Zombie Disease In Canada: వైరస్‌ల కాలం! ఏది పడితే అది తినకండి సామీ! జాంబీ వైరస్ బయల్దేరింది!

ప్రపంచాన్ని వేటాడటానికి మరో వైరస్ సిద్ధమైంది. కెనడాలో జింకల్లో జాంబీ వైరస్‌ను గుర్తించారు. ఇది మనుషులకు సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

FOLLOW US: 

ప్రపంచంపై వైరస్‌లు పగ పట్టినట్లు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి దండయాత్రలు చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం వచ్చిన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తాజాగా మరో రూపం మార్చుకుని ఒమిక్రాన్ XE వేరియంట్‌గా వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది దాదాపు 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ గురించి ప్రజలు భయపడుతుంటే తాజాగా మరో వైరస్ బయల్దేరింది. అదే జాంబీ వైరస్. అసలేంటి ఈ వైరస్?

ఏం జరుగుతోంది?

కెనడాలో ప్రాణాంతక డేంజరస్‌ వైరస్‌ బెంబేలెత్తిస్తోంది. అదే జాంబీ వైరస్‌. కెనడాలోని జింకల్లో ఈ జాంబి వైరస్‌ బయటపడింది. జాంబీ సినిమాల్లో చూపించినట్లే ఇక్కడ జరుగుతోంది.  జాంబీ సోకిన మనిషి కరిచిన వాళ్లు కూడా జాంబీగా మారతారు. అలాగే ఇప్పుడు కెనడాలో జాంబీ సోకిన జింకలు..ఇతర జింకలను చంపి తింటున్నాయి. జింకల్లో ఈ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది.

25 ఏళ్ల తర్వాత

1996లోనే పశువుల్లో ఈ జాంబీ వైరస్‌ను గుర్తించారు. వాటి శాంపిల్స్‌ సేకరించి టెస్టులు చేయగా బ్యాక్టీరియా, ఇతర వైరస్‌ల జన్యు సమాచారం లభించింది. అప్పట్లో ఆ వ్యాధికి అడ్డుకట్ట వేశారు. మళ్లీ దాదాపు 25 ఏళ్ల తర్వాత జింకల్లో జాంబీ వైరస్‌ బయటపడటం టెన్షన్‌ పెడుతోంది.

మనుషులకు వస్తుందా?

ఈ వైరస్‌ జింకల నుంచి ఇతర జంతువులు, మనుషులకు కూడా వ్యాపించే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకిన జంతువు మాంసం తిన్నా, దాని మలమూత్రాలు, లాలాజలం ముట్టుకున్నా కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. వేటగాళ్లు జాగ్రత్తగా లేకపోతే పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉందంటున్నారు.

అయితే ఇప్పటివరకు మనుషుల్లో ఒక్క జాంబీ కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పిటకీ జాగ్రత్తగా ఉండటం మంచిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Also Read: Intelligence Report: భారత పవర్ గ్రిడ్‌పై చైనా హ్యాకర్ల దాడి- ఇవేం పనులురా నాయనా? 

Published at : 07 Apr 2022 03:09 PM (IST) Tags: canada Deer Zombie Virus Experts Warn Hunters Eaters Zombie Disease In Canada

సంబంధిత కథనాలు

Texas School Shooting :  మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?

Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?

International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!

International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!

Imran Khan: పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ డెడ్‌లైన్- 6 రోజుల్లోగా చేయకపోతే!

Imran Khan: పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ డెడ్‌లైన్- 6 రోజుల్లోగా చేయకపోతే!

Viral Video: కాక్‌పిట్‌లోనే అంతా కానిచ్చేశారు- ట్రైనీతో పైలట్ రొమాన్స్!

Viral Video: కాక్‌పిట్‌లోనే అంతా కానిచ్చేశారు- ట్రైనీతో పైలట్ రొమాన్స్!

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

టాప్ స్టోరీస్

Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Mahanadu Chandrababu :  నేను వస్తా.. దోచినదంతా  కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

YSR Rythu Ratham: ఏపీలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇలా అప్లై చేసుకోండి - లాస్ట్ డేట్ ఎప్పుడంటే

YSR Rythu Ratham: ఏపీలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇలా అప్లై చేసుకోండి - లాస్ట్ డేట్ ఎప్పుడంటే

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం