదేశంకు స్మకమించిన వారసత్వం. కాబట్టి ఒక్క రోజులో ఈ పాలన వ్యవస్థను మార్చడం అయ్యే పనికాదు. అయితే అత్మవిశ్వాసం నాకు ఉంది. మన అధికారుల అండతసు ఈ కృషిలో జయప్రదం కాగలమన్న కక్ష, కార్పణ్యాలే బహుమతులై మిగిలాయి.తెలుగుదేశం పాలనలో అన్ని విధాలా ప్రోత్సాహంగా ఉంటు౪ది. అలాగే అవినీతికి అలవాటు పడిన ఉద్యోగులకు కూడా ఈ సంధర్పంలో ఒక హెచ్చరిక చేయదలచుకున్నాను. గతంలో ఏ అనివార్యరాజకీయ కారణాలవల్లనో, ఇతర కక్కుర్తివల్లనో అక్రమాలకూ, అధికార దుర్వనియోగానికి పాల్పడి వుండవచ్చు. వాళ్ళు ఇప్పుడైన పశ్చాత్తాపం చెంది తమ పద్దతులు మార్పుకుంకే మంచిది. లేకపోతేఅలాంటి విషయంలో , నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి తీరుతాము. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో మమ్ము ఏ శక్తి అడ్డలేదు. కానీ వాళ్ళను ఏ శక్తి రక్షించలేదని కూడా తెలియజేస్తున్నాను. అన్నిశాఖల ప్రభుత్వోద్యోగులు మాతో సహకరించి తెలుగునాడు సర్వతోముఖ వికాసానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఉద్యోగుల సాధక బాధాకాలను మా ప్రభుత్వం సానుభూతితోపరిశీలిస్తుంది. ముఖ్యంగా చాలీ చాలనీ జీతాలతో బాధపడే వాళ్లకు తగిన సహాయం చేస్తుంది. అదే సమయంలో విద్యుక్త ధర్మ నిర్వహణలో నిజాయితిగా, సమర్దంగా పనిచేయాలని కోరుతుంది. అనేకరంగాల్లో అనుభవజ్ఞులూ, మేధావులూ మన ర్యాప్టర్‌రంలో వున్నారు. వాళ్ళందరి సహకారాన్ని మేము సవినయంగా అర్జిస్తున్నాను.

రాను రాను మన ర్యాష్ట్‌రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని,ప్రజల మాన , ధన ప్రాణాలకు, ప్రీరల శీలానికి రక్షణ లేకుండా పోయింది. అందరికి తెలుసు. మన సమాజంలో అరాచక, హింసా,దౌర్హన్యశక్తులు వికట తాండవం చేస్తున్నాయి. ఈ విషయంలో మా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. బందిపోట్లను, గూండాలను సమస్త సంఘ వ్యతిరేకులను నిర్హాక్షి ఖ్యంగూ అణిచి వేసేవిషయంలో అధికారులు తీసుకునే చర్యలను గౌరవించి అభినంధిస్తుంది.పోలీస్‌ శాఖలో ఉత్సాహవంతులు, సమర్హులు, సాహసికులూ, నీతిపరులైన వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళను మా ప్రభుత్వంఅభిమానిస్తుంది, ఆదరిస్తుంది. ప్రజలను రక్షించవలసిన ఈ శాఖలో ఉన్న అవినీతిని నిర్మూలించేందుకు , పోలీసుల జీతాలను బాగుపరిచేందుకు ప్రయత్నిస్తాము.పోలీసులను ప్రజలు నిజంగా తమరక్షకులు అనుకునేటటుు ఆ శాఖను తీర్పిదిద్దాలనుకోవడం మా సంకల్పం . అందుకు సహకరించవలసిందిగూ ఆ శాఖ ఉద్యోగులందరిని కోరుతున్నాను.
 
మా ఎన్నికల ప్రణాళికలో ఈ రంగాలలో తీసుకోవలసిన చర్యల గురించి పేర్కొన్న అన్ని అంశాలను అమలు జరుపుతామని మనవి చేస్తున్నాను.కరన అదిక అవసరమైన అన్ని వనరులూ మనకున్నాయి.వాటిని నిర్లీత పథకం ప్రకారం పట్టుదలతో అమలు జరపడం ద్వారా పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని అరికట్టవలసి ఉంది. ఇలాంటివేఇంకేన్నో జటిల సమస్యలు మన ముందున్నాయి. వాటన్నింటిని ఓర్పుతో నౌర్పుతో పరిష్కరించుకోవలసి ఉంది. ఈ సందర్పంలో తెలుగుదేశంను అనూహ్యమైన మెజారిటీతో గెలిపించిన తెలుగు ప్రజలందరికి నాదో విన్నపం. ఈ విజయానికి మీరే కర్తలు. అలాగే అభివృద్ధికీ మీరే కర్తలు అని సవినయంగా మనవి చేసుకుంటూ శలవు దీసుకుంటున్నాను జై తెలుగుదేశం!జై జై తెలుగుదేశం!

ఈ ప్రసంగం తర్వాత ప్రమాణస్వీకార ప్రాంగణం అరగంటపాటు హోరెత్తిపోయింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు

వీడియోలు

Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Bangladesh Violence : బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Embed widget