YSRCP  high command causing confusion In candidates :  కొడాలి నానికి గుడివాడలో టిక్కెట్ లేదంటూ జరిగిన ప్రచారం ఏపీ వ్యాప్తంగా హైలెట్ అయింది. ఆయనను గన్నవరం పంపుతున్నారని ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని లాంటి లీడర్ కే ఈ పరిస్థితి ఉంటే.. పార్టీలో మరే నేతకూ టిక్కెట్ గ్యారంటీ లేనట్లే. ఈ గందరగోళం సుదీర్ఘంగా సాగుతోంది. జాబితాలు ప్రకటించిన వారికి టిక్కెట్ కన్ఫర్మ్ అని చెప్పడం లేదు.  వారి స్థానాల్లోనూ రోజుకో పేరు తెరపైకి వస్తోంది. మైలవరం నుంచి తిరుపతిరావు అనే నేతను ఇంచార్జ్ గా ప్రకటించారు కానీ తాజాగా టీడీపీ నుంచి చేరిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఇస్తారని అంటున్నారు. పెనుమలూరు ..విజయవాడ ఎంపీ ఇలా అనేక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు టెన్షన్ కు గురవుతున్నారు ప్రచారం చేసుకోవాలా.. చివరికి క్షణంలో పేర్లు మార్చేస్తారా అని ఆందోళనకు గురవుతున్నారు. కానీ ఖచ్చితంగా మీరే అభ్యర్థి వైసీపీ హైకమాండ్ ఇంత వరకూ ఎవరికీ చెప్పడం లేదు.  


అభ్యర్థులు కాదు సమన్వయకర్తలే నియామం ! 
 
 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్ ఏడు జాబితాలను రిలీజ్ చేశారు. వారే అభ్యర్థులు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ సీఎం జగన్ రిలీజ్ చేస్తోంది అభ్యర్థుల జాబితా కాదు.. కేవలం సమన్వయకర్తల జాబితా మాత్రమే.   విడుదల చేస్తున్న  జాబితాలన్నీ పూర్తిగా మార్పు, చేర్పులకు సంబంధించినవే. జాబితాలో చోటు లేని వారు ఇప్పటికైతే సేఫ్‌గా ఉంటున్నారు. మందు ముందు కసరత్తులో వారి పేర్లు ఉంటాయా ఉండవా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అయితే మార్పు చేర్పుల్లో సీట్లు కోల్పోయిన వారు.. సీట్ల మార్పిడికి గురైన వారిలో అసంతృప్త వాదులు ఇవి సమన్వయకర్తల నియామకం మాత్రమే అని.. అభ్యర్థులు కాదని తేల్చి చెబుతున్నారు. రెండు నెలల్లో ఏమైనా జరగొచ్చినా  బీఫాం మాకే తప్పక వస్తుందని వారు దీమాగా ఉన్నారు. టిక్కెట్లు దక్కని ఎమ్మెల్యేలు కొంత సైలెంట్ గా ఉంటున్నారు కానీ.. తమకు చాన్స్ రాదని అనుకోవడం లేదు. చివరి క్షణంలో అయినా తమకే టిక్కెట్ ఇస్తారని అనుకుంటున్నారు.   పార్టీ బలమే కాదని. తమ బలం కూడా ఉందని.. తమని కాదంటే పార్టీ గెలవదనే సంకేతాలు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో సమన్వయకర్తలుగా పేరు లేకపోయినా టిక్కెట్లు తమకే వస్తాయని వారు అనుచరులకు చెబుతున్నారు.   


ఇంతకీ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ ? - కాంగ్రెస్‌లోనే కాదు బీజేపీలో చేరినా ఆజ్ఞాతంలోనేనా ?


తమను జగన్ కాదనలేరని కొంత మంది గట్టి నమ్మకం


ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే పాతుకుపోయి ఉంటారు. కొత్త నియోజకవర్గానికి వెళ్లాలంటే చాలా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలి. అక్కడ ఉండే క్యాడర్ ను తమ దారిలో నడిపించుకోవాలంటే వారి ఆశల్ని అంచనాల్ని అందుకోవాల్సి ఉంటుంది. అదేమంత చిన్న విషయం కాదు. వైఎస్ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం తమ పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్దగా ఏమీ ఒరగలేదన్న అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎంతోకొంత వెనుకేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇది కొత్త ఇంచార్జులక అవగతమవతోంది. అదే సమయంలో  తమ నియోజకవర్గంలో పెంచుకున్న పట్టు, క్యాడర్ ను.. కొత్త నేతకు ధారదత్తం చేయడానికి సిద్ధంగా ఉండరు. అందుకే నియోజకవర్గం నుంచి  వెళ్లేదమీ ఉండదని.. ఇంకా   సమయం ఉన్నందున కంగారు పడాల్సిందేమీ లేదని అంటున్నారు. తాము ఉన్న నియోజకవర్గం నుంచే పోటీ చేస్తామని చెబుతున్నారు. తాము సహకరించకపోతే పార్టీ గెలవదన్న విషయాన్ని హైకమాండ్ కు బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


కలిసేందుకు ఆసక్తి చూపని పవన్ కల్యాణ్ - ముద్రగడకు దారేది ?
 
అభ్యర్థులుగా చెప్పని వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్


వైఎస్‌ఆర్‌సీపీ హైకమాండ్ కూడా వీరందర్నీ నియోజకవర్గ సమన్వయకర్తలుగానే  చెబుతోంది. అభ్యర్థులుగా చెప్పడం లేదు. కానీ సమన్వయకర్తల్ని అభ్యర్థులుగానే ట్రీట్ చేస్తోంది. వారు ప్రజల్లోకి వెళ్లాలని .. గడప గడపకూ తిరగాలని చెబుతోంది. నియోజకవర్గాల మార్పు పొందిన వారంతా  అదేపనిలో ఉన్నారు.  తమకు  ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఇష్టం లేని వారు  మాత్రం ఆలోచిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్ సహకరించని చోట... ఇంకా సర్దుబాట్లకు ప్రయత్నిస్తున్నారు. అయితే హైకమాండ్ ఆలోచనల ప్రకారం చూస్తే వీరంతా అభ్యర్థులుగా ఉండే అవకాశమే  లేదని.. మార్పు చేర్పులు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నరు. 


చివరి క్షణంలో భారీ మార్పులు ఖాయమా ? 


వైఎస్ఆర్‌సీపీ మూడు జాబితాలు చూసిన వారికి వీరంతా నిజంగా అభ్యర్థులు అవుతారా అన్నసందేహం వచ్చింది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఊహించని విధంగా ఉన్నారు. వారు ఆయా నియోజకవర్గాల్లో తట్టుకోగలరా అన్న  ప్రశ్న కూడా వస్తోంది. అయితే అలాంటి వారు ఇవాళ కాకపోతే రేపైనా హైకమాండ్ తెలుసుకుంటుందని ఎన్నికల సమయానికి పరిస్థితిని తెలుసుకుని.. అభ్యర్తుల్లో మార్పు చేర్పులు చేస్తుందని నమ్ముతున్నారు. హైకమాండ్ ది కూడా అదే ఆలోచన. ఎన్నికల ముందు వరకూ.. పరిస్థితిని అంచనా వేసిన తర్వాతనే అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రకటించిన  జాబితాల్లోని వారిలో  కనీసం 30 శాతం మందికి మార్పు చేర్పులు ఉంటాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు సాధించిన వారు కాకుండా.. ఇతర నియోజకవర్గాల్లో ఏ పార్టీ తరపున అభ్యర్థులూ ఫైనల్ కారు. కూటమి అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాతనే వైసీపీ ఫైనల్ జాబితా రిలీజ్ చేసే చాన్స్ ఉందని నమ్ముతున్నారు.