అన్వేషించండి
Satyabhama Serial Today September 27th: మహదేవయ్యకి ఫస్ట్ షాక్ - సత్య యుద్ధం మొదలెట్టింది - సత్యభామ సీరియల్ సెప్టెంబరు 27 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode Photos: సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబరు 27 శుక్రవారం ఎపిసోడ్ లో హైలెట్స్ ముందుగా మీకోసం...
Satyabhama Serial Today September 27th (Image Credit: star maa/Disney + Hotstar)
1/8

ఒళ్లంతా రక్తంతో తడిచివచ్చన క్రిష్ ని చూసి సత్య కంగారుపడుతుంది.. మహాదేవయ్య సంతోషిస్తాడు.నా పేరు నిలబెట్టావ్.. నా కొడుకువి అనిపించకున్నావ్...ఇన్నాళ్లూ నాకోసం చేసింది చాలు..ఇక నీకు నచ్చినట్టు బతుకు..నన్ను నీ బాపునే కాదనుకో అంటాడు
2/8

ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా ప్రాణం పోయినా కానీ నీ ప్రాణం కోసమే ఆలోచిస్తానేను.. ఎవడో నీతో పెట్టుకుంటే నేను సైలెంట్ గా ఉంటే నీ కొడుకునే కాదు..నాలో ఉన్నది నీ రక్తం బాపూ.. నీపై ఈగకూడా వాలనివ్వలు అని ఎమోషనల్ అవుతాడు క్రిష్
3/8

చిన్నా...బాపూ ఆమాట ఏదో మాటవరసకి అన్నారులే అని తల్లి భైరవి చెబుతుంది..కానీ మాట వరసకి అన్నా తట్టుకోలేనమ్మా అంటాడు క్రిష్.
4/8

చిన్నాకి తలస్నానం చేయించి లోపలకు తీసుకురా అని భైరవి..సత్యను ఆదేశిస్తుంది.. అది ఈ ఇంటి ఆనవాయితీ అని పంచ్ వేస్తాడు మహదేవయ్య. సత్య క్రిష్ కి స్నానం చేయిస్తుంది...
5/8

క్రిష్ పై కోపంతో రగిలిపోతుంటుంది సత్య.. కొద్ది రోజులు ఓపికపట్టు సత్యా నీకు నచ్చినట్టే ఉంటానని చెబుతాడు. నీ ఒంటికి అంటిన రక్తం తేలిగ్గా కడిగేసుకున్నావ్ కానీ.. నా కళ్లలోంచి ఆ రక్తం పోవడం లేదంటుంది సత్య.. నీకు ఏదైనా జరిగితే నా పరిస్థితేంటని బాధపడుతుంది.
6/8

నా బాపు నా బలం నువ్వు ఆయన్ను సరిగా అర్థం చేసుకోలేదంటాడు. మీ బాపు తన స్వార్థం కోసం ఆలోచిస్తున్నారని అంటుంది. తండ్రిని తిడుతున్న సత్యపై క్రిష్ ఫైర్ అవుతాడు..ఆవేశం ఆపుకోలేక గొంతుపట్టుకుంటాడు...నా బాపు గురించి మాట్లాడితే రాక్షసుడిని అయిపోతా అంటాడు
7/8

నువ్వు మన చుట్టూ గీసిన గీతనే చూడు..మన గురించి మాత్రమే ఆలోచించు...నేను నిన్ను ప్రేమిస్తున్నా..నీకు ఏ లోటూ రాకుండా చూసుకుంటానని సర్దిచెబుతాడు..
8/8

మహదేవయ్యపై అటాక్ చేసిన వ్యక్తి ఫొటో తీసుకొచ్చి ఇస్తాడు క్రిష్.. వీడిని పట్టుకుంటే నీపై అటాక్ చేసింది ఎవరో తెలిసిపోతుందంటాడు.. ఆ మాట విని రుద్ర - మహదేవయ్య షాక్ అవుతారు.. ఇప్పటికే ఈ ఫొటో పోలీసులకు పంపించానంటుంది సత్య... సత్యభామ సెప్టెంబరు 28 ఎపిసోడ్ లో ఇదే హైలెట్ సీన్
Published at : 27 Sep 2024 10:29 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















