అన్వేషించండి

US-Iran War: ఈ రాత్రి కాళరాత్రే! ఇరాన్‌కు డొనాల్ట్ ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక! ఒక నాగరికత అంతం కాబోతోందని వార్నింగ్!

US-Iran War: డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌కు ఆఖరి వార్నింగ్ ఇచ్చారు. హర్ముజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీన్ని సైకోపాత్ హెచ్చరికగా టెహ్రాన్ కొట్టిపారేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ట్రంప్‌ ఇరాన్‌ను దెబ్బతీస్తామని, నాగరికత అంతరిస్తుందని హెచ్చరించారు.
  • హర్మూజ్ జలసంధిని తెరవాలని, లేదంటే కీలక మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని తెలిపారు.
  • ఇరాన్‌ ట్రంప్‌ను సైకోపాత్‌గా అభివర్ణిస్తూ, ప్రతిదెబ్బకు సిద్ధమని బదులిచ్చింది.
  • ఐక్యరాజ్యసమితి పౌర సదుపాయాలపై దాడులను అంతర్జాతీయ చట్ట ప్రకారం నిషేధించింది.

US-Iran War: అమెరికా ఇరాన్ మధ్య దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వం తన మొండి వైఖరి వీడకపోతే, ఆ దేశం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాల వేళ అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్ ఖాతాలో తీవ్ర పదజాలంతో ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ రాత్రికి ఒక మొత్తం నాగరికత అంతరించిపోతుంది, అది మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అది జరుగుతుంది"అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌లో 47 ఏళ్లుగా కొనసాగుతున్న అవినీతి,దోపిడీ, మరణాల యుగం ముగియబోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘట్టం ప్రపంచ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన క్షణాల్లో ఒకటిగా నిలిచిపోతుందని ట్రంప్ అభివర్ణించారు. 

ఈ హెచ్చరికకు సంబంధించి ట్రంప్ ఒక స్పష్టమైన గడువును విధించారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలలోపు అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఐదున్నర గంటలలోపు  ఇరాన్ తన షరతులకు లొంగిపోవాలని  ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ గడువు ముగిసిన తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. 

ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం హర్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గాన్ని ఇరాన్ అడ్డుకోవడమే ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఇరాన్ వెంటనే ఈ జలసంధిని తెరవాలని, లేదంటే ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలను బాంబులతో నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌ను తిరిగి రాతి యుగంలోకి నెట్టేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యాలు యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో సూచిస్తోంది. 

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. టర్కీలోని ఇరాన్ రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, ట్రంప్‌ను ఒక సైకోపాత్‌గా అభివర్ణించింది. " అలెగ్జాండర్ దీనిని దహనం చేశాడు. మంగోలులు నాశనం చేశారు. చరిత్ర దీనిని పరీక్షించింది. కానీ ఇరాన్ ఇంకా ఇక్కడే ఉంది. ఒక సైకోపాత్ హెచ్చరికలు కాలం సాధించలేని దానిని అంతం చేయలేవు." అని ఇరాన్ ఘాటుగా బదులిచ్చింది. తమ ప్రాచీన నాగరికత జోలికి వస్తే ఆమెరికా, దాని మిత్రదేశాలు ఎప్పటికీ మరిచిపోలేని దెబ్బ తింటాయని ఇరాన్ హెచ్చరించింది. 

Trump Truth Social post warning Iran ahead of 8pm ET deadline.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్ ‌స్పందించారు. పౌరులకు  చెందిన సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషేధమని ఆయన గుర్తు చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ ఇరాన్‌లో తాము అనుకున్న యుద్ధ లక్ష్యాలను అమెరికా ఇప్పటికే సాధించిందని, ఇప్పుడు తదుపరి అడుగు వేయాల్సింది ఇరాననేనని పేర్కొన్నారు. 

మధ్యవర్తులు 45 రోజుల పాటు కాల్పులు విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఇరాన్ కేవలం కాల్పుల విరమణ మాత్రమే కాకుండా యుద్ధం పూర్తిగా ముగియాలని పట్టుబడుతోంది. 

Frequently Asked Questions

అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఎందుకు తీవ్రమయ్యాయి?

ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవడం అమెరికా ఆగ్రహానికి ప్రధాన కారణం.

డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఏమని హెచ్చరించారు?

ఇరాన్ తన మొండి వైఖరి వీడకపోతే, ఆ దేశం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని, విద్యుత్ కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలను బాంబులతో నేలమట్టం చేస్తామని హెచ్చరించారు.

ట్రంప్ ఇరాన్‌కు ఎలాంటి గడువు విధించారు?

అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలలోపు, భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఐదున్నర గంటలలోపు ఇరాన్ షరతులకు లొంగిపోవాలని డిమాండ్ చేశారు.

ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఎలా స్పందించింది?

ఇరాన్ ట్రంప్‌ను సైకోపాత్‌గా అభివర్ణిస్తూ, తమ ప్రాచీన నాగరికత జోలికి వస్తే అమెరికా, దాని మిత్రదేశాలు ఎప్పటికీ మరిచిపోలేని దెబ్బ తింటాయని హెచ్చరించింది.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఏమి స్పందించింది?

పౌరులకు చెందిన సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషేధమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుర్తు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Iran US War: చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget