అన్వేషించండి

YEAR ENDER 2023: ఈ ఏడాది సోషల్‌ మీడియాలో సెన్సేషన్ వీరే - ఎలా పాపులర్ అయ్యారో తెలుసా!

Social Media 2023: సోషల్‌ మీడియా వల్ల రాత్రికి రాత్రి ఎంతో మంది స్టార్లు అయ్యారు. ఈ ఏడాది కూడా ఐదుగురు స్టార్స్‌ అయ్యారు. ఎవరు వారు? ఎలా స్టార్స్‌ అయ్యారు? వారి కథేంటి..? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Social media stars in 2023: మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరం పూర్తయి, 2024లో అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ సంవత్సరం కూడా మనకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోతోంది. కొన్ని మంచి విషయాలు అయితే... కొన్ని చెడు విషయాలు జరుగుతుంటాయి. చెడ్డవి పక్కన పెడితే మంచి విషయాలను గుర్తుచేసుకుందామా. ప్రస్తుత కాలంలో  సోషల్ మీడియా ఎంతో మంది జీవితాల్లో, ఉద్యోగాల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఎవరినైనా రాత్రికి రాత్రే స్టార్లను చేయగలదు... అలాగే పైనుంచి అమాంతం కిందకి లాగేస్తుంది కూడా. ప్రతి సంవత్సరం లాగానే... ఈ ఏడాది కూడా సోషల్ మీడియా ద్వారా కొందరు బాగా ఫేమస్ అయ్యారు. అందులో అతికొద్ది మంది సోషల్ మీడియాలో బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ ఏడాది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఐదుగురి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1. సచిన్- సీమా జంట
పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్.. భారత్‌కు చెందిన సచిన్ మీనా. సోషల్ మీడియా వల్ల వీరిద్దరూ  చాలా ఫేమస్‌ అయ్యారు. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి  జరుగుతున్న చర్చలు కోకొల్లలు. పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్, భారత్‌కు చెందిన సచిన్ మీనా ప్రేమ వివాహం చేసుకున్నారు. సీమా 2023, మేలో తన నలుగురు  పిల్లలతో పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చింది. వీరిద్దరూ ఢిల్లీ సమీపంలోని నోయిడాలో నివసిస్తున్నారు. వీరి ప్రేమకథ పబ్‌జీ గేమ్ ఆడటంతో మొదలై పెళ్లితో ముగిసింది. దీంతో  వాళలిద్దరూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్‌ అయ్యారు. 

2. మిథిలేష్‌ భాటి
సీమా హైదర్-సచిన్ మీనా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. వీరి వల్ల వారి పొరుగున ఉన్న మిథిలేష్ భాటి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. సచిన్  మీనా-సీమా హైదర్ గురించి... ఈ ఇద్దరి ఇరుగుపొరుగు వారితో మీడియా ప్రతినిధులు మాట్లాడారు. ఆ సమయంలో సచిన్‌ను లప్పు లాంటివాడు... సచిన్‌లో ఏముంది?  అతను క్రికెట్ లాంటి అబ్బాయి.. ఆమె అతన్ని ప్రేమిస్తుంది తని తెలిపింది. మిత్లేష్ భాటి మాట్లాడిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై వేలల్లో మీమ్స్‌  వచ్చాయి. దీంతో సాధారణ మహిళ అయిన మిథిలేష్‌ భాటి... రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది.

3. SDM జ్యోతి మౌర్య
జ్యోతి మౌర్య... ఉత్తరప్రదేశ్‌లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్. జ్యోతి మౌర్యపై ఆమె భర్త అలోక్ నాథ్ చేసిన ఆరోపణలు సోషల్‌ మీడియాలో హైలెట్‌ అయ్యాయి. సూర్యవంశం  సినిమాలో వెంకటేష్‌.. తన భార్య మీనాను బాగా చదివించి కలెక్టర్‌ను చేస్తారు. అలాగే...  పారిశుధ్య కార్మికుడిగా ఉన్న అలోక్ నాథ్‌.. జ్యోతి మౌర్యను చదివించి సబ్ డివిజనల్  మేజిస్ట్రేట్ చేశాడు. అయితే... ఉద్యోగంలో చేరిన తర్వాత ఆమె తనను మోసం చేసిందని.. సీనియర్ అధికారి మనీష్ దూబేతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపించారు.  వీరిద్దరి మధ్య జరిగిన ఈ వివాదం సోషల్ మీడియాలో హెడ్‌లైన్‌ అయ్యింది. 

4. సింగర్ అమర్జీత్ జైకర్
బిహార్‌కు చెందిన అమర్‌జీత్ జైకర్‌ ఓ సింగర్. అతని గాత్రం చాలా బాగుటుంది. 2023లో అమర్జీత్ జైకర్ పాడిన పాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.  బిహార్‌కు చెందిన అమర్జీత్ జైకర్‌ అనే వ్యక్తి పాటలు పాడే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. అతని వీడియో అతి తక్కువ సమయంలోనే బాగా పాపులర్  అయ్యింది. బాలీవుడ్‌లోని చాలా మంది అతని ప్రతిభను ప్రశంసించారు. సోనూసూద్, హిమేష్ రేష్మియా కూడా అమర్‌జీత్ జైకర్‌కి అండగా నిలబిడ్డారు. 

5. జాస్మిన్ కౌర్
సోషల్ మీడియాలో సూట్‌లను కూడా విక్రయిస్తుంటారు. జాస్మిన్ కౌర్... ఓ సూట్‌ను మెచ్చుకుంటూ చాలా అందంగా ఉంది, చాలా బాగుంది.. జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఎ వావ్‌ అని  చెప్పింది. ఈ వీడియో కాసేపటికే వైరల్‌ అయ్యింది. సామాన్యుడి నుంచి బాలీవుడ్ తారల వరకు ఆమె డైలాగ్‌లను కాపీ కొట్టారు. దీంతో జాస్మిన్ కౌర్... సోషల్ మీడియాలో  పాపులర్‌ అయ్యారు. అంతేకాదు... ఆమె వ్యాపారంలో కూడా జోరు పెరిగింది. 

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget