అన్వేషించండి

అమెరికాలో భారతీయ విద్యార్థికి ఘోర అవమానం- అధికారుల అమానవీయతపై భగ్గుమంటున్న సమాజం

Viral video : న్యూవార్క్ విమానాశ్రయంలో భారతీయ విద్యార్థిని చిత్రవధ చేసిన అమెరికా అధికారులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Viral video : న్యూవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా అధికారులు ఒక భారతీయ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న విధానం సంచలనంగా మారుతోంది. బలవంతంగా నేలపై తొక్కిపెట్టి చేతులకు సంకెళ్లు వేసినట్లు చూపించే ఒక వీడియో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనిపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఘాటుగా స్పందించింది.  

వైరల్ అయిన ఈ ఫుటేజ్ తీవ్ర భావోద్వేగాన్ని రేపింది. నలుగురు విమానాశ్రయ అధికారులు ఆ విద్యార్థిని తొక్కిపెడుతుండగా అతను ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఇద్దరు అధికారులు అతని వీపుపై మోకాళ్లతో కూర్చున్నారు. అతని చేతులు, కాళ్ళను కలదకుండా పట్టేశారు. ఈ క్లిప్ అనేక విమర్శలకు దారి తీస్తోంది. ఇది ఓ అమానవీయ ఘటనగా అభివర్ణించారు.

ఈ వీడియోను భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు కునాల్ జైన్ షేర్ చేశారు. "నిన్న రాత్రి న్యూవార్క్ విమానాశ్రయం నుంచి ఒక భారతీయ విద్యార్థిని బహిష్కరిస్తున్న ఘటన నేను చూశాను. చేతికి సంకెళ్లు వేసి, నేరస్థుడిలా వ్యవహరించారు" అని జైన్ X లో ఒక పోస్ట్‌లో రాశారు. "అతను తన కలలను సాకారం చేసుకునేందుకు ఇక్కడకు వచ్చాడు. అతను ఎవరికి ఎలాంటి హాని చేయలేదు. ఒక NRIగా నేను నిస్సహాయుడినే. చాలా బాధ కలిగింది. ఇది ఒక మానవ విషాదం." అని పేర్కొన్నారు. 

ఈ విషయంపై దర్యాప్తు చేసి విద్యార్థికి సహాయం అందించాలని భారత రాయబార కార్యాలయాన్ని జైన్ కోరారు.

చర్యలు చేపట్టిన భారత రాయబార కార్యాలయం  
ఈ వీడియోపై పెరుగుతున్న అసంతృప్తిని గ్రహించిన భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఈ ఘటనపై స్థానిక అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ స్పష్టం చేసింది. 

“న్యూవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక భారతీయ పౌరుడు ఇబ్బందులను ఎదుర్కొన్నాడని సోషల్ మీడియా పోస్ట్‌లు చూశాము” అని కాన్సులేట్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. “ఈ విషయంలో మేము స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నాము. భారతీయ పౌరుల సంక్షేమానికి కాన్సులేట్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది.”అని పేర్కొంది. 

ఆ విద్యార్థి ఎవరు, బహిష్కరణకు సంబంధించిన సమాచారం తెలియడం లేదు. వీడియోలో అదను హిందీలో మాట్లాడుతున్న విషయం గమనించవచ్చు. నేను పిచ్చివాడిని కాదు; వారు నన్ను పిచ్చివాడిని చేయడానికి ప్రయత్నిస్తున్నారు, నేను పిచ్చివాడిని అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు.” అని ఏడుస్తూ చెబుతున్నాడు. 

భద్రతా ముప్పు అనే కోణంలో కాకుండా కమ్యూనికేషన్ ఫెయిల్యూర్‌తోనే జరిగిందనే అనుమానం వ్యక్తమవుతోంది.  
"ఎంట్రీ దగ్గ ఏదో తప్పు జరిగి ఉండవచ్చు. అతను పిచ్చివాడని వారు నమ్మితే దాన్ని డీల్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అతని ఇలా అగౌరవ పరచాల్సిిన పని లేదు." అని జైన్ పోస్టులో పేర్కొన్నారు. 

గతం గుర్తు చేస్తున్న నెటిజన్లు 
ఈ ఘటనతో గతంలో జరిగిన విషయాలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో 100 మందికిపైగా భారతీయులను అమెరికా నుంచి సంకెళ్లతో పంపించారు. ఆ సమయంలో అమెరికా అధికారులు షేర్ చేసిన వీడియోలు అప్పట్లోనే సంచలనం కలిగించాయి. జైలు నుంచి తరలించే ఖైదీలు మాదిరిగా వారికి సంకెళ్లు వేశారు. వాటిపై భారత్‌ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. విదేశాల్లో ఉన్న పౌరులను రక్షించడానికి బలమైన దౌత్య చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి.

ఇప్పుడు బహిరంగంగా మరొక భారతీయుడిని నిర్బంధించిన దృశ్యాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అమెరికా సరిహద్దులలో భారతీయ పౌరులను న్యాయంగా చూసుకుంటున్నారా? వారి హక్కులను కాపాడటానికి దౌత్యపరంగా తగినంత చర్యలు తీసుకుంటున్నారా? అనేది వేచి చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకి బెయిల్‌!
మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకి బెయిల్‌!
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget